ఆరు సంవత్సరాల క్రితం నాన్నకి మొదటి సారి పల్లెటూరికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆయన గవర్నమెంట్ డాక్టర్…. ఇంట్లో అమ్మ నాన్న నేనే మేము ముగ్గురమే మా ప్రపంచం…. ఎక్కడ ఉన్నా కలిసే ఉండాలని పొరపాటున కూడా విడిగా ఉండే ప్రయత్నం చెయ్యకూడదని మేము ముగ్గురం ముందే అనుకున్నాం…
అప్పుడే నేను మొదటి సారి పల్లెటూరు చూడటం, ఆ వాతావరణం నాకు చాలా నచ్చింది, అక్కడ ప్రైవేట్ స్కూల్ లేదు ఉన్నది ఒక్క గవర్నమెంట్ స్కూల్ మాత్రమే, అక్కడే జాయిన్ అయ్యాను…
ఎనిమిదవ తరగతి చూసుకుని వెళ్లి కూర్చున్నాను… నాతో కలిపి పన్నెండు మంది అబ్బాయిలు, పది మంది అమ్మాయిలు అందరిని పరిచయం చేసుకున్నాను అమ్మాయిలని కూడా కానీ కొంచెం సిగ్గు పడ్డాను…
లంచ్ బెల్ లో అబ్బాయిలంతా కలిసి బెంచ్ లని పక్కకి నెట్టేసి అందరూ కింద కూర్చున్నారు పెద్దగా రౌండ్ గా, ముచ్చట్లు పెట్టుకుంటూ రౌండ్ గా కూర్చున్నారు అందరు… నా ఇంతక ముందు స్కూల్ లో అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటే అదేదో పాపం చేసినట్టు లేకపోతే లవ్ అన్నట్టు వింతగా చూసే వారు కానీ ఇక్కడ ఒకరిని ఒకరు ఒరేయ్, ఒసేయ్ అనుకుంటూ అరుచుకుంటూ కరుచుకుంటూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళని చూస్తుంటే నాకు ఈ స్కూల్ మీద కొంచెం భయం తగ్గింది…. ఎవ్వరికి మొహమాటం లేదు ఒకరి కూరలు ఇంకొకరు మొహమాటం లేకుండా తీసుకుని వేసుకుంటున్నారు….. నాది కూడా తీసేసుకున్నారు….
మాటల్లో నా బర్తడే అడిగారు చెప్పాను “హో వచ్చే నెలే” అన్నాడు ఒక అబ్బాయి….అందరు ఒక్కసారిగా నన్ను చూసి తమ్ముడు అన్నారు నవ్వుకోలుగా చూస్తూ…. కొంచెం జంకాను…
అందులో రమ్య అనే అమ్మాయి చూడు విక్రమ్ మా ఊరిలో గవర్నమెంట్ స్కూల్ మేము పుట్టిన చాలా సంవత్సరాలకి వచ్చింది అందుకే మేము ఉండటానికి ఎనిమిదవ తరగతి లో ఉన్నాం కానీ అస్సలుకి ఐతే ఇంటర్ లో ఉండాల్సిన వాళ్ళము…. నీకంటే ఇక్కడున్న అందరమూ నాలుగు సంవత్సరాలు పెద్దవాళ్ళం… అని చెప్పి ముగించింది…
విక్రమ్ : ఓహ్ అలాగా అదే వచ్చినప్పటి నుంచి ఏదో తేడా కొడుతుంది ఇప్పుడు అన్నిటికి ఆన్సర్స్ దొరికేసినట్టే… అన్నాను.
ఇంతలో ఒక అమ్మాయి టిఫిన్ బాక్స్ కడగటానికి బైటికి వెళ్ళింది… వెంటనే
పూజ : రేయ్ రేపు సలీమా బర్తడే అందరికి గుర్తుంది గా….
చందు : గుర్తుంది… విక్రమ్ నువ్వు కుడా ఒక చెయ్యి వేస్తావా?
విక్రమ్ : మనిషికి ఎంతనుకుంటున్నారు..
చందు : ఇరవై రూపాయలు..
విక్రమ్ : అలాగే నేను వేస్తాను….
