లవ్ పార్ట్ 1 511

చందు గాడి మొహం చూసాను వాడు ఏడ్చి మొహం ఉబ్బింది కానీ ఎవరో ఒకరు పనులు చెయ్యాలిగా వాడే మొత్తం చూసుకుంటున్నాడు.

నాన్న, చందు రజాక్ తొ కలిసి మసీద్ కి వెళ్లారు తరువాత కార్యక్రమం చూడటానికి, చందు ప్లేస్ ని భరత్ తీసుకుని పనులు చేస్తున్నాడు..

అమ్మ, ఫాతిమా అమ్మ తల దెగ్గర సాంబ్రాణి కడ్డీలు పెట్టింది, ఒకామె వచ్చి ఫాతిమా అమ్మ మీద గులాబీ రెక్కలు చల్లింది.

చందు వాళ్ళు అమ్మని తీసుకెళ్లాడానికి మసీద్ నుంచి అల్యూమినియం లాంటి పల్లకిని తీసుకొచ్చారు దాన్ని మొయ్యడానికి నాలుగు పొడుగు రాడ్లు ఉన్నాయి.

ఇంతలో ఒక సాయిబు వచ్చి స్మశానంలో మొదట గొయ్యి తీసేటప్పుడు వారసులు ఒక చెయ్యి వెయ్యాలి ఎవరైనా ఉంటే రండి అన్నాడు.

నేనే వెళ్ళాను అది ఒక ఆరు సెంట్లు అంటే మూడు వందల గజాలు ఉంటుందంతే.

మాములుగా ఇలాంటి వాటికీ మా దాంట్లో అయితే పక్క కులం వాళ్లయినా పక్క మతం వాళ్ళైనా ఇలా బాధ్యతలు తీసుకుంటే గోల గోల చేస్తారు ఇక్కడ కూడా అలా జరుగుతేందేమో అన్న భయంతోనే వెళ్లాను కానీ అలా జరగలేదు, అక్కడున్న ఊరి సాయిబులంతా నన్ను ఆహ్వానించారు.

మొదటగా నేను గడ్డపార అందుకుని చిన్న గుంత తవ్వాను ఆ తరువాత పని వాళ్ళు తవ్వడం మొదలు పెట్టారు.

ఇంటికి వచ్చాను అప్పటికే ఫాతిమా అమ్మని చాపలో చుట్టి ఆ పల్లకిలో పెట్టి రెడీగా ఉంచారు, నాన్న ఇక వెళదాం అని సైగ చేసాడు.

లోపలికి వెళ్లి సలీమాని బైటికి తీసుకొచ్చి అమ్మని చూపించాను, నుదిటి మీద ముద్దు పెట్టుకుని తన మీద పడిపోయింది, వంగి తన భుజాలు పట్టుకుని లేపాను, ఒక్కసారిగా నా కాళ్ళని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది.

తననే పట్టుకుని ఇద్దరం గట్టిగా ఏడ్చుకున్నాం అందరూ మమ్మల్ని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. నేను గట్టిగా ఏడవడం చూసి సలీమా తేరుకుని లోపలికి వెళ్లి ఒక లెటర్ తెచ్చి నాకిచ్చింది.

సలీమా : అమ్మ నీకు ఇది ఇవ్వమంది అని లెటర్ నా చేతికిచ్చింది.

తీసుకుని జోబులో పెట్టుకున్నాను.

నేను చందు భరత్ రజాక్ మాతొ పాటు ఇంకో నలుగురు అందరం కలిసి పల్లకిని ఎత్తి స్మశానానికి బైలుదేరాం ప్రతి పది సెకండ్లకి ఒకసారి భుజాలు మారుతున్నాయి కానీ నేను దిగలేదు అలా ట్రాన్స్ లో నా వైపు ముందు ఒక్కన్నే మోస్తున్నాను నా వెనకాల మాత్రం చేతులు మారుతూనే ఉన్నాయి.

స్మశానం చేరుకొని అమ్మని బైటికి తీసి గోతిలో పడుకోబెట్టామ్ అందరూ ముందు నన్నే మట్టిని వేయమన్నారు, మెత్తటి మట్టిని తీసుకుని చిన్నగా తన కాళ్ళ దెగ్గర పోసాను..

పారతో పూడ్చటం మొదలు పెట్టారు నేను అది చూడలేక పోయాను వెనక్కి వచ్చేసాను రోడ్ మీద సలీమా ఏడుస్తూ వచ్చింది పూజ రమ్య ఇద్దరు సలీమాని పట్టుకున్నారు, పూడ్చటం అయిన తరువాత, నాన్న సమాధి చుట్టు నీళ్లు పోసి చక్కగా అలికి అగర్భత్తి వెలిగించి తల దెగ్గర గుచ్చాడు.

నాకు ఎటు కదలబుద్ధి కాలేదు కానీ సలీమా కోసం లేచాను, సలీమాని నాకు ఆనించుకుని తన చుట్టు చేతులు వేసి ఎండలో ఇంటికి నడవటం మొదలు పెట్టాను.

దారిలో అన్ని ఫాతిమా అమ్మ జ్ఞాపకాలే నాకు సలీమాకి అన్నం తినిపించడం, ముగ్గురం ఆడుకోడం, మా ఇద్దరికీ ముద్దులు పెట్టడం అన్ని గుర్తొచ్చాయి.