గౌతమ్ నందు మాటలకి భయపడుతూనే “ఇప్పుడు నీకు ఏం కావాలి నందు??? నన్ను ఇలా ఐస్ చేస్తున్నావు???” అని అడుగుతాడు
నందు వెంటనే అలక గా మొహం పెట్టి “నేను మిమ్మల్ని అంతలా సతాయిస్తున్నానా??? జస్ట్ చిన్న చిన్నవి కొనిపించమని అడుగుతున్నాను….. అందుకే కదా మీ దృష్టిలో నేను లోకువ అయ్యాను….. మీకు నేనంటే లెక్కేలేదు ప్రతిసారి ఇలాగే మాట్లాడుతారు….” అని అంటుంది
గౌతమ్ నవ్వుతూ నందుని వెనక నుంచి హగ్ చేసుకొని “నువ్వు ఇలా అలిగితే చాలా అందంగా ఉంటావు నందు…. నువ్వు అలిగినప్పుడు నీ ముక్కు కోపంతో ఎర్రగా ఉంటుంది చూడు అప్పుడు అది అచ్చం చిలకముక్కు లానే ఉంటుంది….”అని నందు మొహం తనవైపు తిప్పుకొని తన పెదవులు అందుకుని ఐదు నిమిషాలు ముద్దు పెట్టి తన ముక్కు మీద కూడా ముద్దు పెట్టి వదిలేసి నవ్వుతూ నందు వైపు చుస్తాడు
నందు చిరుకోపంగా గౌతమ్ వైపు చూస్తూ “ఇప్పుడేంటి ఈ అల్లరి గౌతమ్….. ఇప్పటికే చాలా లేట్ అయింది ఇక మీరు వెళ్లి స్నానం చేయండి నేను రైస్ వండి క్యారేజ్ రెడీ చేసి పెడతాను….” అని అంటుంది
గౌతమ్ గారంగా “నువ్వు కూడా నాతో పాటు స్నానానికి రావచ్చు కదా నందు ఇద్దరం కలిసి స్నానం చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా???’ అని తన మెడమీద ముద్దులు పెడుతూ అడుగుతాడు
“ప్చ్ మీ అల్లరి ఉదయాన్నే మొదలు పెట్టకండి గౌతమ్ ప్లీజ్ నాకు చాలా పని ఉంది….” అని అంటూనే బియ్యం కడిగి రైస్ కుక్కర్ లో పెట్టేస్తుంది
“ఏమి కాదు నందు ఆల్రెడీ అన్నీ అయిపోయాయి కదా నాతో మాట్లాడుతూనే చేసేసావు కదా!!!! ఇంకేం పని ఉంది కర్రీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది…. నువ్వు వస్తేనే నేను స్నానానికి వెళతాను లేకపోతే ఇలాగే ఉంటాను…. నువ్వు ఇలా చేస్తూనే ఉంటే నాకు లేటవుతుంది చూసుకో మరి….” అని అంటాడు
“మీరు స్నానానికి వెళ్ళకుండా లేట్ చేస్తూ పైగా నన్ను అంటున్నారా నా వల్ల లేట్ అవుతుందని???” అని చిరు కోపంగా గౌతమ్ వైపు చూస్తూ నడుము మీద చేతులు పెట్టుకుని అడుగుతుంది
“అది నిజమే కదా నీ వల్లే నాకు లేట్ అవుతుంది…. నువ్వు నేను అడిగినప్పుడు నాతోపాటు వస్తే నాకు లేట్ అవుతుందా చెప్పు??? అందుకే రా ఇద్దరం కలిసి స్నానానికి వెళ్దాం….” అని గారంగా తన కొంగు పట్టుకొని లాగుతూ కొంటె కృష్ణుడిలా అడుగుతాడు
నందు నవ్వుతూ తన వైపు చూస్తూ “ఏంటి కృష్ణయ్య వేషాలు వేస్తున్నారు???? మనకి ఇప్పుడు వీటికే తక్కువ అయింది….. మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి గౌతమ్” అని గౌతమ్ వెనక నుంచి తోస్తూ ఉంటుంది.