సోనియా : అటు చూడవే ఆ సలీమా బైక్ ఎక్కి ఎలా కులుకుతూ వస్తుందో, ఆ బండి నడుపుతున్న వాడేనే విక్రమ్. వీళ్లంతా బిల్డ్ అప్ ఇచ్చేది వాడికే.
మానస తల తిప్పి చూసింది, అదే మొదటి సారి మానస విక్రమ్ ని చూడటం, మెట్ల మీద కూర్చున్న తను విక్రమ్ ని చూడగానే లేచి నిల్చుంది.
సోనియా పల్లవి కూడా లేచి నిల్చున్నారు.
పల్లవి : ఏమైందే?
మానస నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు విక్రమ్ ని అలా చూస్తూనే ఉండిపోయింది, తన కళ్ళలో అప్పటివరకు ఉన్న టెక్కు తనం పొగరు బలుపు అన్ని విక్రమ్ ని చూసిన మొదటి క్షణం లోనే గాల్లో కలిసిపోయాయి.
సోనియా మానసని కదిపింది, మానస తెరుకొని.
మానస : పదండి క్లాస్ కి వెళదాం.
సోనియా : పదా..
వెళ్తూ వెళ్తూ మరొక్కసారి విక్రమ్ ని చూసి వెళ్ళిపోయింది.
అందరిని లోపలికి వెళ్ళమని చెప్పి నేను బైక్ పార్క్ చేసి వద్దామని వెళ్లి క్లాస్ కి వెళ్తుండగా ఒక చప్పుడు వినిపించింది అది చెంప మీద గట్టిగా చాచి పెట్టి కొడితే వచ్చే సౌండ్.
తల తిప్పి చూసాను ఎవరో రూప మేడంకి ప్రొపోజ్ చేసాడు జూనియర్ లెక్చరర్ అనుకుంటా అయినా కూడా మర్యాద లేకుండా పీకింది.
రూప మేడం మా కాలేజీ లోనే స్ట్రిక్ట్ తనని చూస్తే డీన్ కూడా సైలెంట్ అయిపోతాడు అట్లాంటిది తన గురించి తెలిసినా కూడా ప్రొపోజ్ చేశాడంటే అయన గట్స్ కి ఒప్పుకోవాల్సిందే..
క్లాస్ వైపు నడిచాను.
సలీమా పూజ వాళ్ళు లోపలికి వస్తుండగా..
సోనియా : ఏంటి సలీమా తెగ కులుకుతున్నావ్ బండి మీద మొన్నే మీ అమ్మ చనిపోయిందని విన్నాను ఆ బాధ నీలో ఏ మూల కనిపించడం లేదే.
మానస : సోనియా ఊరుకో, సలీమా నువ్వెళ్లు..
ఇదంతా చూసిన పూజ ఇక సహించలేక బైటికి వెళ్లి విక్రమ్ కి జరిగింది చెప్పి మొన్న ఇంక్ మేటర్ కూడా చెప్పేసింది.
విక్రమ్ కోపంగా క్లాస్ లోపలికి వస్తూ మానసని కోపంగా చూసాడు…
అవును కోపంగా చూసాను కానీ నేను చూసింది ఇంతకముందు మానసని కాదు, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ కళ్ళు అన్ని వేరే అయినా తన ముందుకి వెళ్ళాను.
పూజ నన్ను చూసి “అదిగో ఆ సోనియానే” అంది, గొంతు పట్టుకుని గాల్లోకి లేపాను, మానస ని చూసాను అయినా తన కళ్ళలో ఇంకేదో కనిపిస్తుంది ఒక పక్క రమ్య వదిలేయ్యమని బతిమిలాడుతుంది ఇంకో పక్క ఇది నా చేతిలో గిల గిల కొట్టుకుంటుంది.
మానస నా కళ్ళలోకే చూస్తుంది ఆ చూపు లో ఏ కమ్యూనికేషన్ లేదు నిషితంగా నన్నే చూస్తుంది.
ఎందుకో సోనియాని వదిలేసాను, గొంతు పట్టుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంది.
అంతలోనే రూప మేడం క్లాస్ లోకి వచ్చింది అందరం వెళ్లి మా ప్లేస్ లో కూర్చున్నాం.
సోనియా : వీడి సంగతి ఎలా చెప్పాలో నాకు తెలుసు, రేపు చెప్తా అని బైటికి వెళ్ళిపోయింది తన వెనకాలే పల్లవి కూడా వెళ్తూ మానసని చూసింది.
