వకీలు స్నేహితుడు 212

నా స్నేహితుడు నయీం సోహెల్ 36 యేళ్ళ ఒక మామూలు మనిషి. ఐదడుగుల ఆరంగుళాలతో
ఎత్తుతో చూడడానికి చాలా సాదాసీదాగా ఉంటాడు. అతని రంగు, రూపం కూడా చూడగానే ఆకట్టుకునేలా మరీ గొప్పగా కాక ఒక సరాసరి సగటు మనిషిలా ఉంటుంది. కాని తను చాలా చాలా తెలివైన వాడు. ఒక వకీలుగా అతను గెలిచిన కేసులే దానికి సాక్ష్యం. కేసులు గెలవడానికి తనేమీ తప్పుడు సాక్ష్యాలు వాడడు, అవినీతి సహాయం తీసుకోడు, మోసం చేయడు. అతను వాదాడిన కేసులన్నీ పేదవారికి, మద్యతరగతికి చెందిన వారివి మాత్రమే. మిగిలిన వాళ్ళు అటువంటి కేసుల్ని అస్సలు పట్టించుకోరు. సోహెల్ మామూలుగా ఓ కుటుంబ వకీలు, అతను తీసుకునేవన్నీ విడాకులు, వరకట్నం, భాగస్వామి వేదింపులు, భూతగాదాలు వంటి రకాలకు సంబందించినవి మాత్రమే. అప్పుడప్పుడు కాస్త మార్పుకోసం ఓట్రెండు క్రిమినల్ కేసులు కూడా వాదించాడు. తన ఆదాయమేమీ పెద్ద గొప్పగా ఉండదు, కాని కుటుంబాన్ని పోషించడానికి సరిపోతుంది. సోహెల్ భార్య మరియంకు 31 యేళ్ళు. వారిద్దరికి ఇద్దరు కూతుళ్ళు ఒకరికి 10 ఏళ్ళు, ఇంకొకరికి 7 ఏళ్ళు, ఒక ఎనిమిది నెలల కొడుకు ఉన్నారు.

రజియా ఇంటినుంచి తిరిగొచ్చిన తరువాత….

సోహెల్ తన ఇంటి తలుపు తట్టగా అతని 10 ఏళ్ళ కూతురు మిని తలుపు తీసి, ” అమ్మా…నాన్నొచ్చారు” అంది. సోహెల్ మినిని హత్తుకుంటూ తన ఫాలభాగం పై ముద్దుపెడుతూ ” లడ్డూ, నువ్వింకా పడుకోలేదా?” అన్నాడు.

మిని బదులిస్తూ, ” లేదు, మీకోసమే ఎదురుచూస్తున్నా. నాకు నా చాకొలేట్ ఇస్తే నేను పడుకుంటా” అంది.

మరియం బెడ్రూం నుంచి బయటికి వస్తూ, ” వినండి మినికి నాన్నగారు, మీ కూతురు నా మాట అస్సలు వినడంలేదు, ఏదైనా చెప్పిన పనిచేయాలంటే లంచం ఇవ్వాల్సివస్తోంది. జామి (రెండో కూతురు) చూడు, తను పడుకుని అప్పుడే గంట దాటింది” అంది.

సోహెల్ మిని వంక తెచ్చిపెట్టుకున్న కోపంతో చూస్తూ “నువ్వు అమ్మ మాట వినడం లేదా, అమ్మ నిజమే చెప్తోందా?” అన్నాడు. దానికి మిని బదులిస్తూ, : నాన్నా అమ్మ చెప్పింది చాలామటుకు నేను వింటూనే ఉన్నా, సరే నేను ఇప్పుడు పడుకోవాలికదా, నేవెళ్ళి ఒక్క నిముషంలో నిద్రపోతా..గుడ్ నైట్ నాన్నా, గుడ్ నైట్ అమ్మా” అంటూ తన చెల్లెలు నిద్రపోతున్న బెడ్రూం లోకి వెళ్ళి పడుకుంది.

సోహెల్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్రూంలోకి వచ్చాడు. తన మొహం తుడుచుకోవడానికి తువ్వాలు అందించింది మరియం. సోహెల్ బెడ్ పై పడుకోగానే మరియం అతని కాళ్ళను తన వొడిలో తీసుకుని మసాజ్ చేస్తూ…

మరియం: రేపు శుక్రవారం, మీకు గుర్తుందిగా శనివారానికల్ల మిని, జమి పరీక్ష ఫీజు కట్టాలి.

సోహెల్: నాకు గుర్తుంది.

మరియం: వచ్చే వారానికల్లా బియ్యం నిండుకుంటాయి.

సోహెల్: అప్పుడే, తీసుకొచ్చి ఇంకా ఒక నెల కూడా కాలేదు?

మరియం: అందులోనుంచి కొద్దిగా మా వాళ్ళకు పంపించాను.

సోహెల్: సరే, వచ్చేవారం తీసుకొస్తా.

మరియం: ఏమైంది, రజియా ఎందుకంత అర్జంట్ గా రమ్మని కబురు చేసింది?

క్లుప్తంగా ఆ రోజు జరిగింది చెప్పాడు సోహెల్.

2 Comments

  1. Endi ra edi ladha na waste ga enkkadi nundi ekkadiki tiskupoyav ra waste of time

Comments are closed.