జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 19 61

ఇందు నువ్వు resign చేసిన విషయం తెలిసి మన స్టాఫ్ అంతా మిమ్మల్ని ఎలాగైనా కలిసి దానిని క్యాన్సల్ చేయించాలని ఉదయం నుండి పని చేయకుండా , నేను అడిగితే కావాలంటే ఈ రోజు జీతాన్ని కట్ చేసుకోండి అని చెప్పగా , నీ మీద ఉన్న అభిమానానికి ముగ్ధుడినై నేను ఒకసారి మాట్లాడి వస్తాను అని చెప్పినా వినకుండా అందరూ వచ్చేసారు అని ఇందు బయట మీడియా కూడా ఉంది మొదట మన బ్యాంక్ స్టాఫ్ ను మాత్రమే పిలుస్తాను వారితో నిజం చెప్పి , మీడియా తో మాత్రం ప్రమోషన్ తో వైజాగ్ వెళ్తున్నాను అని మాత్రమే చెప్పామనగా సరే సర్ అని మాటివ్వగా , వెంటనే తలుపు తీసి స్టాఫ్ ను పిలువగా అందరూ కంగారుగా ఆత్రంగా పరిగెత్తుకుంటూ లోపలికి రాగా హాల్ మొత్తం నిండిపోయి తలుపు బయట వరకు నిలబడి మేడం మేడం ……..

అని అరుస్తుండగా ,చైర్మన్ గారు మాట్లాడుతూ మేడం తన రాజీనామాను వెనక్కు తీసుకున్నారు అని చెప్పగా , అందరూ గట్టిగా అరుస్తూ సంతోషంగా కేరింతలు వెయ్యగా అమ్మ ఆ అభిమానాన్ని చూస్తూ గర్వపడుతూ , కానీ మేడం వైజాగ్ బ్రాంచ్ కు ప్రమోషన్ తో వెళ్ళిపోతారు అని చెప్పగా , ఒక్కసారిగా అందరూ సైలెంట్ గా అయిపోయి గుసగుసలాడుతూ చర్చించుకుని మేడం మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనఃస్ఫూర్తిగా చెప్పగా , మేడం అందరికి ధన్యవాదాలు తెలుపగా , 5 నిమిషాలు మాట్లాడి మీడియా ను పిలువగా , అమ్మ చైర్మన్ గారు చెప్పినట్లుగా చెప్పగా రాసుకొని వెళ్లిపోయారు , వచ్చే శనివారం మేడం కు గ్రాండ్ గా పార్టీ ఇస్తూ గౌరవంగా వెళ్లేలా చూద్దాము అని చెప్పగా అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ , అమ్మకు అందరూ all the best చెబుతూ శనివారం కలుద్దాము అని బయటకు వెళ్లిపోగా , చైర్మన్ గారు కూడా అమ్మకు ఏ సహాయం కావాలన్నా ఈ తండ్రి లాంటి వాణ్ణి ఉన్నాడని మరిచిపోకు అని ఆశీర్వదించి వెళ్లిపోగా , అమ్మ నా చేతిని వదిలి పరిగెత్తుకుంటూ వెళ్లి ఇందు అమ్మ భుజాలపై రెండు చేతులు వేసి ఈ అక్క అంటే ఎంత ప్రేమ చెల్లి అని ఆనంద భాస్పాలు కారుస్తూ తలను వెనుక నుండి భుజం పై వాల్చగా , ఇందు అమ్మ వెనక్కు తిరిగి , మీరు నా దేవత అక్కయ్య అని కన్నీరు తుడుస్తూ నుదుటి పై అత్యంత ప్రేమగా ముద్దు పెట్టి ఆనంద భాస్పాలు కారుస్తూ గట్టిగా కౌగిలించుకొని ఒకరి ప్రేమను మరొకరు తెలుపుకుంటుండగా , సరిపోయింది ఇక ఆ దేవుడు దిగి వచ్చినా వీరిని ఇప్పట్లో విడదియ్యలేము అని అమ్మలిద్దరిని ఒకసారి ఉద్వేగంతో కౌగిలించుకొని ఇద్దరి తలలపై హృదయం తరించేలా ప్రేమగా ముద్దులు పెట్టి సంతోషంగా నవ్వుతూ ఇద్దరిని ఒక్కటిగా కొద్దిసేపు వదిలి టేబుల్ పై ఉన్న రిమోట్ అందుకొని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉండిపోయాను.

అక్కడ కృష్ణ గాడు బైకులో ATM కు వెళ్లి మొత్తం డబ్బును డ్రా చేసుకొని సరాసరి లక్ష్మయ్య ఇంటికి చేరుకొని , తలుపు తెరిచి ఉండగా తలుపు తట్టి లక్ష్మయ్య గారు అని పిలువగా , ఆయన కూతురు మానస , ఎవరు అంటూ లోపలి నుండి బాధపడుతూ వస్తూ కృష్ణను చూసిన వెంటనే వెనక్కు తిరిగి కన్నీళ్లు తుడుచుకుంటూ , హే కృష్ణ ఎలా ఉన్నావు ముందు లోపలికి రా అని పలకరిస్తూ , కృష్ణ వెనుక అటు ఇటు చూస్తూ నీ ప్రాణ స్నేహితుడు ఎక్కడ చాలా రోజులయ్యింది మనం కలిసి చివరగా ట్యూషన్ మేడం వాళ్ళ ఇంట్లో కలిసాము అని మాములుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్లుగా అడుగుతుండగా , వాడే స్వయంగా వచ్చి నాన్న గారిని పలకరించాలని అనుకున్నాడు కానీ చాలా అర్జెంట్ పని వల్ల వేరే ఊరు వెళ్ళాడు అందుకే మొదట నాన్న గారిని కలిసి రా అని చెప్పగా ,ఇంతకు నాన్న గారు ఎక్కడ అని అడుగగా , లోపల రూమ్ లో ఉన్నారు కృష్ణ , రా అని పిలుచుకొని వెళ్లగా తలకి దెబ్బతో మంచం పై పడుకొని ఉండగా ఆయన భార్య తడి టవల్ తో ముఖాన్ని తుడుస్తుండగా , ఆయన ముఖం పాలిపోయి నీరసంగా బాధను దిగమింగుతున్నట్లుగా కనిపిస్తుండగా , పక్కనే స్టూల్ వేసి కూర్చోమని చెప్పగా , కూర్చొనగా నాన్న నాన్న అని చిన్నగా చెవి దగ్గర పిలువగా , కళ్ళు తెరువగా మిమ్మల్ని చూడటానికి కృష్ణ వచ్చాడు నాన్న అని చెప్పగా , నా వైపు తిరిగి లెవబోతుండగా , కృష్ణ లేచి వెనక్కు దిండు పెట్టి కూర్చోబెట్టి , ఇప్పుడెలా ఉంది లక్ష్మయ్య గారు అని పలకరిస్తూ జేబులో నుండి కవర్ తీసి అందిస్తూ , మహేష్ అర్జెంట్ గా ఊరికి వెళ్ళవలసి రాగా మీకు ఈ అమౌంట్ వెంటనే ఇచ్చిరమ్మని చెప్పి తను రాగానే వచ్చి కలుస్తాను అని మరీ మరీ చెప్పాడు అని అందిస్తుండగా , ఒక్కసారిగా కళ్ళల్లో కన్నీరు వరదలా కారుస్తూ కష్టంగా రెండు చేతులతో నమస్కరించబోతుండగా ఆపుతూ , మీరు పెద్దవారు మమ్మల్ని ఆశీర్వదించండి అంతే కాని ఇలా అని వారిస్తుండగా , ఆయన భార్య మాట్లాడుతూ పనికి వెల్లకపోవడం వల్ల ఇంట్లో ఉన్న డబ్బుతో మందులకే సరిపోలేదు నిన్నటి నుండి ఆయన ఆరోగ్యం ఇంకా దారుణంగా అయిపోతోంది , డాక్టర్ దగ్గరికి వెల్దామని ఎంత చెప్పినా డబ్బు లేదని తెలిసి వద్దంటున్నారు , ఈయనకు ఇంత జరిగినా కూడా ఎక్కడా మేము డబ్బు అడుగుతామేమో అని చూడటానికి , పరామర్శించడానికి కూడా మా బంధువులు ఏ ఒక్కరూ ఇంటి గడప తొక్కలేదు , ఇలాంటి సమయం లో నువ్వు దేవుడిలా వచ్చి సహాయం చేస్తుంటే ఆయన హృదయం తట్టుకోలేక అలా కన్నీరుగా కారిపోతోంది అని చెబుతూ ఆవిడ మరియు మానస కూడా కన్నీరు కారుస్తూ చాలా భాధపడుతుండగా , అది చూసి గుండె తరుక్కుపోయి వెంటనే నాకు కాల్ చెయ్యగా ,అమ్మలిద్దరిని సంతోషంగా చూస్తూ టీవీ చూస్తుండగా కాల్ రాగా మొబైల్ అందుకొని ఇంటి పైకి వెళ్లి ఎత్తగా , మొత్తం విషయం చెప్పగా , ఇంకా చూస్తున్నావేంటి రా వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చెయ్యి అని చెప్పి డబ్బు ఎంతైనా పర్లేదు దగ్గరుండి చూసుకో ఇప్పుడే పంపిస్తున్నాను అని చెప్పగా , వెంటనే బయటకు పరిగెత్తుతూ క్యాబ్ తీసుకుని వచ్చి , నేను చెప్పినట్లుగా చెప్పి మానస ఈ డబ్బు జాగ్రత్తగా లోపల పెట్టు అని చేతికి ఇస్తూ , బయటకు వచ్చి ఇంటికి తాళం వేయించి ముగ్గురుని హాస్పిటల్ కు పిలుచుకొని వెళ్లగా , డాక్టర్లు చాలా నిర్లక్ష్యం చేశారు ఇప్పటికైనా తీసుకువచ్చారు అని గ్లూకోస్ ఎక్కిస్తూ , తలకు తగిలిన గాయాన్ని శుభ్రపరచి ఇంజుక్టన్స్ వేయగా టాబ్లెట్స్ రాసిచ్చి ఒక రోజు ఇక్కడే ఉండాలి అని ఇప్పుడు ఏమి పర్లేదు రేపటికల్లా మాములు మనిషి అవుతారు , ఒక రెండు వారాలు టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది అని చెబుతూ బిల్ కట్టేయండి అని పక్కనే ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తుండగా , మానస , నాన్న గారిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి రిసెప్షన్ దగ్గరికి వస్తుండగా , మొబైల్ కు మెసేజ్ రాగా చూసుకోగా ఇంకో 50 వేలు ట్రాన్స్ఫర్ అవ్వగా , బిల్ మొత్తం మరియు ఒక రోజుకు హాస్పిటల్ ఖర్చు అంతా కార్డ్ ద్వారా స్వైప్ చేసేసి , రాసిన మందులన్ని కొని వాళ్లకు ఇచ్చి , మిగిలిన డబ్బును డ్రా చేసుకోవడానికి దగ్గరలో ఉన్న ATM కు వెళ్లి డబ్బు తీసుకురాగా , కొద్దిసేపటికి లక్ష్మయ్య కళ్ళు తెరువగా , డాక్టర్ ను పిలుచుకొని రాగా పరిశీలించి బాగా కొలుకుంటున్నారు , మనసుకు బాధ కలిగించకుండా చూసుకోండి అని చెప్పి ఎలాగైనా ఒక రోజు ఇక్కడే ఉండండి అని చెప్పగా , మీరెలా అంటే అలా డాక్టర్ గారు అని , మానస నాన్న గారు డిశ్చార్జ్ అయ్యేంతవరకు అయ్యే డబ్బు అంతా కట్టేసాను , వాడు పంపించిన దాంట్లో మిగిలినది అని చాలా డబ్బును ఇవ్వబోతుండగా , ఇంట్లో ఇచ్చారుగా బాబు చాలు అని వారిస్తుండగా , ఆయనంటే మహేష్ కు చాలా అభిమానం అందుకేనేమో మళ్ళీ ఇప్పుడే పంపించాడు , తీసుకో మానస అని ఇస్తూ వాడు వచ్చిన వెంటనే కాలుస్తాడు అని చెప్పి నేను రేపు ఉదయం వచ్చి కలుస్తాను , ఏదైనా అవసరం ఉంటే మోహమాటపడకుండా కాల్ చెయ్యి అని చెప్పి బయటకు వస్తుండగా , అమ్మ పట్టుకో అని డబ్బు ఇస్తూ మానస బయటకు పరిగెత్తుతూ వచ్చి కృష్ణ ఆగు అని ఆపుతూ మహేష్ ఏ ఊరు వెళ్ళాడు అని అడుగగా , నాకు కూడా చెప్పకుండా గోవా వెళ్ళాడు , ఎందుకని అడిగితే వచ్చాక చెబుతాను అన్నాడు అని చెబుతుండగా , మహేష్ మొబైల్ నెంబర్ ఇస్తావా థాంక్స్ చెప్పాలి అని అడుగగా , మానస పాత కీ ప్యాడ్ మొబైల్ ఇప్పించుకొని నెంబర్ టైప్ చేసి కాల్ చెయ్యగా బాలన్స్ లేదు అని చెబుతుండగా , మానస నీ నెంబర్ చెప్పమని అడిగి 5 నిమిషాలలో రీఛార్జి చేయిస్తానని చెప్పి బయలుదేరాడు.

అమ్మలిద్దరూ చాలసేపటి వరకు నిలబడే కౌగిలించుకొని ఉండగా కాళ్ళు నొప్పిస్తాయని ఇద్దరి దగ్గరికి వెళ్లి అమ్మలిద్దరి చుట్టూ చేతులు వేస్తూ నడిపించుకుంటు వచ్చి సోఫాలో కూర్చోబెట్టగా ఇందు అమ్మ , అమ్మ ఒడిలో తల వాల్చి పడుకోగా, ఇందు అమ్మ తలపై అమ్మ ప్రేమగా ముద్దు పెడుతూ వెంట్రుకలపై ప్రేమగా నిమురుతూ నా భుజం పై తల వాల్చి పడుకోగా అమ్మ భుజం చుట్టూ చెయ్యి వేసి తలపై అత్యంత ప్రేమగా ముద్దు పెట్టి టీవీ ఆఫ్ చేసి అమ్మ తలపై తల వాల్చి ముగ్గురమూ నిద్రపోయి ఉండగా , కృష్ణ గాడు బయటకు వచ్చి ఎదురుగా ఉన్న షాప్ లో మానస నెంబర్ కు 500 బ్యాలన్స్ వేయించి ,