నందు గౌతమ్ వెళ్ళాక తను అన్న మాటలని మళ్లీ నెమరు వేసుకొని ఏడుస్తూ “నేనంటే అంత ప్రేమ లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు గౌతమ్??? ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది???? ఎందుకు ఇలా చేశావు గౌతమ్??? నీతో ఒక విషయం సంతోషంగా షేర్ చేసుకోవాలి అని ఎదురు చూస్తుంటే నా సంతోషాన్ని అంతా ఆవిరి చేసావు…. ఐ హేట్ యు ఐ హేట్ యు గౌతమ్ ఫస్ట్ టైం నువ్వు నాకు నచ్చడం లేదు….” అని ఏడుస్తూ అంతే నిద్రపోతుంది
గౌతమ్ అలా సిటీ అంతా తిరుగుతూ నైట్ తొమ్మిదింటి వరకు బయటే ఉండి 9 ఇంటికి వచ్చి నందు ఎక్కడా కనిపించక పోయేసరికి రూమ్ లోకి వెళతాడు….. రూమ్ లో నందు ఒక సైడ్ కి తిరిగి పడుకొని గౌతమ్ అయోమయంగా ” నందు ఈ టైం లో పడుకుంది ఏంటి???” అనుకుంటూ తన దగ్గరికి వెళ్లి తన మొహం చూసేసరికి బాగా ఏడవటం వలన తన కళ్ళు, మొహం మొత్తం ఉబ్బి పోయి కనిపిస్తుంది…..
గౌతమ్ నందు ని అలా చూసి బాధగా అనిపించి వెంటనే నందు దగ్గరికి వెళ్లి “ఐ యాం సారీ నందు ఏదో ఆఫీస్ లో మేనేజర్ నన్ను అలా అనటం వలన ఆ ఫ్రస్టేషన్లో నీమీద తెలియకుండానే అరిచేశాను….” అనుకుంటూ తన కడుపు లోపలికి పోయి ఉండటం చూసి “నందు ఇంకా భోజనం చేయలేదా????” అనుకుంటూ నందు అని తన భుజం మీద తడుతూ లేపుతాడు
నందు పైకి లేచి గౌతమ్ వైపు చూడకుండానే సైలెంట్గా బయటికి వెళ్ళి పోతూ ఉంటుంది…..
గౌతమ్ నందు కి కోపం వచ్చింది అని అర్థమై వెంటనే తన చెయ్యి పట్టుకుని “ఐయామ్ సారీ నందు ఏదో ఫ్రస్టేషన్లో నీ మీద అరిచేశాను….. రియల్లీ సారీ నువ్వు ఇంత బాధ పడతావు అనుకోలేదు…..” అని బాధగా అంటాడు
నందు గౌతమ్ తన చేయి పట్టుకున్న కనీసం తన వైపు కూడా తిరగకుండానే తన చేయి విడిపించుకుని వెంటనే బయటికి వెళ్లి పోయి డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్లి కిచెన్ లో ఉన్న డిషెష్ అన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది…..
గౌతమ్ అసహనంగా నందు వెనకే వెళ్లి “ఏమైంది నందు ఎందుకు నాతో మాట్లాడటం లేదు????” అని అడుగుతాడు
నందు అయినా మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటే గౌతమ్ కోపంగా నందుని తన దగ్గరికి లాక్కుని తన కౌగిలిలో బిగించి “ఎందుకు నందు నాతో మాట్లాడటం లేదు?? అసలు నా వైపు కూడా చూడటం లేదు ఏమైంది???” అని అడుగుతుంటే
నందు గౌతమ్ తో మాట్లాడకుండా తన కౌగిలి నుంచి విడిపించుకోవడానికి గింజుకుంటూ కనీసం గౌతమ్ వైపు కూడా చూడదు…..
నందు అలా చేస్తుంటే గౌతమ్ కి కోపం వచ్చి తన బుగ్గలు గట్టిగా పట్టుకుని పైకి లేపి “నా వైపు చూడు నందు…. ఎందుకు నాతో మాట్లాడటం లేదు ముందు అది చెప్పు????” అని కోపంగా అడుగుతాడు
నందు అయినా కళ్ళు కిందకి దించి గౌతమ్ వైపు చూడకుండా “నేనంటే నీకు ఇష్టం లేదు కదా గౌతమ్!!! నీతో మాట్లాడితే నీకు నచ్చుతుందో?? లేదో??? అని నేనే మాట్లాడటం లేదు…. ముందు భోజనం చెయ్యి.… ” అని చెప్పి బలవంతంగా గౌతమ్ కౌగిలి నుంచి విడిపించుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం పెట్టుకుంటూ ఉంటే గౌతమ్ కోపంగా నందు వైపు చూస్తూ ఉంటాడు
నందు అది గమనించి “నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడకుండా భోజనం చేయకపోతే నేను భోజనం చేయకుండా ఇక్కడనుంచి వెళ్ళిపోతాను గౌతమ్…. అది నీకు ఇష్టమైతే చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాను….” అని కోపంగా అంటుంది
గౌతమ్ వెంటనే కోపంగా వచ్చి చైర్ లో కూర్చోగానే నందు తనకి కూడా వడ్డించి ఏడుపు వస్తుంటే కష్టంగా ఆపుకుంటూ ఒక్కో ముద్ద మింగుతూ ఉంటుంది…..
గౌతమ్ తింటూ నందు వైపు చూస్తూనే నందు అలా కష్టంగా తినటం చూసి తన మాటల వల్ల ఎంత హర్ట్ అయ్యిందో అర్ధమవుతూ ఉంటే బాధగా తినాలని అనిపించక వెంటనే తింటున్న ప్లేట్ లోనే చేయి కడిగేసుకుని నందు దగ్గరికి వెళ్ళటానికి పైకి లేస్తాడు…..
నందు అది గమనించి వెంటనే తను కూడా చేయి కడుక్కొని గౌతమ్ కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా గబగబా మరొక బెడ్ రూం లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద పడిపోయి తన కడుపు మీద చేయ్యి పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది….
గౌతమ్ నందు అలా వెళ్ళిపోవడం చూసి అది వాళ్ల రూమ్ లోకి కాకుండా వేరే బెడ్ రూమ్ లోకి వెళ్లడం చూసి తన వెనకే వెళ్ళి డోర్ కొడుతూ “నందు ఓపెన్ ద డోర్ ప్లీజ్ మనం కూర్చుని మాట్లాడుకుందాం….. నేను నీతో అలా మాట్లాడి ఉండకూడదు…. ఐ యాం రియల్లీ సారీ రా ప్లీజ్ నందు డోర్ ఓపెన్ చెయ్యి….” అని కంటిన్యూస్గా డోర్ కొడుతూ ఉంటాడు
నందు కష్టంగా ఏడుపు ఆపుకుంటూ “ప్లీజ్ గౌతమ్ నన్ను ఈ నైట్ కి ఒంటరిగా వదిలెయ్….. నేను ఒంటరి గా ఉండాలి అనుకుంటున్నాను ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో…..” అని కష్టంగా ఏడుపు ఆపుకుంటూ బొంగురుపోయిన గొంతుతో అంటుంది
గౌతమ్ అది విని “నందు ప్లీజ్ రా నేను చెప్పేది విను….. నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఏమీ తోచదు…. ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్…..” అని అంటూ ఉండగానే
నైస్ సజషన్ గుడ్ రైటింగ్
good. nice