భర్త భార్య Part 2 247

నందు తో పాటు నందు అమ్మగారు వస్తే గౌతమ్ నాన్నగారు గౌతమ్ అమ్మగారు వచ్చి నందు గౌతమ్ ల చేత గృహప్రవేశం చేయించి వాళ్లతో పాటు ఒక నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతారు….

అలా గౌతమ్ నందు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు…. గౌతమ్ ఆఫీస్ కి వెళ్ళాక నందు ఒక్కతే ఇంట్లో ఉంటూ రోజు మొత్తం బోర్ కొడుతుంది అని టీవీ కొని టీవీ పెట్టిస్తాడు….(అపార్ట్మెంట్లో అంతే ఉంటుంది….. ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా ఇంట్లోనే కూర్చుంటారు)

నందు హ్యాపీగా గౌతమ్ ని కౌగిలించుకొని “గౌతమ్ నువ్వు ది బెస్ట్ హస్బెండ్…” అని అంటుంది

“మరి నీకు చదువుకోవాలని ఉంటే చెప్పు నేను ఎంబీఏ సీట్ తీసుకుంటాను…” అని అడుగుతాడు

“లేదు గౌతమ్ నాకు చదువంటే ఇష్టం లేదు….. డిగ్రీ నే ఏదో అరకొర మార్కులతో పాసయ్యాను…. నావల్ల కాదు బాబు ఈ చదువులు…. ప్రస్తుతానికి నీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చెయ్యాలని ఉంది…. తర్వాత మనకి పిల్లలు పుడితే ఆ పిల్లలతోనే నాకు రోజంతా సరిపోతుంది….. అప్పటివరకు ఇద్దరం కలిసి ఈ సిటీ అంతా చక్కర్లు కొడుతూ ఫుల్ గా ఎంజాయ్ చేయాలి కదా!!!! అందుకే ఈ చదువు గిదువు నా వల్ల కాదు….. నువ్వు సంపాదించు నేను ఇంట్లో కూర్చుని తింటాను…” అని నవ్వుతూ అంటుంది

నందు మాటలకి గౌతమ్ నవ్వుకుంటూ “సరే మరి పిల్లల్ని కనే వరకూ ఎంజాయ్ చేయాలి కదా మరి ఎంజాయ్ చేద్దాం పదా!!!!” అని చెప్పి నందుని ఎత్తుకుని బెడ్ రూం లోకి తీసుకు వెళ్తాడు

“ఇప్పుడేంటి గౌతమ్ అది మధ్యాహ్నం పూట!!!” అని కంగారుగా అడుగుతుంది

నాకు దొరికేదే రెండు రోజుల హాలిడేస్…. అందులో ఒక రోజు ఆఫ్టర్నూన్ వరకు వర్క్ ఉంటుంది…. ఆఫ్టర్ నూన్ నుంచి రెస్ట్ తీసుకుంటాను…. ఇక ఈ రోజే కదా నాకు మిగిలింది కనీసం ఈ రోజైనా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదా!!! అందుకే ఇలా!!!” అని చెప్పి నందుని ఆక్రమించుకుంటాడు

గౌతమ్ టీవీ కొన్నాక పెళ్లయిన కొత్తలో గౌతమ్ ఆఫీస్ నుంచి రాగానే అలసటగా సోఫాలో నందు పక్కనే కూర్చుని “నందు కొంచెం కాఫీ ఇవ్వవా….” అని అడుగుతాడు

టీవీ లో మునిగి పోయిన నందు గౌతమ్ చెప్పింది వినిపించుకోదు…. గౌతమ్ “నందు”అని అంటూ నందు భుజాలు కదిపి “ప్లీజ్ కొంచెం కాఫీ ఇవ్వవా చాలా చిరాకుగా ఉంది….” అని అంటాడు

“అలాగే గౌతమ్ ఇప్పుడే తెస్తాను….” అని చెప్పి హడావిడిగా పాలు కాచి ఉండటం వలన వెంటనే కాఫీ కలుపుకొని తీసుకువచ్చి గౌతమ్కి ఇచ్చి వెంటనే తన పక్కన కూర్చుని టీవీ సీరియల్ లో మునిగి పోతుంది…..

గౌతమ్ కాఫీ ఒక్క సిప్ చేసి వెంటనే షింక్ దగ్గరికి వెళ్లి నోట్లో ఉన్న కాఫీ ఊసేస్తాడు….

“ఏంటి నందు ఇది కాఫీ ఇవ్వమంటే కషాయం ఇచ్చావు??? అయినా ఇదేంటి ఇంత ఉప్పగా ఉంది???” అని కోపంగా అడుగుతాడు

“ఏంటి గౌతమ్ ఇది నేను టీవీ సీరియల్ చూస్తూ ఉంటే డిస్టర్బ్ చేస్తున్నావు??? ప్లీజ్ నన్ను కొంచెం సేపు డిస్టర్బ్ చేయకు….. సీరియల్ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు మీకు కావాల్సినట్టుగా కలిపిస్తాను….” అని విసుగ్గా అంటుంది

గౌతమ్ షాక్ గా “అంటే టీవీ సీరియల్ చూస్తూ కాఫీ ఇలా కలిపి ఇచ్చావా తల్లి???? ఇంకెప్పుడు నువ్వు ఇలా సీరియల్ చూస్తూ నాకు కాఫీ ఇవ్వకు….. ఇంకొకసారి ఉప్పు బదులు ఏదైనా గమీషన్ వేసావు అంటే ఏకంగా పైకే పోతాను….” అని భయంగా అంటాడు

నందు టీవీ సీరియల్ లో మునిగిపోయి “ఆ సరే సరేలే నీకు కావాల్సినట్టుగానే చేసి పెడతాను ప్రస్తుతానికి ఫ్రెష్ అయి రా పో అంతలోపు వంట రెడీ చేస్తాను…” అని అంటుంది

గౌతమ్ నందు ని ఒకసారి చూసి సైలెంట్ గా తన రూమ్ లోకి వెళుతూ మనసులో “అనవసరంగా టీవీ కొన్నాను ఇది టీవీ చూస్తూ పని కూడా చేయడం లేదు…. ఏంటో ఈ జీవితం???” అనుకుంటూ వెళ్ళిపోతాడు

అలా ఇద్దరు చిన్న చిన్న చిలిపి గొడవలతో హ్యాపీగా నడిపిస్తూ రెండు నెలలు టైం తెలియకుండానే గడిచి పోతుంది…..

ఒకరోజు గౌతం సాయంత్రం 7:00 ఎప్పుడు ఇంటికి వచ్చేసరికి నందు సోఫాలో కూర్చుని ఏడుస్తూ టీవీ చూస్తూ ఉంటుంది…..

గౌతమ్ వెంటనే కంగారుగా వెళ్లి నందు పక్కన కూర్చుని తనని దగ్గరికి తీసుకొని ఏమైంది నందు ఎందుకు ఏడుస్తున్నావ్??? మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న బాగానే ఉన్నారా??? ఏం జరిగింది???” అని కంగారుగా అడుగుతాడు

నందు చేయి తిప్పి ఎటువైపో చూపిస్తుంది…..

గౌతమ్ అటు వైపు చూసి షాక్ అయిపోతాడు…..

గౌతమి ఎందుకు షాక్ అయ్యారు అంటే టివి సీరియల్ లో మన కార్తీక దీపం లోని వంటలక్క ఏడుస్తూ ఉంటుంది…..

అది చూసి గౌతమ్ అయోమయంగా “అందుకు ఏడుస్తున్నావా???” అని అడుగుతాడు

“అవును గౌతమ్ మన వంటఅక్క ఎలా ఏడుస్తుందో!!!! డాక్టర్ బాబు ఇప్పటివరకు వంటలక్క ని ఏడిపించాడు….. ఇప్పుడు ఆ డాక్టర్ పిల్ల ఏడిపిస్తుంది….. దాన్ని ఏం చేసినా పాపం లేదు…..” అని ఏడుస్తూ ముక్కు చేతి గౌతం షర్ట్ కి రాస్తూ అంటుంది

గౌతమ్ వెంటనే కోపంగా పైకిలేచింది ” ఛీ ఛీ ఏంటి ఇది???”అని తన షర్ట్ కర్చీఫ్ తో తుడుచుకొని నందు వైపు కోపంగా చూస్తూ “నీకు బోర్ కొడుతుందేమోనని టీవీ కొన్ని పెద్ద తప్పు చేశాను….. నువ్వు ఇలా సీరియల్స్ కి ఎడిక్ట్ అయి అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఇలా ఏడుస్తావు అనుకోలేదు…. ఇప్పుడే ఈ టీవీ పగలగొట్టేస్తాను…. అప్పటికి కాని నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది….” అని కోపంగా చెప్పి టీవీ దగ్గరికి వెళుతూ ఉంటే