అమ్మలిద్దరూ నా బుగ్గలను వెచ్చటి చేతుల్లోకి తీసుకొని థాంక్స్ కన్నయ్య , బేబీ అంటూ నా నుదుటిపై అత్యంత ప్రేమతో ముద్దులు పెట్టి , వెళదామా అని అడుగగా ,ఇంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి అమ్మలిద్దరి చేతులు అందుకొని బయటకు వచ్చి ఇంటి తాళాలు మరియు గేట్ తాళాలు వేయగా , అమ్మలిద్దరూ ముందు ఎవరు కూర్చోవాలని నవ్వుకుంటూ చూసుకొంటుండగా , అమ్మలిద్దరికి sorry చెబుతూ ఈరోజు మాత్రం ఇద్దరూ వెనుక కూర్చోవాల్సిందే అని వెనుక డోర్ లు రెండు తెరువగా ,
అమ్మలిద్దరూ కదలకుండా నిలబడిపోతూ బేబీ , కన్నయ్య మా వల్ల కాదు ఎవరో ఒకరు నిన్ను ప్రేమగా హత్తుకొని కూర్చోవలసిందే అని చిన్న పిల్లల్లా మారాము చేస్తుండగా , చాలా ముచ్చటేస్తూ మా మంచి అమ్మలు కదూ మిమ్మల్ని హత్తుకోకుండా ఉండటం నా వల్ల కూడా కాదు , కానీ ఇప్పుడు మాత్రమే మళ్ళీ వెనక్కు వచ్చేటప్పుడు మన ఇష్టం అమ్మ అని సున్నితంగా చేతులు నిమురుతూ ప్రేమగా బతిమాలగా , ఒక నిమిషం పాటు అమ్మలిద్దరూ కళ్ళతోనే మాట్లాడుకున్న తరువాత సరే బేబీ కానీ వచ్చేటప్పుడు మాత్రం మామాట వినాల్సిందే అని గట్టిగా చెప్పగా , మీ లవ్లీ మదర్స్ అని అంటుండగా అమ్మలిద్దరూ కారు వెనుక ఎక్కి కూర్చోగా,
సంతోషంగా నవ్వుతూ కారు ఎక్కి మొబైల్ లో మెడికల్ కాలేజ్ రూట్ చూస్తూ వేగంగా పోనిచ్చాను. బేబీ ఇప్పుడన్నా చెబుతావా మనం ఎక్కడికి వెళుతున్నామో అని అడుగగా , wait mom అంటూ చిరునవ్వు తో బదులిస్తూ వీలైనంత వేగంగా ట్రాఫిక్ దాటుకుంటూ పోనిస్తుండగా , ఎక్కడికి అని ఆలోచిస్తూ అమ్మ చేతిని అందుకొని దారిలో కనిపిస్తున్న ప్రదేశాలను అమ్మకు చెబుతూ , 4:45 కల్లా కాలేజ్ ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గరకు రాగా ,
అమ్మ ఆనందంతో తన కళ్ళను పూర్తిగా తెరిచి బయటకు చూస్తూ చెల్లి ఇటువైపు చూడమని చెప్పగా , పెద్ద బ్యానర్ లో ఇందు అమ్మ మరియు విక్రమ్ సర్ ఫోటోలు వేసి , కాలేజ్ anniversary ఫంక్షన్ కు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్న గౌరవనీయులైన ఇందు గారు బ్యాంక్ manager మరియు విక్రమ్ goa dsp గారికి కాలేజ్ తరుపున హృదయపూర్వక స్వాగతం అని ఉండగా , ఇందు అమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ బేబీ……అని ధీర్ఘం తీస్తూ ఏదో మాట్లాడబోయి ఆగిపోతూ కంగారుతో అమ్మ చేతిని గట్టిగా పట్టుకొని వణుకుతుండగా ,
కన్నయ్య అని పిలువగా కారును ఆపి వెనక్కు తిరిగి ఇందు అమ్మ పరిస్థితిని చూసి ఇందు అమ్మ చేతిని అందుకొని ప్రేమగా నిమురుతూ అమ్మ అని జేబులో నుండి పేపర్ ఇస్తూ మొత్తం విక్రమ్ సర్ చూసుకొంటున్నారు , దాని ప్రకారం ముందుకు వెళుతూ వైజాగ్ లో లాగా స్పీచ్ ఇచ్చావంటే చాలమ్మా , అంటూ ధైర్యం చెబుతూ , గేట్ దగ్గరకు పోనివ్వగా పోలీస్ బందోబస్తు చాలా ఉండగా మా కారును చెక్ చెయ్యడానికి వస్తూ నన్ను చూసి సెల్యూట్ చేస్తూ చేతితో గౌరవంగా లోపలికి అని చూపించగా,
నేను రక్షించిన అమ్మాయిలంతా గోవా సాంప్రదాయ చీరలు కట్టుకొని ఇందు అమ్మను గౌరవంగా స్వాగతం పలకడానికి ఆతృతగా ఎదురుచూస్తుండగా , స్వాతి మాత్రం ముఖం లో ఏదో కంగారుతో ముందు వరుసలో నిలబడి ఉండటం బాగా కనిపిస్తోంది. కారును ఆపగా వారంతా మా కారు చుట్టూ గుమిగూడుతూ , ముందుగా ఇందు అమ్మను మీరు రావడం చాలా చాలా సంతోషం మేడం అని స్వాగతిస్తూ నా వైపు పెదాలపై చిరునవ్వులతో చూస్తూ స్వప్న మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా తల వంచుకొని బాధపడుతున్నట్లుగా మౌనంగా ఉండిపోగా , వారి వెనుక చాలా మంది స్కూటీ లలో కూర్చొని ఉండగా ,
మేడం ఇక్కడి నుండి హాల్ వరకు మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ మీ ముందు వెనుక ర్యాలీ తో తీసుకువెళతాము అని చెప్పగా , అందరూ వెళ్లి స్కూటీ లలో కూర్చోగా హాల్ వరకు స్టూడెంట్స్ కేరింతలతో హాల్ వరకు చేరుకోగా , కాలేజ్ ప్రిన్సిపాల్ , విక్రమ్ సర్ మరియు అడ్మినిస్ట్రేషన్ మొత్తం కారు దగ్గరికి ఇందు అమ్మను సాదరంగా ఆహ్వానించడానికి రాగా , ఇందు అమ్మ కంగారుపడుతుండగా , కళ్లతో ధైర్యంగా ఉండమని చెప్పగా ఒకసారి లవ్ యు బేబీ నువ్వు ఉండగా నాకెందుకు భయం అని కళ్ళు మూసుకొని అమ్మ చేతిని అందుకొనగా ,
కారు బయట అందరూ పుష్ప గుచ్చాలతో నవ్వుతూ ఎదురుచూస్తుండగా , అమ్మ పూర్తి విశ్వాసంతో అమ్మ చేతిని అందుకొని దిగగా నేను కూడా దిగి అమ్మ వెనుక నిలబడగా అమ్మాయిలంతా చుట్టూ చేరగా , మొదటగా ప్రిన్సిపాల్ ఆమెను పరిచయం చేసుకుని స్వాగతం పలుకుతూ పుష్ప గుచ్ఛం ఇవ్వగా అందుకొని అమ్మను మా అక్కయ్య అని పరిచయం చెయ్యగా వెంటనే మరో పుష్ప గుచ్ఛం అందుకొని స్వాగతం మేడం అని ఇవ్వగా , స్టూడెంట్స్ ప్రెసిడెంట్ ఒక అమ్మాయి వస్తూ పుష్ప గుచ్ఛంతో ఆహ్వానిస్తూ మిగతా వారందరినీ పరిచయం చెయ్యగా , విక్రమ్ సర్ నా వైపుకు రాగా సర్ అంతా ok కదా అని అడుగగా , మేడం కు ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వు రక్షించిన వారు అనుక్షణం వెంటే ఉంటారు అని చెబుతుండగా ,వెంటనే వారంతా అమ్మలిద్దరి పక్కనే చేరుతూ గుండెలపై చేతులు వేసుకొని మేమున్నామని సైగలు చేస్తూ అమ్మతో మాట్లాడుతూ ఉండగా, ప్రిన్సిపాల్ స్వయంగా లోపలికి పిలుచుకొని వెళ్లి హాల్ లోపల సుందరంగా అలంకరించిన స్టేజి ముందు వేసిన సోఫాలలో అమ్మలిద్దరిని కూర్చోబెడుతూ , విక్రమ్ సర్ ను పక్కనే ఆహ్వానిస్తూ కూర్చోబెట్టి , తను కూడా పక్కనే కూర్చోగా , హాల్ మొత్తం స్టూడెంట్స్ తో నిండిపోగా చిన్నగా గోవా సంప్రదాయ మ్యూజిక్ ప్లే అవ్వగా ఒక వైపు నిలబడసాగాను.
హాల్ బయట కొంతమంది అమ్మాయిలు స్వాతి చుట్టూ చేరి ఏదో చెబుతుండగా చివరగా తల ఊపగా , ఒక అమ్మాయి వచ్చి నా పక్కన నిలబడి మహేష్ కొద్దిగా బయటకు వస్తావా అని చెవిలో చిన్నగా చెప్పగా , వెనక్కు తిరిగి మీరా ఎలా ఉన్నారు అని అడుగుతూ బయటకు రాగా మిగతావారంతా నా దగ్గరికి వచ్చి మహేష్ హాస్టల్ లో అతిథులకు ఇవ్వడానికి రాత్రంతా మేము కష్టపడి గిఫ్ట్ తయారు చేసాము , అది మా స్కూటీ లలో తీసుకురావడం కుదరదు , స్వాతితో పాటు నీ కారులో హాస్టల్ కు వెళ్లి తీసుకురావాలి అని చెప్పగా ,
సరే మీకోసం ఏదైనా చేస్తాను అని చెప్పగా ,మేమే నీ కోసం ఏదైనా చెయ్యాలి, మాకోసం మరెప్పుడైనా చేద్దువు మహేష్ ఇప్పుడు స్వాతి గురించి ఆలోచించమని వారిలో వారే గోనుక్కోగా , what అని అడుగగా ఏమి లేదు మహేష్ , ఎంతసేపయినా పర్లేదు మేము మేడం ని జాగ్రత్తగా చూసుకొంటాము మీరు ఆత్రం పడకుండా నిదానంగా రండి అని హాస్టల్ వార్డెన్ కు కాల్ చేసి చీఫ్ గెస్ట్ హాస్టల్ దగ్గరికి వస్తున్నారు ప్రిన్సిపాల్ పర్మిషన్ తీసుకున్నాము లోపలికి వడాలంది అని చెబితూ అందరూ తమలో తాము నవ్వుతూ చెబుతూ స్వాతిని ముందుకు తొయ్యగా , ఒక చిరునవ్వు నవ్వి ముందుకు నడువగా వెనకాలే బయటకు వస్తూ , అమ్మ బయటకు వెళ్తున్నాను వెంటనే వచ్చేస్తాను అని ఇందు అమ్మకు మెసేజ్ పెట్టి కారు దగ్గరికి చేరుకున్నాము.
కారు డోర్ తెరువగా లోపలికి ఎక్కి చుట్టూ వింతగా చూస్తుండగా అవతలివైపుకు వెళ్లి కారు ఎక్కి స్టార్ట్ చేస్తూ ఎటువైపు అని అడుగగా , మాట కూడా మాట్లాడకుండా తలతో అటువైపు అని చూపించగా , అటువైపు ముందుకు పోనిస్తూ శరత్ మరియు నాన్న గారి గురించి అడుగగా , మౌనంగా ఉండిపోగా , హాస్టల్ కి ఎప్పుడు వచ్చావు ఇంటి దగ్గర అందరూ బాగున్నారుగా , చీరలో చాలా అందంగా ఉన్నావు అని నేనే మాట్లాడుతుండగా , స్వాతి తల దించుకొని మౌనంగా ఉండిపోయింది.
ఒక కిలోమీటర్ తరువాత హాస్టల్ రాగా దిగి గేట్ దగ్గరికి వెళ్లగా స్టూడెంట్స్ అందరూ ఫంక్షన్ దగ్గర ఉండగా తాళం వేసి ఉండగా వెనుక నుండి వార్డెన్ వస్తూ తాళం తెరిచి స్వాతి లోపలి నుండి వేసుకొని మీరు వచ్చేటప్పుడు బయట వేసుకొని రండి అని వెళ్లిపోగా , స్వాతి గారు హాస్టల్ లో మీరు చాలా ఫేమస్ లా ఉన్నారే అని నవ్వుతూ పలుకరించినా కూడా మౌనంగా లోపలికి వెళ్ళి లోపలి నుండి తాళం వేసి సెకండ్ ఫ్లోర్ చివరన ఉన్న రూమ్ కు పిలుచుకొని వెళ్లగా , హాస్టల్ మొత్తం నిశ్శబ్దన్గా నిర్మానుశ్యంగా ఉండగా రూమ్ ముందు ఆగి బొడ్డు దగ్గర నుండి తాళం చెవి తీసి తెరిచి లోపలికి అని చేతితో చూపించగా ,
????