వకీలు స్నేహితుడు

సోహెల్: సరే ఐతే, ఇక నేను బయలుదేరుతాను.

మురాద్: అర్జున్, నెవ్వెక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు?

అర్జున్: నిన్న నా కారు హాస్పిటల్లోనే వదిలేసాను, ఇప్పుడు దాన్ని తెచ్చుకోవడానికి అక్కడికే వెళ్తున్నాను.

మురాద్: ఓకే, మళ్ళీ కలుద్దాం.

అర్జున్: సరే, మళ్ళీ కలుద్దాం.

అర్జున్: సరే, మళ్ళీ కలుద్దాం.

ఒక కొత్త ఉదయం 2వ భాగం

శుక్రవారం, ఉదయం 10 గంటలు, చట్టగ్రాం ధర్మాసుపత్రి బళ్ళు నిలిపే చోటు….

అక్కడే ఆపిఉన్న నా కారు దగ్గరికి వెళ్తుంటే, ఎవరో వెనకనుంచి నన్ను పిలిచినట్లనిపించింది. వెనక్కి తిరిగా. తనే, నిన్న నేను కాపాడిన టీనేజ్ కుర్రాడు, తన పేరు గోపాల్ సేన్. తను వీల్ చార్ లో కూర్చుని ఉన్నాడు, తన వెనుక అతని అమ్మ, సోదరి కాబోలు నిలబడి ఉన్నారు. నిన్న ఈ ప్రమాదం గురించి చెప్పడానికి వాళ్ళింటికి కాల్ చేసినప్పుడు తన సోదరే మాట్లాడింది. ప్రమాదం గురించి విన్నవెంటనే ఐదు నిముషాల్లో అలాగే కాలెజ్ బట్టల్తోనే వచ్చింది. తను వచ్చేటప్పటికే నేను అక్కడి ఫార్మాలిటీలన్నీ పూర్తి చేసున్న, తనొచ్చి గార్డియన్ గా సంతకం చేసింది డాక్టర్లు తమ పని మొదలు పెట్టడానికి. వాళ్ళు నా దగ్గరకొచ్చి పలకరించారు.

“అమ్మా, తనే నిన్న మన గోపాల్ జీవితాన్ని కాపాడి హాస్పిటల్ కు తీసొచ్చిన దేవుడు” గోపాల్ సోదరి వాళ్ళ అమ్మతో చెప్పింది.

గోపాల్ అమ్మ: చాలా థ్యాంక్స్ బాబు. నీకెంతగానో ఋణపడిపోయాం నా చిన్న కొడుకు ప్రాణాలు కాపాడినందుకు.

నేను: మరేం పరవాలేదు అమ్మగారు, నాకాసమయంలో అది నా కర్తవ్యంగా తోచి చేసాను. మనుషులన్నాక ఒకరికొకరం సహాయం చేసుకోవాలి కదా, అదే చేసాను. ప్రత్యేకంగా ఏం చేయలేదు.

గోపాల్ అమ్మ: కాదు బాబు, నువ్వు చేసిన పని చాలా ప్రత్యేకమైనది, అందరూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇంకొకరి ప్రాణాలను కాపాడరు. నువ్వు వొప్పుకోవడానికి మొహమాటపడుతున్నావు. నువ్వు మా పాలిటి దేవుడివి.

నేను: అమ్మా, మీరు నన్ను మరీ పొగిడేసి ఇబ్బంది పెడుతున్నారు.

గోపాల్ సోదరి” సరే మనమిక దాని గురించి మాట్లాడ్డం ఆపేస్తాం, తన చేతిని ముందుకు చాస్తూ “హాయ్, నా పేరు సుభద్ర, మిమ్మల్ని కలుసుకోవడం నాకేంతో సంతోషంగా ఉంది, అన్నట్లు మీరు…”

నేను: అర్జున్ దాస్.

అది విని గోపాల్ నవ్వి…
గోపాల్: వావ్…అర్జున్, సుభద్ర..ఎంతటి యాదృచ్చికం

సిగ్గుతో ఎర్రబడ్డ మొహతో
సుభద్ర: ఇక ఆపుతావా, ఇదేం సరదా కాదు

గోపాల్ అమ్మ కూడా కాస్త కోపంగా చూడడంతో గోపాల్ ఇంకేం మాట్లాడలేదు, కాని వెంటనే నా వైపు చూసి మట్లాడుతూ…

గోపాల్: అన్నా, రేపు మా ఇంటికి రావా ప్లీజ్, ప్లీజ్. రేపు నా పుట్టిన రోజు, మీరు రేపు రావాల్సిందే.

నేను: నేనా, ఈ పరిస్థితిలోనా (నావైపు చూసుకుంటూ) …కాని ఇది అంత మంచి ఆలోచనగా అనిపించడం లేదు.

గోపాల్: అమ్మా, నువ్వన్న చెప్పు తనని రమ్మని

2 Comments

  1. Endi ra edi ladha na waste ga enkkadi nundi ekkadiki tiskupoyav ra waste of time

Comments are closed.