లవ్ పార్ట్ 1 511

వచ్చిన ఫ్రెండ్స్ ఊరి వాళ్ళు అందరు ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు.. ఇంట్లో నేను అమ్మా నాన్న చందు రమ్య పూజ భరత్ సలీమా మాత్రమే మిగిలాము.

చీకటవడం తొ అమ్మ లైట్ వేసింది, ఆ రాత్రంతా అందరం అక్కడే ఉండిపోయాం, ఎవ్వరం మాట్లాడుకోలేదు ఏమి తినలేదు నేను బైటికి వచ్చి స్ట్రీట్ లైట్ దెగ్గర గచ్చు మీద కూర్చున్నాను.

లెటర్ గుర్తొచ్చి తీసి చదివాను.

ఫాతిమా అమ్మ : “విక్రమ్ నిన్ను నువ్వు చెయ్యలేని కష్టమైన సాయం అడుగుతానని అన్నాను ఇప్పుడు అడుగుతున్నాను, నేను ఎక్కువ రోజులు బతకనని నాకు తెలుసు అందుకే నువ్వు అంత గట్టిగా చెప్పినా నేను హాస్పిటల్ లో చూపించుకోడానికి ఒప్పుకోలేదు సలీమా కోసం కొన్ని డబ్బులు తన పేరు మీద బ్యాంకులో వేస్తూ వస్తున్నాను అవి తనకీ సరిపోవని నాకు తెలుసు.

అందుకే తన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, నీకే ఎందుకు అప్పగిస్తున్నానంటే నాకు సలీమా తరువాత నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు..

తన బాధ్యత తీస్కుంటావా?”

లెటర్ మొహానికి పెట్టుకున్నాను ఏడుపు తన్నుకొచ్చింది “నువ్వు చెప్పాలా అమ్మ నాకు, నేను కాక ఇంకెవరు బాధ్యత తీసుకుంటారు తన గురించి” అలా చాలా సేపు ఏడుస్తూ కూర్చున్నాను.

తరువాత ఇంట్లోకి వెళ్ళాను అమ్మా ఒళ్ళో సలీమా పడుకుని ఉంది ఇంకో పక్క రమ్య పూజ కూడా అలిసిపోయి పడుకున్నారు, చందు భరత్ ఏదో మాట్లాడుకుంటున్నారు, అమ్మ ఒళ్ళో సలీమాని చూస్తూ తనని ఇంటికి తీసుకెళదామని అమ్మకి చెపుదామని అనుకుంటున్నాను, కొంచెం సేపటికి ఎప్పుడు కళ్ళు మూతలు పడ్డాయో తెలీదు లేచేసరికి అమ్మ వస్తువులు అన్ని బ్యాగ్లో సర్దుతుంది.

ఆ అలికిడికి అందరికీ మెలుకువ వచ్చింది మూడు బాగులు సర్దేసి సలీమాని చూస్తూ పదా వెళదాం అన్నాను, అమ్మకి ఏం చెప్పకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు అమ్మని చూడగానే ఏడుపు వచ్చి ఇటు నుంచి నేను అటు నుంచి సలీమా ఇద్దరం కౌగిలించుకున్నాం అది చూసి రమ్య భరత్ చందు పూజ కూడా ఏడుస్తూ అమ్మని కౌగిలించుకున్నారు.

సలీమాని తీసుకుని అందరం మా ఇంటికి వెళ్ళాం, పూజ, రమ్య చందు భరత్ ఇంటికి వెళ్లారు స్నానం చేసి వస్తామని, కానీ నేనే రావద్దన్నాను.

ఒక రోజంతా సలీమాని ఒంటరిగా వదిలేసాను ఆ తరువాత రెండు రోజులు తనని అస్సలు విడిచిపెట్టలేదు, అమ్మ నాన్న నేను సలీమా అందరం కలిసి అన్నవరం వెళ్లి వచ్చాం.

పది రోజులకి సలీమానే నా దెగ్గరికి వచ్చి “విక్రమ్ కాలేజీ కి వెళదాం” అంది.

సంతోషించాను ఇద్దరం రెడీ అయ్యి మిగతా వాళ్ళకి కూడా ఇన్ఫోర్మ్ చేసాం… వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు.

బైటికి రాగానే అమ్మ నాకు కీస్ చూపించి నవ్వుతుంది, ముందు అర్ధం కాలా కానీ తరువాత కీ చైన్ చూసాక నాకు సంతోషం ఆగలేదు ఎందుకంటే అది నా డ్రీం బైక్ bmw… 4.5 lakh అది.. ఈ సిటీ లోనే ఎవ్వడి దెగ్గరా లేదు, ఎంత దూరమైనా ఆగకుండా వెళ్లిపోవచ్చు…

సలీమా నా ఆనందాన్ని చూసి తను కూడా నవ్వింది సలీమా నవ్వగానే వెంటనే వెళ్లి హాగ్ చేసుకుని అమ్మ చేతిలో బైక్ కీస్ తీసుకుని బైక్ దెగ్గరికి వెళ్లాను నాన్న బైక్ ని క్లాత్ పెట్టి అక్కడక్కడా తుడుస్తున్నాడు..

ముందు అమ్మని ఎక్కించుకుని స్టార్ట్ చేసాను సౌండ్ వినగానే ఆనందం రెట్టింపు అయ్యింది నాన్న దేవుడికి దణ్ణం పెట్టి రెండు చక్రాలా కింద నిమ్మకాయలు పెట్టాడు, ఒక రౌండ్ వేసి ఆ తరువాత నాన్న ఒకసారి డ్రైవ్ చేసాడు.

సలీమాని ఎక్కించుకుని నేరుగా కాలేజీకి వెళ్ళాను, పూజ చందు భరత్ రమ్య మమ్మల్ని చూసి వావ్ అన్నారు..

పూజ ని ఒక రౌండ్, రమ్య ని ఒక రౌండ్ తిప్పాను మొత్తం కాలేజీ అంతా నా బైక్ నే చూస్తున్నారు నాకు తెలుస్తుంది ఆ ఫీలింగ్ వేరే లెవెల్.

ఆ తరువాత చందు ఒక రౌండ్ వేసి వచ్చాడు, భరత్ కూడా ఒక రౌండ్ వేసి వచ్చి కీస్ నాకు అందిస్తూ..

భరత్ : నా జీవితం లో ఇంత కాస్టలీ బండి నడుపుతానని అనుకోలేదురా.. సూపర్.

చందు : అవును రా విక్రమ్ బలే ఉంది బండి.

భరత్ : ఎప్పుడైనా సంధ్యని తీసుకుని బైటికి వెళ్తాను నేను ముందే చెప్తున్నా నాకు ఇవ్వాల్సిందే బండి.

విక్రమ్ : సర్లేరా బాబు ఇక పదండి క్లాస్ కి.

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈