భర్త భార్య Part 3 320

నందు తన కన్నీళ్లు తుడుచుకొని తన చేసిన పనులన్నీ గుర్తుకు వచ్చి గౌతమ్ చేతులు పట్టుకుని “ఐ యాం రియల్లీ సారీ గౌతమ్ నిజంగా ఇందులో నా తప్పు కూడా ఉంది…. నిన్ను ఇలా నిర్లక్ష్యం చేయకుండా ఉండాల్సింది…. అలా చేయబట్టే నీలో ఇలా ప్రస్టేషన్ పెరిగిపోయింది….. ఇక నుంచి నీ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయను ప్రామిస్…. నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు వచ్చేసరికి నీ ఎదురుగా నవ్వుతూ ఉంటాను…. కానీ నువ్వు కూడా ఇకనుంచి మీ ఆఫీసులో టెన్షన్స్ అన్నీ తీసుకువచ్చి నామీద అరవ కూడదు….. మీరు ఒక్క మాట మమ్మల్ని మీ జీవితంలో తక్కువ చేసేలా అంటే అది మేము ఈజీగా తీసుకోలేము అర్థం చేసుకో!!!” అని బాధగా అడుగుతుంది

“నిన్ను బాధపెట్టాలని చెప్పలేదు నందు మేము ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూ అలసటగా ఇంటికి రాగానే భార్యల దగ్గర నుంచి కొంచెం ప్రేమ ఆదరణ లభించాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా!!!! అదే నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను…. అంతే తప్ప నిన్ను దేనిలోను ఫోర్స్ చేయాలని కాదు….. ఇకనుంచి నువ్వు నీకు నచ్చినట్టు ఉండు పర్వాలేదు…..” అని నందు నూతన గుండెలకి హత్తుకుంటూ అంటాడు

“లేదులే గౌతమ్ ఇందులో నా తప్పు కూడా ఉంది….” అని ఒకరినొకరు నాది తప్పు అంటే నాదే తప్పు అని వాదించుకుంటూ ఉంటారు…..

ఇంతలో ఎవరో తమ రూమ్ డోర్ కొడుతూఉంటే ఇద్దరు వాదులాడుకోవడం ఆపేసి ఒకరి మొహం ఒకరు చూసుకొని గట్టిగా నవ్వుకుంటారు…..

ఇంతలో మళ్లీ డోర్ సౌండ్ వినిపించి నవ్వటం ఆపేసి “ఇద్దరిదీ తప్పు ఉంది కాబట్టి ప్రస్తుతానికి చెల్లుకు చెల్లు చేసుకుందాం…. ఇకనుంచి ఇద్దరం ఒకరి గురించి ఒకరం పట్టించుకుంటూ ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేద్దాం ఏమంటావు నందు????” అని గౌతమ్ అడుగుతాడు

“నాకు ఒకే గౌతమ్ ఇకనుంచి నేను కూడా నీకు నచ్చినట్టు గానే ఉంటాను….” అని నవ్వుతూ అంటుంది

“సరే ఎవరో వచ్చినట్టు ఉన్నారు… వెళ్ళి చూస్తాను నువ్వు రెస్ట్ తీసుకో!!” అని చెప్పి నందు ని బెడ్ మీద పడుకోబెట్టి గౌతమ్ వెళ్లి డోర్ తీయగానే గౌతమ్ అమ్మగారు నవ్వుతూ గౌతమ్ వైపు చూస్తూ “అయిపోయాయా మీ అలకలు????” అని నవ్వుతూ అడుగుతుంది

అది విని బెడ్ మీద పడుకొని ఉన్న నందు షాక్ గా లేచి కూర్చొని గౌతమ్ వైపు చూస్తుంటే గౌతమ్ కూడా నందు వైపు అలానే చూసి వెంటనే ఇద్దరు సర్దుకొని గౌతమ్ అమ్మగారి వైపు చూస్తూ ఇద్దరూ ఒకేసారి “అలాంటిదేమీ లేదు అత్తయ్య…. అలాంటిదేమీ లేదు అమ్మ…. జస్ట్ మాట్లాడుకుంటున్నాము అంతే!!!” అని కంగారుగా అంటారు

“నాకు తెలుసు మేము వచ్చిన దగ్గరనుంచి మీరు ఇద్దరు చాలా డల్ గా ఉన్నారు… పైగా ఒకరితో ఒకరు సరిగా మాట్లాడుకోవడం లేదు…. అప్పుడే అర్థమైంది మీ ఇద్దరు ఏదో విషయం లో గొడవ పడ్డారని కానీ భార్య భర్తల విషయంలో మేము కలుగజేసుకోవటం మంచిది కాదని సైలెంట్ గా ఉన్నాము…. ఇప్పుడు మీ అంతట మీరే సాల్వ్ చేసుకున్నారు కాబట్టి మాకు టెన్షన్ లేదు…. అందుకే మేమందరం బయట ఉన్న పట్టించుకోకుండా మీరు ఇద్దరు రూమ్ లోకి వెళ్ళిన సైలెంట్ గా ఉన్నాము….సరే కానీ ఇక మీ సర్ది చెప్పుకోవడాలు అయిపోతే రెడీ అవ్వండి డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం అయింది….. అందుకే డోర్ కొట్టి మరి మిమ్మల్ని డిస్టబ్ చేశాను….” అని నవ్వుతూ ఉంటుంది

నందు కూడా గడియారం వైపు చూసి ఆశ్చర్యంగా “అంటే అరగంట నుంచి మేమిద్దరం రూమ్ లోనే ఉన్నామా???” అనుకొని “సరే అత్తయ్య నేను రెడీ అయ్యి వస్తాను….” అని చెప్పిన రెడీ అవడానికి వాష్ రూమ్ కి వెళ్ళిపోతుంది

గౌతమ్ అమ్మగారు లోపలికి వచ్చి గౌతమ్ చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి గౌతమ్ పక్కనే కూర్చుని గౌతమ్ వైపు చూస్తూ “చూడు గౌతమ్ ఇలా చెప్తున్నాను నువ్వు బాధపడకు…. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకు వచ్చినప్పుడు తనకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటామని తన అమ్మానాన్నలకి ప్రామిస్ చేసి తీసుకు వస్తాము…. అటువంటిది మన వల్ల తను ఒక్క కన్నీటిబొట్టు కార్చిన అది చూసి మనం ప్రశాంతంగా బ్రతకలేము…. కాబట్టి ఎప్పుడూ నందుని బాధపెట్టకుండా చూసుకో….” అని అంటుంది

“అమ్మ నాకు నందు అంటే చాలా ఇష్టం ఇక నుంచి నందు కంట్లో నుంచి కన్నీటి చుక్క రాకుండా జాగ్రత్తగా చేసుకుంటాను…. ప్రామిస్” అని నవ్వుతూ అంటాడు

నందు వాష్ రూమ్ లోపలి నుంచే ఈ మాటలన్నీ విని “నాకు ఎంత మంచి కుటుంబం దొరికింది నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని…. గౌతమ్ నీ విషయంలో నేను ఇలా చేసి ఉండకూడదు…. మీకు కూడా ఆఫీసులో సవాలక్ష టెన్షన్స్ ఉంటాయి అవన్నీ పోవడానికి మా దగ్గర కొంచెం సేపు ప్రశాంతంగా సేద తీరాలి అనుకుంటారు…. కానీ నేను నీకు అలా చేయకుండా ఇంకా ఎక్కువ టెన్షన్ ఇచ్చాను…. ఇక నుంచి ఇలాంటి సిల్లీ బిహేవియర్ నీ దగ్గర చూపించను….” అని తనలో తానే అనుకుంటుంది

తర్వాత నందు బయటికి రాగానే గౌతమ్ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు….

గౌతమ్ అమ్మగారు నందుని రెడీ చేస్తూ “ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు నందు గౌతమ్ ది చిన్న పిల్లల మనస్తత్వం చిన్న చిన్న వాటికి సంతోషిస్తాడు కానీ మనం కూడా వాళ్లకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి….. వాళ్ళు బయట సవాలక్ష పనులు చేసుకుని ఇంటికి వస్తారు….. అటువంటి వాళ్ళ దగ్గర మనం మన టెన్షన్స్ కూడా చెప్పి ఇంకా ఎక్కువ బాధ పెట్టకూడదు….. సాధ్యమైనంతవరకు వాళ్ళకి చేదోడువాదోడుగా ఉండాలి కానీ మనం ఇంకా వాళ్ళకి బరువై పోకూడదు…..” అని అంటుంది

నందు వెంటనే గౌతమ్ అమ్మగారిని హగ్ చేసుకొని “అలాగే అత్తయ్య గౌతమ్ ని ఇకనుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను….” అని అంటుంది

2 Comments

  1. నైస్ సజషన్ గుడ్ రైటింగ్

Comments are closed.