భర్త భార్య Part 2 247

నందు వెంటనే కోపంగా పైకి లేచి “ఆ పని చేసావ్ అంటే నీకు ఫుడ్ బెడ్ రెండు కట్ చేస్తాను…. నేను సీరియల్స్ కూడా చూడకూడదా ఏంటి???? ఇలా నాకు రిష్ట్రిక్షన్స్ పెట్టకూడదు అని పెళ్లికి ముందే చెప్పాను కదా!!!! నాకు ఇలాంటివన్నీ నచ్చవు గౌతమ్….”అని అంటుంది

“మరి నేను వచ్చేసరికి నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేనేం అనుకోవాలి???? నువ్వు అలా ఏడుస్తూ ఉంటే ఇంకా ఏం జరిగిందో అని నేను ఎంత టెన్షన్ పడ్డాను??? ఒకపక్క ఆఫీసులో టెన్షన్స్ మరోపక్క ఇదంతా ఏంటి?????నాకు ఇంటికి రావాలంటే నా తల నొప్పి పుడుతుంది….” అని అసహనంగా అంటాడు

నందు వెంటనే ఏడుస్తూ “అంతేలే నేనంటే నీకు అప్పుడే ప్రేమ తగ్గిపోయింది…. పెళ్లయి కనీసం 2 నెలలు కూడా కావట్లేదు అప్పుడే ఇలా మాట్లాడుతున్నావు??? ఇప్పుడే ఇలా ఉంటే రేపు నువ్వు నన్ను కొట్టావు అని గ్యారెంటీ ఏంటి??? నాకు నీ మీద నమ్మకం లేదు … నేను నా పుట్టింటికి వెళ్ళి పోతాను….” అని అంటుంది

గౌతమ్ షాక్ అయ్యి “ఇంత చిన్న మాటకి అంత పెద్ద డెసిషన్ ఎందుకు నందు??? సరేలే నీ ఇష్టం వచ్చింది చేసుకో!!!” అని కోపంగా అంటాడు

“అయితే నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా వంట చేస్తాను….” అని అంటుంది

గౌతమ్ ఇక ఏమీ చేయలేక సైలెంట్ గా లోపలికి వెళ్ళి పోయి మనసులో “ఏంటి ఇది జస్ట్ సీరియల్ కోసం ఏడుస్తుంది??? రియల్ లైఫ్ లో ఇలాంటివి జరిగితే తట్టుకుంటుందా???? ప్రపంచంలో రోజు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి…. ఈ టీవీ లో సీరియల్స్ చూస్తూ డైలీ ప్రపంచంలో జరిగే వాటిని పట్టించుకోవట్లేదు…. ఒక్కసారి అవి చూస్తే కనీసం లోకజ్ఞానం అయినా వస్తుంది కదా!!!! ఇలాంటివి చూసి మమ్మల్ని ఏడిపించడం కాకపోతే!!!!” అనుకుంటూ ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి నందు నవ్వుతూ వంట చేసి గౌతమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది

గౌతమ్ ముభావంగా వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే నందు గౌతమ్ అలా ముభావంగా ఉండటం నచ్చక బాధగా గౌతమ్ తో “ఇంకొకసారి నీతో ఇలా మాట్లాడడానికి గౌతమ్…. నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నేను ఇలా సీరియల్స్ చూస్తూ నీతో అలా బిహేవ్ చేయను ప్రామిస్….. నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చడం లేదు….. ప్లీజ్ గౌతమ్ మనం మునుపటిలా ఉందాము….” అని బాధగా అంటుంది

గౌతమ్ అనుమానంగా నందు వైపు చూస్తూ “నిజంగానే అంటున్నావా నందు??? ఇకనుంచి నేను వచ్చేసరికి సీరియల్స్ చూడకుండా ఉంటావా???” అని అడుగుతాడు

“ఆది మాత్రం చెప్పలేను గౌతమ్…. సీరియల్స్ చూస్తాను కానీ ఇలా నిన్ను మాత్రం ఇబ్బంది పెట్టను ప్రామిస్…..” అని అంటుంది

“సరేలే ఏం చేస్తాం చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు నువ్వు చెప్పిందే నేను వినాలి కానీ నేను చెప్పింది నువ్వేమైనా వింటావా ఏంటి???? మమ్మల్ని మీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నారు….” అని నిష్టూరంగా అంటాడు

నందు వెంటనే గౌతమ్ బుగ్గ మీద ముద్దు పెట్టి “నువ్విలా డల్ గా ఉంటే నాకు నచ్చడం లేదు గౌతమ్…. ఇప్పుడు నువ్వు హ్యాపీ గా అవ్వాలంటే నేను ఏం చేయాలి????” అని అడుగుతుంది

“నేను వచ్చేసరికి నువ్వు అందంగా రడీ అయ్యి నవ్వుతూ నన్ను పలకరించాలి…. అప్పుడే కదా మేము ఆఫీసులోని టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఇంటికి వచ్చాక సంతోషంగా మీతో టైం స్పెండ్ చేసేది….” అని అడుగుతాడు

నందు కొంచెం సేపు ఆలోచించి “సరే గౌతమ్ నువ్వు చెప్పినట్టే చేస్తాను…. ఇక సంతోషమా ముందు భోజనం చెయ్యి అన్నం చల్లారి పోతుంది…..” అని నవ్వుతూ అంటుంది