భర్త భార్య Part 3 320

గౌతమ్ అమ్మగారు నాన్నగారు ఇంకా అనుమానంగా గౌతమ్ వైపు చూస్తూ ఉంటే గౌతమ్ అది గమనించి “సరే సరే పదండి నందు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది….. అది ఇంకా టిఫిన్ కూడా చేయలేదు….” అని హడావిడి చేసి అందర్నీ తీసుకుని ఇంటికి వెళ్తాడు

గౌతమ్ ఇంటికి వచ్చి నందు వైపే చూస్తూ మనసులో “ఐ యాం రియల్లీ సారీ నందు…. నేను నిన్ను చాలా బాధ పెట్టాను కానీ ఇక నుంచి నీ కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాను…. ఇట్స్ మై ప్రామిస్….” అనుకుంటాడు

నందు అందరినీ ఆప్యాయంగా పలకరించి గౌతమ్ అమ్మగారు నందు అమ్మగారు నందు ఆరోగ్యం గురించి తెలుసుకొని “డాక్టర్ దగ్గరికి వెళ్ళావా నందు???” అని అడిగితే

” ఈరోజు వెళ్లాలి అపాయింట్మెంట్ తీసుకున్నాను…. ఆఫ్టర్నూన్ వెళ్దాం ‌….. గౌతమ్ కి ఆఫీస్ ఉంది అందుకే మీరు నేను వెళ్దాం లే!!!” అని నవ్వుతూ అంటుంది

గౌతమ్ వెంటనే “లేదు నందు ఆల్రెడీ నేను వన్ వీక్ లీవ్ చెప్పేశాను…. ప్రాజెక్ట్ కూడా నిన్నే అయిపోయింది కాబట్టి వర్క్ కూడా అంతగా లేదు…. నువ్వు నేను కలిసి హాస్పిటల్ కి వెళ్దాంలే….” అని నవ్వుతూ అంటాడు

నందు అందరూ ఉన్నారని ఇక ఏం మాట్లాడలేక సైలెంట్గా సరే అని తల ఊపుతుంది…..

“సరే పద నందు ఇప్పటికే చాలా లేట్ అయింది….. నువ్వు కరెక్ట్ టైం భోజనం చేయాలి అసలే చాలా నీరసంగా ఉన్నావు కదా!!!” అని చెప్పి అందరినీ టిఫిన్ కి రమ్మని చెప్పి అందరూ టిఫిన్ చేస్తుంటే గౌతమ్ స్వయంగా తనే నందు కి తినిపించటానికి నందు నోటి దాకా టిఫిన్ తీసుకు వస్తాడు….. నందు అందరూ వైపు చూస్తూ నవ్వు నటిస్తూ “నువ్వు తిను గౌతమ్ నేను తింటా లే….” అని అంటున్న గౌతమ్ బలవంతంగా “అవసరం లేదు ఈరోజు నుంచి నేనే నీకు తినిపిస్తాను….” అని నవ్వుతూ చెప్పి బలవంతంగా నందు నోట్లో టిఫిన్ పెడతాడు….. నందు కూడా అందరూ ఉన్నారని సైలెంట్ అయిపోతుంది…..

అలా అందరూ టిఫిన్ చేసి సోఫా లో కూర్చోగానే “సరే నందు నువ్వు రెస్ట్ తీసుకో….. ఇలాంటి టైం లో ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి…. దేని గురించి స్ట్రెస్ తీసుకోకూడదు….. లేదంటే లోపల బేబికి ప్రమాదం….. ఈ టైం లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి…..” అని గౌతమ్ అమ్మగారు అంటారు

“అవసరం లేదు అత్తయ్య నేను ఫుల్ హెల్తీగా ఉన్నాను…. నేను కూడా మీకు వంటలో హెల్ప్ చేస్తాను…..” అని అంటుంది

గౌతమ్ కోపంగా పైకి లేచి “అవసరం లేదు నువ్వు రెస్ట్ తీసుకో అమ్మ , అత్తయ్య వంట చేస్తారు…..” అని చెప్పి నందుని రెండు చేతులతో ఎత్తుకుని బెడ్ రూం లోకి తీసుకు వెళ్తూ ఉంటాడు

గౌతమ్ అలా చేస్తాడు అని ఊహించని షాక్ అయి “గౌతమ్ అందరి ముందు ఇలా చేయొద్దు….. ముందు నన్ను కిందికి దించు….” అని కోపంగా అంటుంది

గౌతమ్ కోపంగా నందు వైపు చూస్తూ “నోరు మూసుకుని ఉండు…. నిన్నటి నుంచి చాలా ఎక్కువ చేస్తున్నావ్…. నీ పని రూమ్ లోకి వెళ్ళాక చెప్తాను….” అని చెప్పి తమ బెడ్ రూమ్ లోకి తీసుకు వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి తను హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ కోపంగా నందు వైపే చూస్తూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు…..

గౌతమ్ అంత కోపం గా తన వైపు చూస్తూంటే నందు అయోమయంగా గౌతమ్ చూస్తూ “ఏమైంది గౌతమ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు???? నిన్నే అన్నావు కదా నేను నీకు అవసరం లేదని!!!! మళ్ళీ ఇదంతా ఏంటి???” అని కోపంగా అడుగుతుంది

“నిన్న నేను ఏదో ఫ్రస్టేషన్లో ఒక్క మాట అంటే నువ్వు అది అంత సీరియస్ గా తీసుకున్నావా నందు??? మరి నువ్వు ప్రతిసారి నీకు అవసరమైన దాని కోసం నా దగ్గర ప్రేమగా ఉంటావు కదా అప్పుడు నేను ఎంత ఫీల్ అవుతానని నువ్వు ఆలోచించావా??? ఎప్పుడూ అలా ఆలోచించలేదు కదా!!! నాకు తెలుసు నేను చిన్న మాట అంటేనే నువ్వు తట్టుకోలేక పోయావు…..మరి నీ బిహేవియర్ పెళ్లయినప్పటి నుంచి ఇంతే ఉంది నేను ఎంత బాధ పడి ఉంటాను అని నువ్వు ఎందుకు ఆలోచించవు????” అని బాధగా అడుగుతాడు

పెళ్లయినప్పటి నుంచి తన బిహేవియర్ గుర్తు చేసుకుని గౌతమ్ చెప్పినవన్నీ అన్నీ నిజాలే అని తన మనసు చెప్తున్నా అయినా కూడా బింకంగా “నేను నీకు ఏది తక్కువ చేయలేదు గౌతమ్ కానీ నువ్వు నన్ను అలా అనటం చాలా తప్పు…. నేను ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యాను….. నువ్వు ఏమైనా చెప్పు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పోతున్నాను…..ఇంకా ఎప్పటికీ ఇక్కడికి రాను…. కనీసం నువ్వైనా ప్రశాంతంగా ఉండొచ్చు….. మీ వాళ్ళకి ఏం చెప్పుకుంటావో చెప్పుకో!!!!” అని కోపంగా అంటుంది

గౌతమ్ కోపంగా నందు కళ్ళలోకి సూటిగా చూస్తూ “ఇదేనా నీ లాస్ట్ మాట???” అని అడుగుతాడు

నంద గౌతమ్ కళ్ళలోకి చూడలేక తల పక్కకి తిప్పి అంతే అని అంటుంది…..

గౌతమ్ వెంటనే నందుని గట్టిగా హాగ్ చేసుకుని ఎటు కదలనివ్వకుండా తన బాధంతా అర్థమయ్యేలా “ప్లీజ్ నందు నన్ను క్షమించవే!!! నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను…. నువ్వంటే నాకు అంత పిచ్చి అర్థం చేసుకో నందు…. నిన్ను నన్ను ఆ మేనేజర్ గాడు పిచ్చి పిచ్చిగా తిట్టాడు…..ఆ ఫ్రస్టేషన్ లో ఏం చేస్తున్నానో!!! ఏం మాట్లాడుతున్నానో!! అర్థం కాక ఆలా చేశేశాను……‌‌ అంతే తప్ప ఏమీ లేదు నందు….. ఇలా నిన్ను బాధ పెట్టినందుకు ఈ ఒక్కసారికి నన్ను క్షమించవే!!!!” అని దీనంగా మొహం పెట్టి అడుగుతాడు

గౌతమ్ అలా చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయని నందు వెంటనే షాక్ అయ్యి గౌతమ్ నుంచి విడిపించు కోవాలని ట్రై చేసినా తన మాటల్లో తన బాధంతా అర్ధమవుతూ ఉంటే బాధ గా తన వైపు చూస్తూ గౌతమ్ చెప్పేది వింటూ ఉంటుంది…..

నందు కి గౌతమ్ మాటలు వింటూ తన మొహం చూస్తుంటే నవ్వు వస్తున్న అది తన బుగ్గల్లోని దాచి “నువ్వు ఎన్నన్నా చెప్పు గౌతమ్ మీ ఆఫీసులో ఫ్రస్టేషన్ అంత తీసుకువచ్చి ఇంట్లో చూపిస్తే ఎలాగా???? మేము పెళ్లి అవ్వగానే అంతకు ముందు ఉన్న మా ప్రపంచాన్ని వదిలేసి , మా అమ్మానాన్నలని వదిలేసి మరి వంటరిగా మీ కోసం మీ ఇంటికి వస్తే మమ్మల్ని ఇన్ని మాటలు అంటారా???? మీరు ఇలా మాట్లాడితే మేము ఎంత బాధ పడతామో అని ఒకసారి ఆలోచించాలి కదా!!!! పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో ప్రేమగా చూసుకునే నువ్వు సడన్ గా నేను అంటే ఇష్టం లేనట్టు నేను రాగానే నీ అదృష్టం అంతా పోయినట్టు మాట్లాడగానే నేను తట్టుకోలేకపోయాను…..

పైగా నీకు నేను ప్రెగ్నెంట్ అన్న గుడ్ న్యూస్ చెప్పాలని ఉదయం నుంచి ఫోన్ చేశాను….. నీకు తెలుసా నువ్వు వెళ్లగానే టిఫిన్ చేసి టీవీ చూస్తూ ఉంటే నాకు ఒకటే వాంతులవుతుంటే పైగా నా నెలసరి వచ్చి పది రోజులు పైనే అవుతుండే సరికి డౌట్ గా అనిపించి చెక్ చేసుకున్నాను…. అప్పుడే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది…. నీకు పిల్లలు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా!!!! మొట్టమొదట నీకే ఈ గుడ్ న్యూస్ చెప్పాలని ఉదయం నుంచి ఫోన్ చేశాను ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు….. సరేలే అని అత్తయ్య మావయ్య కి అమ్మానాన్నలకి చెప్పి వాళ్ళ ఆనందంగా కంగ్రాట్స్ చెప్పి వస్తున్నామని చెప్పగానే

వెంటనే తిరిగి నీకు కాల్ చేశాను అయినా నువ్వు లిఫ్ట్ చేయలేదు…. సరేలే అనుకొని నువ్వు ఇంటికి వచ్చాక నీకు డైరెక్ట్ గా ఈ న్యూస్ చెప్పి నీ కళ్ళల్లో ఆనందాన్ని డైరెక్ట్ గా చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు నన్ను అలాంటి మాటలు అని చాలా హర్ట్ చేసావ్ గౌతమ్….. నువ్వు అన్న మాటలకి నా మనసు ఎంత బాధ పడిందో తెలుసా??? నైట్ అన్నం కూడా తినాలనిపించలేదు…‌. అందుకే సరిగా తినకుండా నిన్న నైట్ అంత నువ్వు అన్న మాటలు తలుచుకుంటూ ఎంత ఏడ్చానో!!! నువ్వు నన్ను ఏడిపించావు గౌతమ్ ఐ హేట్ యూ…..” అని ఏడుస్తూ అంటుంది.

గౌతమ్ వెంటనే నందుని హగ్ చేసుకుని “రియల్లీ సారీ నందు నేను అసలు ఊహించలేదు నేను ఎప్పుడూ నిన్ను అలా అంటానని!!!! ఈసారి నా నోటిని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను….. నిన్ను జాగ్రత్తగా చూసుకోవలసిన టైం లో నా వల్లే నువ్వు ఏడ్చావు అన్న ఫీలింగ్ నే నేను తట్టుకోలేకపోతున్నాను….. ప్లీజ్ నందు నన్ను వదిలెయ్యకే!!!! ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేసేయ్….. ఇంకొకసారి ఇలాంటివి చేస్తే నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చిన నోరు మెదపకుండా తీసుకుంటాను….” అని అడుగుతాడు

నందు ఇక నిన్నటి నుంచి గౌతమ్ మాటలకి మనసులో ఉన్న బాధ తట్టుకోలేక అది తారస్థాయికి చేరుకొని గౌతమ్ ని గట్టిగా హగ్ చేసుకొని గుక్క పెట్టి ఏడుస్తూ “నువ్వు నిన్ను అలా అనగానే నాకు ఎంత బాధ వేసిందో తెలుసా గౌతమ్???? లైఫ్ లో ఫస్ట్ టైం తప్పు చేసానా అనిపించింది??? నేను నిన్ను చూడగానే ఇష్టపడ్డాను నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక నిన్నే ప్రాణంగా అనుకున్నాను…. అటువంటిది నీ నోట్లో నుంచి నన్ను నీ జీవితం లోకి తీసుకు రావడం నువ్వు చేసిన పెద్ద తప్పు అని అనగానే లైఫ్ లో ఫస్ట్ టైం ఎందుకు బ్రతుకుతున్ననా అనిపించింది????” అని ఏడుస్తూ అంటుంది

నందు “ష్ ష్ ఏడవకు నందు….. నిన్న నా నోటి నుంచి అలాంటి మాటలు రాకుండా ఉండాల్సింది పొరపాటున వచ్చేశాయి కానీ ఇంటేన్షనల్ గా కాదు అని చెప్పాను కదా!!!! ఇక జీవితంలో నిన్ను కష్టపెట్టే మాట ఒకవేళ అంటే మాత్రం నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చిన నేను సంతోషంగా తీసుకుంటాను….. కానీ ఇలా నీలో నువ్వే బాధపడుతూ నన్ను బాధ పెట్టకు….. నిజంగా నందు నిన్ను పెళ్లి చూపులలో చూడగానే నాకు నచ్చేసావు….. అందుకే ఫస్ట్ టైం ఒక ఆడపిల్లకి చూడగానే తన పర్మిషన్ కూడా అడగకుండా ముద్దు పెట్టాను…. కానీ పెళ్లయినప్పటి నుంచి నువ్వు నాకోసం ఆఫీసు నుంచి రాగానే నువ్వు ఎదురు వస్తే ఎంత బాగుండు అనుకున్నాను!!!!

నువ్వు మాత్రం ఆ టీవీ సీరియల్స్ చూస్తూ నా మీద చిరాకు పడే దానివి!!!? ఆ టైంలో చాలా బాధగా అనిపించేది!!!!! ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని!!!! నీకు ఏదైనా కావాలి అనుకుంటే ప్రేమగా మాట్లాడుతావు లేకపోతే చిరాకు పడతావు…. నిజంగానే నీ బిహేవియర్ నాలో కొంచెం ఫ్రస్టేషన్ లేపింది…. పైగా మొన్న నువ్వు చీర కోసం చేసిన దాని వల్ల లాస్ట్ లో ఉన్న ప్రాజెక్ట్ వర్క్ చేయకుండా ఉండేసరికి ఆఫీస్ లో మేనేజర్ నన్ను ఎడాపెడా వాయించేశాడు…… ఆ కోపం ఫ్రస్టేషన్ అంతా ఎవరి మీద చూపించాలో తెలియక పైగా నువ్వు మళ్ళీ ప్రేమగా మాట్లాడుతుంటే మళ్లీ అలాగే చేస్తున్నావ్ ఏమో అనుకొని బాధపడి అలా అనేశాను….. అంతే తప్ప ఒక్క మాట కూడా నా మనసులో నుంచి వచ్చిన మాట కాదు నందు…. నన్ను కూడా అర్థం చేసుకో నందు….” అని బాధగా అడుగుతాడు

2 Comments

  1. నైస్ సజషన్ గుడ్ రైటింగ్

Comments are closed.