భర్త భార్య Part 3 326

“ప్లీజ్ గౌతమ్ ఇప్పుడు నువ్వు నీ రూమ్ లోకి వెళ్లి పడుకో నన్ను డిస్టర్బ్ చేయకు….” అని చాలా బాధగా అడుగుతుంది

గౌతమ్ కూడా ఇక నందుని కదిలించలేక “ఐ యాం రియల్లీ సారీ నందు నేను అలా మాట్లాడి ఉండకూడదు….. ప్రశాంతంగా నిద్రపో…ఏది ఆలోచించకు…. నేను ఏమీ కావాలని అనలేదు జస్ట్ కోపం లో అనేసాను….. అవన్నీ పట్టించుకోని నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను…. నేను బయట సోఫాలో పడుకున్నాను…..మనం రేపు ఉదయం మాట్లాడుకుందాం‌…‌. గుడ్ నైట్…” అని చెప్పి బయట హాల్లో ఉన్న సోఫాలో పడుకుని నందు ఉన్న రూమ్ వైపు చూస్తూ నందు ఎప్పుడు డోర్ తీస్తుందా??? అని ఎదురు చూస్తూ ఉంటాడు

నందు ఏడుస్తూ “నువ్వు అన్నప్పుడు గుర్తుకు రాలేదా గౌతమ్ ఈ మాటలన్నీ??? ఎలా అన్న నువ్వు అన్న మాటలు నా మనసుకి గుచ్చుకున్నాయి…..ఇప్పుడు ఆ మాటలన్ని నీ మనసులో నుంచి రాలేదు అంటే నేను ఒప్పుకోలేను….. నేను నిన్ను అంత ఈజీగా క్షమించలేను గౌతమ్….. నీ నుంచి అలాంటి మాటలు నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు…..” అనుకుంటూ నిద్రపోతుంది

ఉదయాన్నే లేచిన నందు డోర్ తీసి బయటకు వచ్చేసరికి నందు రూమ్ వైపే చూస్తూ ఎప్పుడో ఉదయాన్నే నిద్ర పోయినా గౌతమ్ సోఫా సరిపోక కాళ్ళు ముడుచుకొని పడుకొని నిద్ర పోతూ ఉంటాడు…..

నందు గౌతమ్ వైపు ఒక్క క్షణం చూసి వెంటనే తన పనిలో పడి పోతుంది…..

ఇల్లంతా క్లీన్ చేశాక ఫ్రెష్ అవడానికి వెళ్లి వచ్చి దేవుడి గదిలో దీపం పెడుతూ హారతి ఇచ్చేటప్పుడు గంట కొడుతూ ఉంటే ఆ సౌండ్ కి గౌతమ్ కి మెలకువ వచ్చి టైమ్ ఎంతయింది అని గోడ గడియారం చూసుకొని 7:30 చూపిస్తుంటే వెంటనే పైకి లేచి “ఇంత టైం నిద్రపోయానా??? నందు!!! నందు” అనుకుంటూ నందు నైట్ నిద్ర పోయిన రూమ్ వైపు చూసే సరికి ఆ రూమ్ ఓపెన్ లోనే వుండడం చూసి “నందు లేచిందా???” అని రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగానే నందు పూజ కంప్లీట్ చేసుకొని పూజ గది నుంచి బయటకు వస్తుంది…..

గౌతమ్ వెంటనే నందు వైపు చూసి తన మొహం చూసి రాత్రంతా ఏడ్చింది అని అర్థమై బాధగా నందు దగ్గరికి వెళ్తూ “రియల్లీ సారీ నందు ఎక్స్ట్రీమ్లీ సారీ ప్లీజ్ నువ్వు ఇంతలా హర్ట్ అవుతారు అనుకోలేదు….. నువ్వు ఇలా నాతో అంటి ముట్టనట్టు గా ఉంటే నాకు నచ్చడం లేదు…. ప్లీజ్ నందు నాతో మాట్లాడు….” అని నందు కి ఒక అడుగు దూరంలో ఉండగా

నందు చెయ్యి అడ్డం పెట్టి గౌతమ్ ని ఆపేసి “ప్లీజ్ గౌతమ్ ఇప్పుడు నాకు నీతో మాట్లాడే టైం లేదు….. నాకు చాలా పని ఉంది…. నువ్వు ఫ్రెష్ అయి టిఫిన్ తినేసి ఆఫీస్ కి వెళ్లిపో….” అని చెప్పి వెంటనే కిచెన్ లోకి వెళ్లిపోతుంది

గౌతమ్ కూడా నందు వెనక్కి వెళ్తూ “ఎందుకు నందు ఇంత పట్టుదలగా ఉన్నావు??? మొగుడు ఒక మాటంటే పడలేవా??? అంత కాని వాడిని అయ్యానా???” అని బాధగా అడుగుతాడు

“కానీ వాడివి నువ్వు కాదు గౌతమ్ నీకే నేను కాని దానిని అందుకే నిన్న అలా అన్నావు….. నీ మనసులో లేకుండానే నీ నోట్లో నుంచి అలాంటి మాటలు నా గురించి వస్తాయా???? నువ్వు అలా అని అనుకుంటున్నావు కాబట్టే నీ నోట్లో నుంచి కూడా అవే మాటలు వచ్చాయి…. నేను ఎప్పుడూ అలాంటి మాటలు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు గౌతమ్ …..” అని చెప్పి సైలెంట్గా వంట చేసుకుంటూనే ఉంటుంది

గౌతమి ఏదో మాట్లాడబోతే ఉంటే తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది…..

” ముందు వెళ్లి ఫోన్ లిఫ్ట్ చెయ్ గౌతమ్ ఎంత ఇంపార్టెంటో ఏమో!!!” అని గౌతమ్ వైపు చూడకుండానే అంటుంది

గౌతమ్ అసహనంగా వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ లో చెప్పిన మాటలు విని షాక్ అయ్యి వెంటనే హడావిడిగా బైక్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు……

గౌతమ్ అలా వెళ్ళిపోవటం చూసి ఎందుకు వెళ్లాడో కూడా అర్థమై మిగిలిన పనులు చేసుకుంటూ నందు బిజీ అయిపోతుంది…..

గౌతమ్ నేరుగా రైల్వేస్టేషన్ కి వెళ్ళి తనకి కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్లి “ఏంటి అమ్మ నాన్న ఇంత సడన్ గా వచ్చారు??? కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు???? మీరైనా చెప్పలేదు ఏంటి అత్తయ్య మావయ్య????” అని మౌనిక వైపు చూస్తూ “ఎలా ఉన్నావు మౌనిక???” అని అడుగుతాడు

“బాగున్నాను బావ….” అని నవ్వుతూ చెప్పగానే గౌతమ్ తన అమ్మానాన్నల వైపు చూస్తాడు…. గౌతమ్ చూపుని అర్థం చేసుకొని “అదేంటి రా అంటావ్ మేము వస్తున్నాము అని నిన్నే నందుకి చెప్పాము కదా!!!! పైగా కోడలు పిల్ల ప్రెగ్నెంట్ అయితే ఈ టైంలో తనని ఒంటరిగా ఎలా వదిలేస్తాము అనుకున్నావు???? అందుకే తనని చూసి ఒకసారీ డాక్టర్ కి చూపించి మాతోపాటు తీసుకు వెళ్దామని వచ్చాము…..” అని అయోమయంగా అంటారు

గౌతమ్ తన అమ్మ చెప్పిన మాటకి నందు ప్రెగ్నెంట్ అన్న దాని దగ్గరే తన మైండ్ ఆగిపోయి వెంటనే ఆనందంతో అంటే “నేను తండ్రి కాబోతున్నానా??? మరి నందు నాకెందుకు చెప్పలేదు????” అనుకుంటూ నిన్న నందు తన కోసమే ఎదురు చూస్తూ ఏదో చెప్పాలని ట్రై చేయడం గుర్తుకు వచ్చి గౌతమ్ బాధగా “ఎంతో సంతోషంగా నాతో ఈ న్యూస్ షేర్ చేసుకోవాలని అనుకుంది…. కానీ నేను నందు కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నానా మాటలు అని తనని బాధపెట్టాను…. ఇలాంటి టైం లో మైండ్ ఎంత ప్లెజెంట్ గా ఉండాలి??? అలాంటిది నేనే తనని బాధపెట్టాను….. నన్ను నేను ఎన్ని అనుకున్న తక్కువే….” అనుకుంటూ ఆలోచించు కుంటూ ఉంటాడు

గౌతమ్ అమ్మ గౌతమ్ వీపు మీద కొట్టగానే గౌతమ్ స్రృహ లోకి వచ్చి “ఏంటమ్మా అంత గట్టిగా కొట్టావు???” అని తన వీపు రుద్దుకుంటూ చిరాకుగా అడుగుతాడు

“ఎంత పిలిచినా పలకక పోతే కొట్టక పోతే ముద్దు పెట్టుకోవాలా???? ఎన్నిసార్లు పిలవాలి రా??? అయినా నీకు తెలియదా నందు ప్రెగ్నెంట్ అని!!! నందు నీకు చెప్పలేదా మేము వస్తున్నామని???” అని అనుమానంగా అడుగుతారు

గౌతమ్ తడబడుతూ “అది అమ్మ అని నందు చెప్పింది కానీ నేనే మర్చిపోయాను….. ఉదయం మీరు ఫోన్ చేసేదాక నాకు గుర్తుకులేదు సారీ అందుకే టైం కి రాలేక పోయాను….” అని కవర్ చేస్తాడు

2 Comments

  1. నైస్ సజషన్ గుడ్ రైటింగ్

Comments are closed.