లవ్ పార్ట్ 1 511

అలా ఆ రోజు అయిపోయాక ఇంటికి వచ్చి స్కూల్ గురించి చెప్పి బర్తడే గురించి చెప్పాను… అమ్మ నవ్వుతూ ఓకే అన్నట్టు నవ్వుతూ సైగ చేసి నాన్న జేబులోనుంచి వంద రూపాయలు నా చేతిలో పెట్టింది.

అమ్మా కానీ ఇరవై మాత్రమే అన్నాను… ఉంచు అన్నట్టు సైగ చేసింది బ్యాగ్ లో పెట్టుకున్నాను… అమ్మ సలీమ కి గిఫ్ట్ గా ఇవ్వమని పెన్ కూడా ఇచ్చింది…పొద్దున్న స్కూల్ కి వెళ్ళాక అందరు నీరశగా ఉన్నారు..

విక్రమ్ : ఏమైంది.

చందు : అందరం కలిపాము కానీ ఇంకా ఎనబై రూపాయలు కావాలి… ఇంకా సేపటిలో సలీమ వచ్చేస్తుంది ఎలాగొ తెలియడం లేదు

నేను బ్యాగ్ తీసాను..

చందు : నీ ఇరవై కలిపితేనే ఇంకా ఎనభై కావాలి విక్రమ్ అన్నాడు అసహనంగా.

బ్యాగ్ లోనుంచి వంద నోట్ తీసి చందు చేతిలో పెట్టాను…. అందరి కళ్ళలో ఒక్కసారిగా సంతోషం వెంటనే నన్ను కౌగిలించుకుని చందు భరత్ డబ్బులు తీసుకుని బాలూన్స్ ఒక పెద్ద కేక్, కాండిల్స్ కొనుక్కోచ్చారు…

అందరం కలిసి క్లాస్ ని బాలూన్స్ తో డెకొరేట్ చేసాము సలీమ కొత్త డ్రెస్ తో ఎంటర్ అయ్యింది…. అందరం ఒక్కసారిగా బర్తడే విషెస్ చెప్పాము….

సలీమా చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యింది…. ఆ తరువాత చాక్లేట్లు పంచింది….నా గురించి చెప్పినట్టున్నారు నా దెగ్గరికి వచ్చి థాంక్స్ విక్రమ్… అంది

వెంటనే బ్యాగ్ లో నుంచి పెన్ తీసి సలీమకి ఇచ్చి మా అమ్మ నీకోసం ఇచ్చిన గిఫ్ట్ అని తన చేతికి ఇచ్చాను…. అందరు పెన్ తీసుకుని చూసి వావ్ అన్నారు…

సలీమా : థాంక్స్ విక్రమ్ అమ్మకి చెప్పానని చెప్పు ఇంతకీ అమ్మ పేరేంటి?

విక్రమ్ : కావ్య.

ఒక్క నెలలోనే అందరం కలిసిపోయాం కలిసి చదువుకోడం, ఒకరి మీద ఒకరం జోకులు వేసుకోడం, సిటీ నుంచి వచ్చిన వాడిని కదా నాకు ఎ ఇబ్బంది రాకుండా చూసుకునే వాళ్ళు, నన్ను అందరు చిన్న పిల్లాడిలా చూసే వాళ్ళు… చిన్నోడినే అనుకోండి..

ఒక సారి సలీమా హోమ్ వర్క్ చెయ్యలేదు సోషల్ సర్ చాలా స్ట్రిక్ట్ అందుకే నా పేరు కొట్టేసి సలీమ అని రాసి సబ్మిట్ చేసేసాను…

సర్ అందరివీ కరెక్షన్ చేసి నా బుక్ లేకపోడం తో నన్ను లేపి కొట్టాడు… సలీమా ఆ విషయం తెలుసుకుని లంచ్ బ్రేక్ లో నన్ను హత్తుకుని “థాంక్స్ విక్రమ్” అంది.

ఏం జరిగిందో అందరికి చెప్పింది అందరు నన్ను కొంచెం అభిమానం గా చూసారు…..

ఇంటికి వెళ్లి అమ్మ తో చెప్పాను అమ్మ గర్వంగా చూసింది, నాకు ఆ చూపు నచ్చింది.

ఎల్లుండి నా బర్త్ డే అందరు కలిసి ఏదో ఒకటి ప్లాన్ చేస్తారనే ముందే చెప్పాను ఏమి చెయ్యొద్దు అని అలాగే అని నవ్వారు… వీళ్ళు వినరు అనుకున్నాను..