లవ్ పార్ట్ 1

వాళ్ళిద్దరికీ పార్టీ గురించి గుర్తు చేశాను ముగ్గురం కలిసి అన్ని రెడీ చేసాము, ఏడు అవుతుందనగా అందరు వచ్చారు…

అందరిని లోపలికి పిలిచి కేక్ కటింగ్ చేసాము ముందు అమ్మకి నాన్నకి తినిపించి మిగతాది అందరం తినేసాం.

అమ్మ నాన్న నేను సైగలు చేసుకోడం చూసి అందరు నన్ను బైటికి పిలిచారు….

పూజ : ఏంట్రా మీ అమ్మ మేము ఏం మాట్లాడినా మూగదానిలా సైగలు చేస్తుంది మౌన వ్రతమా? అని నవ్వింది…

విక్రమ్ : అవును మూగదే అమ్మ మాట్లాడలేదు…

అందరూ ఒక్క సరిగా సైలెంట్ అయ్యారు పూజ ని కోపంగా చూసారు…

పూజ బుగ్గ గిల్లి “పదండి లేట్ అవుతుంది తిందాము, మళ్ళీ బిర్యాని చల్లగా అయిపోతే బాగోదు ” అని పూజ భుజం మీద చేయి వేసి ముందుకు నడిచాను…

పూజ : సారీ రా…

విక్రమ్ : పర్లేదు పదా…అని లోపలికి తీసుకెళ్ళాను..

అలా టెన్త్ వరకు అయ్యింది, ఈలోగా ఒకళ్ళ గురించి ఒకళ్ళం పూర్తిగా తెలుసుకున్నాం, ఇంటర్ లో కూడా కావాలనే అందరం ఒకే సారి గవర్నమెంట్ కాలేజీ లో జాయిన్ అయ్యాము కొంతమంది అమ్మాయిలని చదవనియ్యము అన్నారు కానీ మా ఐకమత్యం చూసి మమ్మల్ని ఆపలేకపోయారు…

సెలవుల్లో ఆడుకోడాలు, కలిసి వంటకి పొలాల్లో పడి ఆడుకునేవాళ్ళము అమ్మాయిలంతా వంటలు ఓండుతుంటే మేము క్రికెట్ ఆడుకుని మధ్యనానికి వేప చెట్టు కింద కూర్చుని తినేవాళ్ళము…సాయంత్రం వరకు చెరువులో ఈతలు, గోలీల ఆటలు ఇలా ఒకటేమిటి 1990 పిల్లలు ఎంత ఎంజాయ్ చేసారో అంత ఎంజాయ్ చేసేవాళ్ళము.

అందరిని ఇంటర్ పాస్ చేయించి డిగ్రీ లో జాయిన్ చేయించడానికి నాకు రమ్యకి చందుకి చుక్కలు కనిపించాయి ఎలాగోలా పాస్ అయ్యాము.

మా గ్యాంగ్ లో ముగ్గురు అబ్బాయిలు చదువు అబ్బట్లేదాని ఇంకో ఇద్దరు ఇంట్లో కష్టంగా ఉందని మానేశారు…

అమ్మాయిల్లో ఇద్దరికీ పెళ్లి చేసేసారు ఇంకో ఇద్దరు ఇంటర్ వరకైతే మీ కోసం చదివించాము కానీ ఇక చదివించం అని కారాఖండిగా మొహం మీదే చెప్పేసారు….

అలా చివరికి పదముడు మందిమి మిగిలాము… అందులో మూడు జంటలు…

ఇవ్వాళ డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి రోజు ఆటే వెళ్తున్నాను.

…………………………………………………………..