భర్త భార్య Part 3 320

గౌతమ్ కూడా ఫ్రెష్ అయి రాగానే అందరూ కలిసి హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ని కలుస్తారు డాక్టర్ నందుని చెక్ చేసి తల్లి బిడ్డ హెల్దీ గా ఉన్నారు అని చెప్పగానే అందరూ సంతోషిస్తారు….. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని వాటిలో టాబ్లెట్స్ మెడికల్ స్టోర్ లో తీసుకొని నందు ని జాగ్రత్తగా ఇంటికి తీసుకు వెళ్తారు….. మధ్యాహ్నం లంచ్ తర్వాత నందు అమ్మగారు నందుని తీసుకెళ్తాను అని చెప్పినా గౌతమ్ ససేమిరా ఒప్పుకోకుండా “నేను నా నందు ని జాగ్రత్తగా చూసుకుంటాను…. కావాలంటే కేర్ టేకర్ ని కూడా పెట్టుకుంటాను….. కానీ నా నందు లేకుండా ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను….” అని నందు చెయ్యి గట్టిగా పట్టుకుని అంటాడు

గౌతమ్ ప్రేమకి ఏం చెప్పాలో అర్థం కాక ఎంత చెప్పినా కోపం వినకపోయేసరికి ఇక అందరు చివరికి గౌతమ్ దగ్గరే నందుని ఉంచేలా ఒప్పుకోక తప్పలేదు….. అందరూ కూడా గౌతమ్ ప్రేమ చూసి సంతోషించి అప్పుడప్పుడు వస్తామని చెప్పి గౌతమ్ అమ్మగారు మాత్రం వెళ్లకుండా నందు దగ్గరే తనని చూసుకుంటూ ఉంటానని చెప్పి ఉండిపోయి మిగిలిన అందరు తర్వాతి రోజు అందరూ వెళ్లిపోతారు…..

గౌతమ్, గౌతమ్ అమ్మగారు నందు ని జాగ్రత్తగా చూసుకుంటూ తనని సంతోషంగా ఉండేలా చేస్తారు…. నందు కూడా గౌతమ్ కోరినట్టు గౌతమ్ విషయంలో తనకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ గౌతమ్ ని సంతోషంగా చూసుకుంటుంది….

అలా ఇద్దరు ఒకరికొకరు తోడుగా మారిపోయి సంతోషంగా లైఫ్ గడిపేస్తూ ఉంటారు….. నందు కి తొమ్మిది నెలల తర్వాత నందు లాంటి బాబు పుడతాడు…. గౌతమ్ తన బాబు ని చేతుల్లోకి తీసుకుని సంతోషంగా నందు నుదిటిన ముద్దు పెట్టి “థాంక్యూ నందు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు!!!!” అని సంతోషంగా అంటాడు

నందు కూడా నవ్వుతూ “థాంక్యూ గౌతమ్ నీలాంటి మంచి భర్త నాకు దొరికినందుకు!!!” అని నవ్వుతూ అంటుంది

అలా ఇద్దరూ సంతోషంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా ఉంటారు……

ఈ కథ ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే!!!!

మగవాళ్ళకి బయట సవాలక్ష పనులు ఉంటాయి…. ఇంట్లో ఉండే ఆడవాళ్ళ వాళ్లకి చేదోడువాదోడుగా ఉండాలి కానీ ఇంకా తలనొప్పి తెచ్చే పనులు చేసి వాళ్ళకి మన మీద మనసు విరిగేలా చేయకూడదు…. మన భర్తలు ఎవరి దగ్గర వాళ్ళ ఆనందాన్ని, బాధని అంత త్వరగా ‌షేర్ చేసుకోరు…. కానీ భార్య దగ్గర మాత్రం అన్ని చెప్తారు….. వాళ్ళని మన మాటలతో చేతలతో బాధపెట్టకుండా చూసుకోవటం మన బాధ్యత కాబట్టి ఎప్పుడు మగవాళ్ళని ఇది కావాలి అది కావాలి అని అడుగుతూ వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించ కూడదు….. భర్తలకి అనుగుణంగా ఉంటే భర్త భార్య ఇష్టాఇష్టాలు అన్ని తెలుసుకొని వాళ్లే మనకి కావల్సినవి ప్రేమతో తెచ్చి మరీ పెడతారు…. మనకి కూడా భర్త ప్రేమతో దగ్గరకు తీసుకుంటే అంతకంటే మించిన సంతోషం మరొకటి ఉండదు కదా!!!! కాబట్టి మనం మన భర్తలని ప్రేమతో చూసుకోవాలి….

అబ్బాయిలు మీరు కూడా పెళ్ళయ్యాక పెళ్ళాం బానిస అనుకుంటూ తనని కాళ్ళ కింద చెప్పులా ఉంచకూడదు….. వాళ్లు కూడా పెళ్లయిన దగ్గరినుంచి అంతకు ముందు ఉన్న తమ ప్రపంచాన్ని కూడా వదిలేసి మీరే లోకంగా బ్రతుకుతారు…. అటువంటిది మీ నుంచి చిన్న నెగిటివ్ కామెంట్ వచ్చిన భార్యలు తట్టుకోలేరు…. కాబట్టి వాళ్ళని బాధపెట్టకుండా మీకు కావాల్సినట్టుగా మీరే మార్చుకోవాలి…..

భార్యాభర్తలు ఇద్దరు ఓపికతో ఉండాలి అలా ఉంటేనే సంసారం సాఫీగా సాగిపోతుంది…. లేదంటే మూడు ముక్కలు విడివిడిగా ఎవరి జీవితం వారు అన్నట్టే బ్రతకాల్సి వస్తుంది……

మొత్తానికి భార్యాభర్తలు గిల్లికజ్జాలు సరదాగా ఉండాలి కానీ ఒకరినొకరు నొప్పించేలా ఉండకూడదు….. భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళ పెదవుల మీద నవ్వు రావాలి కానీ అసహనం కనిపించకూడదు…. నేను ఈ కథ రాసింది కూడా భార్యాభర్తలు ఒకరి విషయంలో ఒకరు ఎలా ఉండాలి అనేది చెప్పటానికి!!! మీకు నచ్చితే ప్లీజ్ నన్ను కామెంట్స్ తో ఎంకరేజ్ చేయండి నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి…..

సమాప్తం….

ఇంకా ఉంది అని చెప్పాలని ఉంది కానీ ఇక రాసే ఓపిక లేదు…. ఇక దీనితో ఈ కథ ముగింపు పలికించేశాను…అనుకున్నాను కానీ!

ఇంతవరకు నా కధని ఆదరించిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్…..

2 Comments

  1. నైస్ సజషన్ గుడ్ రైటింగ్

Comments are closed.