గౌతమ్ సరే అని నందుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తన నోటి దగ్గర అన్నం కలిపి పెట్టగానే నందు కంగారుగా “నువ్వు తిను గౌతమ్ ఇప్పటికే చాలా అలసిపోయి వచ్చావు కదా!!!!” అని ప్రేమగా అంటుంది
“నువ్వు కూడా ఆ సీరియల్స్ లో పడి సరిగా తినటం లేదు నందు… ముందు అవి తగ్గించు చూడు ఎంత సన్నగా అయిపోతున్నావో!!! ఇలా అయితే నిన్ను నేను సరిగా చూసుకోవడం లేదని మీ అమ్మ నాన్న అనుకుంటారు… అది నీకు ఇష్టమా???” అని ప్రేమగా తనకి తినిపిస్తూనే అడుగుతాడు
నందు ఒకసారి తనని తాను చూసుకుని అది నిజమే అనిపించి “సరే గౌతమ్ చెప్పాను కదా సీరియల్ పూర్తిగా మానేయను కానీ అవి చూడటం తగ్గించి టైం టూ టైం భోజనం చేస్తాను…. నావల్ల నీకు ఎప్పుడు చెడ్డపేరు రానివ్వను ప్రామిస్…. ఇప్పుడైనా నీ అలకమాని భోజనం చెయ్యి….” అని ఇప్పటికీ మూతి ముడిచి ఉన్న గౌతమ్ ని చూస్తూ అంటుంది
“ముందు నువ్వు’ అంటూ నందుకు తినిపిస్తూ తను తిని హ్యాపీగా నైట్ ఈ చేసుకొని ఉదయానికి ఎప్పుడో పడుకుంటారు….
అలా నందు తనకి కావాలి అనుకున్నది గౌతమ్ చేత కొనిపించుకోవటానికి ఒకసారి గౌతమ్ తో గొడవ పడుతూ ఒకసారి గౌతమ్ కోరికలు తీరుస్తూ తన కోరిక కూడా తీర్చుకుంటూ చిన్న చిన్న చిలిపి తగాదాలు గిల్లికజ్జా లతో తమ లైఫ్ ని హ్యాపీగా ఉంచుకుంటారు….
అలా చూస్తూ ఉండగానే మరో నాలుగునెలలు గడిచిపోతాయి…. కానీ డైలీ నందు మాత్రం తన అమ్మానాన్నలతో చెల్లెళ్లతో గౌతమ్ అమ్మానాన్నలతో మాట్లాడుతూ ఉంటుంది….
గౌతమ్ మాత్రం ఆఫీస్ పనుల్లో ఉండి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు….
అలాంటి టైమ్లోనే అపార్ట్మెంట్లోని పక్క ఫ్లాట్ ఆంటీ షాపింగ్ కి వెళుతూ నందుని కూడా తీసుకు వెళ్తుంది….. నందు కూడా సరే అని వెళ్లి అక్కడ పది వేల రూపాయల సారీ నచ్చి పట్టుబట్టి గౌతమ్ చేత కొనుక్కుంటుంది…..
ఇది జరిగింది….
ఇప్పుడు మనం ప్రెసెంట్ లోకి వచ్చేద్దాం….
ఉదయాన్నే లేచిన గౌతమ్ తన కౌగిలిలో నే పడుకొని ఉన్న నందుని చూసి “పడుకున్నప్పుడు ఎంత అమాయకంగా కనిపిస్తావు నందు!!!! కానీ నిద్ర లేచినప్పుడు అంత గయ్యాళి గా మారిపోతావు…. కానీ నాకు ఈ నందు కూడా నచ్చింది…..” అని నవ్వుకుంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి నందు అని తన భుజం తడుతూ లేపటానికి చూస్తాడు
“ఇంకొంచెం సేపు నిద్ర పోనివ్వడి గౌతమ్…. రాత్రంతా మీరు నన్ను వదిలారా???? అసలు నిద్ర పోనివ్వకుండా మళ్ళీ వెంటనే లేపుతున్నారు….నాకు చాలా అలసటగా ఉంది….. ప్లీజ్ గౌతమ్ కొంచెం సేపు పడుకో నివ్వండి….” అని పక్కకి వొత్తి గిల్లి మళ్ళీ పడుకుంటుంది
గౌతమి నవ్వుతూ “సరే అయితే నువ్వు నిద్రపో నేను ఫ్రెష్ అయి బయటకు ఏదో ఒకటి తినేసి ఆఫీస్ కి వెళ్ళి పోతాను….” అని చెప్పి నందు బుగ్గ మీద ముద్దు పెట్టి తనని పక్కన పడుకోపెడుతూ పైకి లేస్తూ ఉంటే నందు వెంటనే కళ్ళు తెరిచి గౌతమ్ వైపు చూస్తూ “టైం ఎంత అవుతుంది గౌతమ్???” అని ఆశ్చర్యంగా అడుగుతుంది
“ఆల్రెడీ 7 అయ్యింది ఇంకో వన్ అండ్ ఆఫ్ అవర్ లో నేను బయలుదేరాలి…. ఈ ట్రాఫిక్ లో ఆఫీస్కి వెళ్ళే సరికి 9:30 అవుతుంది అని నీకు తెలుసు కదా!!!”అని నవ్వుతూ అంటాడు
నందు వెంటనే పైకి లేచి జారిపోతున్న చీర సరి చేసుకుని జుట్టు ముడి వేసుకుంటూ “ఇంతసేపు పడుకున్నానా??? అయ్యో మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి రండి గౌతమ్ మీకు కాఫీ ఇచ్చి టిఫిన్ చేసి క్యారేజ్ ప్రిపేర్ చేస్తాను….” అని హడావిడిగా పైకి లేచి గౌతమ్ కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కిచెన్ లోకి వెళ్లి పోతుంది
గౌతమ్ నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్లి బయటికి వచ్చేసరికి నందు కాఫీ కప్పుతో నవ్వుతూ గౌతమ్ ఎదురుగా నిలబడి ఉంటుంది….
గౌతమ్ నవ్వుతూ కాఫీ తీసుకుని “నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి రా…. లేకపోతే లేచిన తర్వాత ఉదయాన్నే చాలా అనీజీ గా ఉంటుంది…..” అని అంటాడు
నందు భర్త ఏది చెప్తే అది వినే భార్యలా తల ఊపి ఫ్రెష్ అయ్యి రావడానికి వెళ్ళిపోతుంది….
“నిన్న దీనికి ఇష్టమైన చీర కొనే సరికి ఈ రోజంతా కూడా నేను ఏది చెప్తే అదే చేస్తుంది…. ఇది ఎప్పుడూ జరిగేదే కదా!!!”అని అనుకుంటా నవ్వుకుంటూ కాఫీ తాగి టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు
నందు ఫ్రెష్ అయి బయటకు వచ్చి “హాఫ్ n అవర్ గౌతమ్ టిఫిన్ చేస్తాను…”అని హడావిడిగా కిచెన్ లోకి వెళ్తుంది
గౌతమ్ కూడా నందు వెనకాలే వెళ్లి “నేను నీకు హెల్ప్ చేస్తాను…. వంట కూడా చేయాలి కదా!!!! అసలే నువ్వు తెల్లగా ఉంటావు ఇంత పని చేస్తే నీ చేతులు ఎర్రగా కందిపోయి నొప్పి పుడతాయి…” అని చెప్పి గౌతమ్ నందు తో మాట్లాడుతూనే కూరగాయలు కట్ చేసి ఇస్తాడు…..
నందు అవి తీసుకొని టిఫిన్ ప్రిపేర్ చేస్తూనే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తూ గౌతమ్ ని చూసి మురిసిపోతూ “నీలాంటి హస్బెండ్ ఎవరికీ దొరకరు గౌతమ్…. ఎంత హెవీ వర్క్ ఉన్న నా మీద చిన్న చిరాకు కూడా చూపించవు…. పెళ్లి అయినప్పటినుంచి ఇంతవరకు నాకు ఇలా హెల్ప్ చేస్తూనే ఉన్నావు….. నువ్వు నా భర్తగా దొరకడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం…..” అని గౌతమ్ ని ఆకాశానికి ఎత్తేస్తుంది
