గోపాల్ అమ్మ: నేను కూడా అదే ఆలోచిస్తున్నా, మాకింతటి సహాయం చేసిన నీకు కొద్దోగొప్పో మా ఆతిధ్యాన్ని రుచి చూపించాలి. దయచేసి కొన్ని గంటలకైనా నువ్వు వస్తే నాకు తృప్తిగా ఉంటుంది.
సుభద్ర: అవును సార్, ప్లీజ్…రేపు మీరు వస్తే మీతోబాటూ గోపాల్ పుట్టినరోజు వేడుక జరుపుకోవడం మా కెంతో సంతోషంగా ఉంటుంది. మా ఇంటి చిరునామా రాసిస్తాను ఉండండి అంటూ సుభద్ర తమ చిరునామా ఓ కాగితం పై రాసిచ్చింది.
సుభద్ర: అమ్మా..ఇక వెళ్దాం. అర్జున్ గారు రేపొస్తారులే, రేపు కలుద్దాం అర్జున్ గారు.
నాతో తప్పకుండా వాళ్ళ ఇంటికి వస్తానని మాట తీసుకుని పార్కింగ్ స్థలం వైపు వెళ్ళసాగారు. నా కైతే ఇప్పుడు నేనున్న మన స్థితిలో ఎక్కడికి వెళ్ళాలని, ఎవరితోనైనా కలవాలని అస్సలు లేదు…కాని అదేంటో ఇలాంటి పరిస్థితుల్లోనే ఎప్పుడూ ఇరుక్కుంటుంటాను. ఇప్పుడు వాళ్ళింటికి తప్పనిసరిగా వెళ్ళాల్సివస్తోంది మాట ఇవ్వడం వల్ల. ఆలోచిస్తూ నేను నా కార్లో కూర్చుని స్టార్ట్ చేసాను. సుభద్ర మళ్ళీ పార్కింగ్ లోకి హడావిడిగా వచ్చి నా కార్ వైపు పరుగెత్తుకుంటూ రాసాగింది.
సుభద్ర: అర్జున్ సార్, ఒకవేళ మా ఇంటి చిరునామా కనుక్కోవడం కష్టమైతే మమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేస్తారు?
నేను: అది నేను చూసుకుంటా.
సుభద్ర: చూసుకోవడాలు, వెతకడాలు ఇవన్నీ వద్దు సార్, మీ ఫోన్ నంబరు ఇవ్వండి, మీరు రావడం ఆలస్యమైతే, ఏదైనా సమస్య వస్తే కాల్ చేయొచ్చు. రేపటి వేడుకలో మీరే మా ప్రత్యేకమైన ముఖ్య అతిధి, కాబట్టి మీరు రావడం అస్సలు ఆలస్యం కాకూడదు.
నేను: సరే, ఇదిగో నా కార్డ్.
సుభద్ర: వావ్, మీరు పారడైజ్ లో పనిచేస్తారా…ఉమ్మ్మ్..బావుంది.
(అసలు నేనే పారడైజ్ యజమానినని తనకు తెలియలేదు)
ఉండండి నేను మీకు కాల్ చేస్తాను, నా నంబరు సేవ్ చేసుకోండి.
మేము నంబర్లు సేవ్ చేసుకున్న తరువాత, తన సోదరి తమను తీసుకెళ్ళడానికి వస్తోందని చెప్తూ తనెళ్ళింది.
ఆసుపత్రి నుంచి బయటకు వస్తుంటే మురాద్ కాల్ చేసాడు. మేము ముందనుకున్నట్లు చేయడానికి (మా ఇంట్లో రహస్య కెమరాలు అమర్చడం) అన్నీ తయారుగా ఉన్నాయని, నేను నా కుటుంభాన్ని ఆవేళ మద్యాహ్నం ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళాలని చెప్పాడు. సోహెల్ నాకిచ్చిన పనిని నేనిప్పుడు పూర్తి చేయాలి.
అర్జున్ ఇంట్లో…
సుప్రియ (అర్జున్ అమ్మ): బాబు, నిన్ను ఇవాళ విశ్రాంతి తీసుకోమని చెప్పాకదా, ఎక్కడికెళ్ళావు?
అర్జున్: కొద్దిగా పనుంటే హోటల్ వరకూ వెళ్ళొచ్చా. దేవ్ తన ఆర్ట్ క్లాసునుంచి వచ్చేసాడా?
(దేవ్ కు ప్రతి శుక్రవారం ఆర్ట్ క్లాసు ఉంటుంది)
సుప్రియ: ఆ…ఓ ఐది నిముషాల క్రితమే వచ్చాడు, బహుశా స్నానం చేస్తుండొచ్చు.
బనిషా వంటగదినుంచి పళ్లరసం తీసుకొచ్చి నాకందించింది. డ్రాయింగ్ రూం లోని సోఫాలో నా పక్కనే కూర్చుంటూ..
బనిషా: (షోనా) బంగారు, సోహెల్ అన్న ఇవాళ కాల్ చేసాడు. చెప్తే నువ్వు నమ్మవు, శ్రీమతి యాస్మిన్ నన్ను తన సహాయకురాలిగా ఎన్నుకుందట. నాకు చాలా ఆనందంగా ఉంది ఆ ఆనందంలో మాట్లాడాలో తెలియడం లేదు. తను చట్టగ్రాం చుట్టుపక్కల చాలా పేరుప్రఖ్యాతులున్న న్యాయవాది.
అర్జున్: ఈ పని నీకు తగినదే, దీనికోసమేగా నువ్వు కొన్ని నెలలుగా చాలా కష్టపడి చదువుతూ పని చేస్తున్నావు.
బనిషా: అవుననుకో, కాని నాకు కొద్దిగా గాబరాగా కూడా ఉంది.
దేవ్: కంగ్గరు పడకు వదినా, నువ్వు ఈ పని చాలా బాగా చేయగలవు, ఆత్మవిశ్వాసంతో ఉండు.
అర్జున్: కరెక్ట్, నీపై నీకు నమ్మకం చాలా ముఖ్యం. ముందు అక్కడికి వెళ్ళు, అక్కడ జరిగేవన్నీ చూడు, నేర్చుకో. చాలా తొందర్లోనే నువ్వు నేర్చేసుకుంటావు అందరికన్నా బాగా.
బనిషా: మీ అందరి సహకార ప్రోత్సాహాలు లేకుంటే నేనిది సాదించేదాన్ని కాదు, మీ అందరికి ప్రోత్సాహానికి చాలా చాలా థ్యాంక్స్.
అర్జున్: మా సహకారం ఎప్పుడూ ఉంటుంది.
చంపా వంటగది నుంచి బయటికొస్తూ అందరూ భోజనాలు ఇప్పుడే చేస్తారా అంది
అర్జున్: ఇప్పుడే వద్దు చంపా, కాస్త ఆగుదాం. నొకుల్ కూడా రానీ, వొంటి గంటలోపల వచ్చేస్తాడు కదా.
సుప్రియా: బాబా, అన్నట్లు చెప్పడం మర్చేపోయా, ఇందాక రజియా, మురాద్ కాల్ చేసారు. ఇవాళ రాత్రి భోజనానికి వాళ్ళింటికి రావాలని.

Endi ra edi ladha na waste ga enkkadi nundi ekkadiki tiskupoyav ra waste of time
Ssss