శివ: try చేస్తా
సాయి: try చెయ్యడం ఏంటి పక్కా రావాలి.
కాజల్: నాకు ఒక document submission ఉంది, అది అయ్యాక వస్తా
దీపా: ఈ week లో చేస్కోవే, నేను already ఉన్నకోటి submit చేస్తున్న ఇవాళా తీసుకునే వచ్చాను.
కాజల్: ఆగవే ఇద్దరం కలిసి పోదాం
దీపా: నాది ఇక్కడే UoH లో యూరోప్ లో కాదు.
కాజల్: UoH లో నా అదేంటి, ఇక్కడెందుకు?
దీపా: ఆ నేను ఇక్కడ నుంచే తీసుకున్న ప్రాజెక్ట్. Stafford లో కాదు, చాణక్య నే ఇక్కడ recommend చేసాడు.
శివ వైపు చూస్తుంది. దీపా చూడడం చూసి కాజల్ కూడా చూసింది. అప్పుడే శివ నవ్వు ఆపుకున్నాడు.
కాజల్ లేచి శివ ని పట్టుకుని,
కాజల్: ఎంటి నవ్వు ఆపుకుంటున్నావ్?
శివ: ఏం లేదు
కాజల్: ఎదో ఉంది చెప్పు.
దీపా: నేను చెప్తా
శివ: దీపూ వద్దూ
కాజల్: చెప్పు దీపా, (శివ ని కొట్టేసెలా చూస్తూ) ఇవాళా ఉంది నీకు
దీపా: అసలు ఓమ్యకొన్ డాక్యుమెంటరీ ఏ లేదు, వీడే చాణక్య తో fake forward చేపించి, నిన్ను timepass కిఅక్కడికి తీసుకెళ్ళాడు
అని నవ్వుతుంది
కాజల్ శివ జుట్టు పట్టుకుని లాగుతూ,
కాజల్: వేస్ట్ ఫెల్లో, చెత్త ఫెల్లో ఎందుకు ఇదంతా
శివ ని ఎలా పడితే అలా కొడుతుంది, గుద్దుతోంది.
కాజల్: చెప్పు చెప్పు….
శివ: ఆపవే ఊరికే నే నాకు అక్కడికి వెళ్ళాలి అని ఉండేది ఇప్పుడు వెళ్ళొచ్చా అంతే.
కాజల్: ఊరికే ఊరికే ఏంటీ, నీ వల్ల ఒకడిని చంపేసా కదరా. నిన్ను ఇలా కాదు, నాకు చెప్పేవన్నీ అబద్ధాలే, ఇంకాఎన్ని అబద్ధాలు చెప్తావు
శివ గల్ల పట్టుకుని, కింద పడేసి తంతుంది
దీపా: ఏ ఆగు కాజల్ ఏంటి ఇది.
అని కాజల్ ని పట్టుకుని వెనక్కి లాగింది.
సాయి నవ్వుతున్నాడు,
కాజల్ విడిపించుకుని, ఇంకా కోపంగా, ” వదలవే, నీకు తెలీదు, కొంచెం అయితే సచ్చిపోయేవాడు తెల్సా, ఎలా కాపాడుకున్నా, ఆటాలు అనుకుంటున్నాడు ”
దీపా ని విడిపించుకుని, శివ కాలర్ పట్టుకొని లేపి, చెంపలు వాయించింది.
కాజల్: నీ వల్ల ఒక ప్రాణం పోయింది వేస్ట్ ఫెల్లో, అది చిన్న విషయమా
జుట్టు పట్టుకుని లాగుతూ, ఊపుతుంది, శివ ని అలా కొట్టడం చూసి దీపా కి ఓపిక నశించింది, కోపం వచ్చిఅరిచింది,
దీపా: ఆపు కాజల్, శివ ని ఇంకా కొడితే నేను ఊరుకోను చెప్తున్నా
అని కాజల్ ని నెట్టేసింది.
శివ: దీపూ…..
కాజల్: ఎంటే ఆ నా మొగుడు నా ఇష్టం
దీపా: నోరుమూయి అలా కొడ్తున్నావు, ఏమనుకుంటున్నావే, బాగా బలుపెక్కింది
కాజల్: మరి వాడు చేసింది ఏమైనా బాగుందా నన్ను, నేను చేసిన దానికి మొన్న ఎంత భాధ పడ్డానో నీకుచెప్పిన కదా, అక్కడికి వెళ్లకుంటే నేను అలా చేసేదాన్ని కాదు.
సాయి: కాజల్ అది మరచిపో, ఇది కూడా మరచిపో ప్లీస్ ఆపండి ఇక చాలు
కాజల్: ఎలా సాయి ఎలా ఉండాలి తనతో నేను మీరే చెప్పండి, ముందు నుంచి నాకు అన్ని అబద్ధాలే చెప్పాడు, అయినా నా శివ అని ఊరుకున్నా, కానీ ఇప్పుడు నన్ను ఒక murderer ని చేసాడు. అక్కడికి వెళ్ళకుంటేఇలాఅయ్యేది కాదేమో
దీపా మాథ్యూస్ గురించి మాట్లాడుదాం అనుకుంది కానీ వద్దు అని ఊరుకుంది.
దీపా: కానీ నువ్వు శివ ని కొట్టడం తప్పు
కాజల్ కి ఇంకా కోపంగానే ఉంది,
కాజల్: ఎందుకు ఎందుకు తప్పు ఆ, చెప్పు
శివ: దీపా ఇందుకే నా మీరు వచ్చింది
కాజల్: నువ్వు ముస్కో వేస్ట్
దీపా: ముందు నువ్వు ముస్కో, వాడెవడో తెల్సా
సాయి: దీపా ఇప్పుడెందుకు అవన్నీ
దీపా: మీ నాన్న అప్పుచేసాడు, చదువుకోవాలి అని ఓ చెప్తావుగా, gold medalist
కాజల్ వేరే వైపు చూస్తూ ఉంది,
దీపా: ఇటు చూడు విను, అప్పు కాదు, శివ…. శివ నిన్ను చదివించాడు, నీకోసం వాడికి ప్రొఫెసర్ గా వచ్చినజీతంఅంతా మీ నాన్నకి ఇచ్చాడు. యువరాణి లెక్క అన్ని తింటది రా ఇది ఎది పడితే అది కొనుక్కుంటది. పెద్దహీరయిన్ లెక్క ఫీల్ అయితది. నువ్వు కొట్టడం కాదు కదా ఇంకో సారి నా ముందు వేస్ట్ ఫెల్లో అన్నవోచంపేస్తా
అని గట్టిగా భేదిరించింది. అది విని కాజల్ కి కళ్ళలోంచి ఏడుపు మొదలైంది. అది చూసి లేచి వెళ్లి దగ్గరకితీసుకుని,
శివ: దీపా ఎంటే ఇది మొత్తం గోల గోల చేసారు, అసలు ఇలా చెయ్యకున్నా బాగుండు.
ఇదంతా చూసి, తల పట్టుకుని వెనక్కి వాలి,
సాయి: ప్లీస్ రా ఐయిందేదో అయిపోయింది. కొంచెం ప్రశాంతంగా ఉండండి.
కాజల్ కళ్ళు తూడుస్తు,
శివ: ఏడవకు, నాదే తప్పు ఆ సరేనా కొట్టు నన్ను ఏం కాదు (దీపా ని చూస్తూ) ఏ మీరు పోండే, (కాజల్ తో) కొట్టునీ ఇష్టం, వాళ్ళకి అవసరం లేదు
కాజల్ చెయ్యి తీసుకుని చెంపల మీద కొట్టుకుంటున్నాడు, కాజల్ ఆపుతుంది.
శివ: కొట్టు తప్పంతా నాదే
కాజల్: ఊహు… లేదు నాదే
శివ: నాదే I’m sorry
సాయి: శివ చిన్న చిన్న తప్పులే పెద్ద సమస్యలు తీసుకొస్తాయి, చెపితే వినవు
అని చెప్పి జేబులోంచి ఒక సిగరెట్ తీసి వెలిగించాడు
అది చూసి కాజల్ కళ్ళు పెద్దగా అయ్యాయి, వెంటనే సాయి దగ్గరకి వెళ్లి నోట్లోంచి తీసి అవతల పడేసింది.
సాయి: అరె ఏంటి?
కాజల్: పోయి బయట కాల్చుకోపో, నా ఇంట్లో no cigar నో alcohol
దీపా నవ్వుతుంది
సాయి: అబ్బో దీపూ నీ ఫోన్ లో ఉన్న వీడియో శివ కి చూపించు
దీపా ఆ వీడియో చూపించింది, దాన్లో కాజల్ మందు తాగుతూ ఉంది
సాయి: అబద్దాలా మోసమా ఎన్ని అన్నావ్ మరి ఇదేంటి
చూపు తిప్పుకుని,
కాజల్: అది ఎదో అప్పట్లో కొంచెం దీపా birthday రోజు
దీపా: శివ నమ్మకు రా దాని acting చూసి
శివ కాజల్ ని చూసాడు, కాజల్ చిన్న పిల్లలా ఏమీ తెలేనట్టు మొహం పెట్టి,
కాజల్: లేదండి అది గ్రాఫిక్స్, నేను కాదు
అని సిగ్గుపడుతూ బెడ్రూం లోకి పరిగెత్తింది,
శివ: నన్ను కొడతావే ఆగు…
కాజల్ వెనక వెళ్ళాడు.
కాజల్ ని బెడ్ మీద పడేసి, అటూ ఇటూ కదలకుండా చేసి,
శివ: నేను కూడా ఇంత వరకు మందు వాసన కూడా చూడలేదు, నువ్వు తాగుతున్నావ
కాజల్: లేదండి నిజం రెండే సార్లు తాగాను, promise
కొరకళ్ళతో శివ కళ్ళలోకి మత్తుగా చూస్తుంది,
శివ: ఎందుకు తాగావే?
నడుము మీద చేయ్యేసాడు.
కాజల్: ఎదో మా క్లాస్మేట్స్ taste చెయ్యమంటే, అది చెయ్యలేదు నేను చేసాను.
శివ: అంతేనా
నడుము నొక్కాడు,
కాజల్: ఆహ్…. అంతే అండి
చెయ్యిని మీదకు తెస్తున్నాడు,
కాజల్: వద్దూ వాళ్ళు ఉన్నారు చూస్తారు
శివ: ఏం కాదు
మొహం కాజల్ ముందు పెట్టి, చెంపలు పెదాల తో రాస్తూ, కాజల్ ని టెంప్ట్ చేస్తున్నాడు.
కాజల్: వద్దూ ప్లీస్
శివ: తంతావే నన్ను, కొడతావే
కాజల్: వాళ్ళు పాయినాక మీ ఇష్టం ఏమైనా చేస్కోండి, స్వీట్ ఇస్తా
ఆ మాట తో శివ చిరునవ్వు నవ్వి,
శివ: బాగా నేర్చావే నన్ను కంట్రోల్ చెయ్యడం
అంటూ లేచి వెళ్ళిపోయాడు
శివ వెల్లేసిరికి సాయి లేచి, ” సరే మేము వెళ్తాం రా, నువ్వు కూడా వీలు చేసుకుని త్వరగా రా ” అన్నాడు.
శివ వెనకే కాజల్ వచ్చింది,
కాజల్: ఏంటి వెళ్తారా, వీళ్లేదు ఇవాళ మీరు ఇక్కడే ఉండాలి
సాయి: కుదరదు కాజల్, నీకు తెలుసు గా నాకు పనులు ఉంటాయి, ఇవాళ Sunday కాబట్టి రావడంకుదిరింది, రేపు ఒక్కరోజే ఊరిలో పనులు చూసుకుని పోవాలి
కాజల్: అయితే మాత్రం మధ్యాహ్నం వరకు ఉండి భోంచేసి వెళ్ళండి.
సాయి: ఇంకో 20 days లో ఎలాగో కలుస్తాం గా అర్థం చేసుకోండి, cards మేమే ఇస్తున్నాం అందరికీ.
శివ: మధ్యాహ్నం వెల్దురూ గానీ ఉండండి
అని దీపా వైపు చూసాడు,
దీపా: నాకేం తెలీదు, తనే busy
సాయి: శివ sorry రా, నాకు ఉండాలి మీతో ఇంకా చాలా మాట్లాడాలి అనిపిస్తుంది కానీ కుదరడం లేదు. పెళ్లికిఎలాగో ఉంటా అప్పుడు వస్త
శివ: రాకుంటే బాగోదు చెప్తున్నా.
సాయి: సరే వెల్లోస్తాం రా
దీపా: వెల్లోస్తాం కాజల్
అని కాజల్ ని hug చేసుకుని,
దీపా: శివ ని అలా కొట్టకు, చెప్పాను గా నువ్వంటే పిచ్చి వాడికి అందుకే నీ చేతిలో దెబ్బలు తింటున్నాడు
కాజల్: ఇంకో సారి ఆయన్ని వాడు అన్నావో పల్లు రాలకొడ్త
దీపా: ఓహో ok madam. (శివ వైపు చూసి) శివ సార్ bye సార్ మా పెళ్లికి రండి. మీ లాంటి గొప్పవాళ్ళు మాపెళ్ళికి రావడం మా అదృష్టం.
కాజల్ (నవ్వుతూ): ఆపవే ఎక్కువైంది.
సాయి: ok bye
అని బయటకి వెళ్తుంటే, కాజల్ చెయ్యి పట్టుకుని ఆపింది, సాయి దీపా ఎంటా అని చూస్తున్నారు.
సాయి పొడుగు కదా అందడు, అరికాళ్ళు పైకి ఎత్తి లేస్తూ, తల పట్టుకుని కిందకు వంచి, ఎడమ చెంప మీదముద్దు పెట్టింది.
దీపా షాక్ అయ్యింది. శివ చూసి నవ్వుతున్నాడు
సాయి: థాంక్స్ పారు….
కాజల్: కాజల్… పో
బయటకి నడుస్తూ, ఇంటి ముందు ఉన్న మొక్కలని చూస్తూ,
సాయి: మొక్కలు బాగానే పెంచుతున్నారు fight against global warming ఆ?
కాజల్: అలానే అనుకో, అసలు బయట పచ్చదనం కనిపిస్తే జనాలకు కళ్ళు మండుతున్నాయి.
దీపా: హహహ… కాజల్ నిజమే, చెట్టు కనిపిస్తే చాలు నారికేస్తున్నారు.
సాయి: వెల్లోస్తాం రా bye.
వాళ్ళు వెళ్ళిపోయాక, శివ నే అసహనంగా చూస్తూ,
కాజల్: నాకెందుకు చెప్పలేదు, ఈ ఇల్లు గురించి, ఆ గేట్, లాకింగ్, మెన్మ
శివ: అవసరం రాలేదు కదా
కాజల్: రాకపోతే నాకు చెప్పవా, అయినా రోజు ఆ స్కూటీ వేసుకుని మార్కెట్ కి పోతున్న ఇది ఉంది అనితెలిస్తేతీసుకుని వెల్లేదన్ని.
వినకొడనిది విన్నట్టు చూస్తూ,
శివ: ఏంటి దీని మీదనా, జనాలు భయపడతారు ఎదో సూపర్ హీరో మూవీ షూటింగ్ అనుకుని. అది కరాబ్అయ్యిందో అంతే నా కష్టం అంతా వృధా.
కాజల్ (నవ్వి) : సరేలే నువ్వు వెళ్ళు ఇవాళ మార్కెట్ కి.
శివ: పోతా లే…. ఇవాళ మా colleagues వస్తా అన్నారు
కాజల్: రానివ్వు
శివ: అంటే నీకు చెప్పలేదు అంటావేమో అని
కాజల్: ఇంకా చుస్తావే పో మార్కెట్ కి, తొమ్మిది అవుతుంది, వాళ్ళు ఏ టైమ్ కి వస్తారో