ఏంటే ఈ కాలేజీ ఇదొక కాలేజీ యే నా చాపల మార్కెట్ లా ఉంది నీ వల్ల ఇక్కడ జాయిన్ కావాల్సి వస్తుంది… అని తన ఇద్దరు ఫ్రెండ్స్ మూడో వ్యక్తిని తిడుతున్నారు, ఆడి కార్ దిగుతూనే…
“నాకు మాత్రం సరదా నా, మా నాన్న ఏదో గెలిచిన ఆనందం లో న్యూస్ చానెల్స్ ముందు వాగేసాడు దాని వల్ల ఈ చెత్త లో పడాల్సి వచ్చింది… పదండి అలా వెళ్లి ఇలా జంప్ కొట్టి మాల్ కి వెళ్ళిపోదాం..
అని లోపలికి వెళ్లారు ముగ్గురు………
నేను లోపలికి వెళ్లి బైక్ పార్క్ చేసి మా వాళ్ళ కోసం వెతుక్కుంటూ ఉన్నాను, ఎదురుగానే మొహం వెళ్లడేసుకుని ఉన్నారు…
విక్రమ్ : ఏమైంది?
అందరు సైలెంట్ గా ఉన్నారు…
విక్రమ్ : పూజ ఏమైంది…
పూజ : అదిగో ఆ ముగ్గురు లోపలికి వెళ్తున్నారు చూడు అని చూపించింది….
ముగ్గురు జీన్స్ అండ్ టీ షర్ట్స్ వేసుకుని లోపలికి వెళ్తున్నారు…. వాళ్ళని చూసి “అయితే” అన్నాను.
పూజ : మమ్మల్ని అవమానించారు… సలీమా ని పట్టుకుని పల్లెటూరి మొద్దు అన్నారు…
మనమంతా పల్లెటూరి వాళ్ళమని డ్రెస్సింగ్ స్టైల్ మార్చమని అందరి ముందు చులకనగా మాట్లాడారు అందరూ మమ్మల్ని చూసి నవ్వారు… అంది.
విక్రమ్ : మరి మీరు ఏం చేస్తున్నారు మీకు మాటలు రావా?
పూజ ఏదో మాట్లాడుతుంటే రమ్య మధ్యలో వచ్చి…
రమ్య : విక్రమ్ ఇక్కడితో వదిలేయ్ తను పెద్ధింటి అమ్మాయి అందులోనూ ఈ ఊరి mla కూతురు, మనమే కొంచెం జాగ్రత్తగా ఉందాం….అని అందరికి సర్ది చెప్పింది.
లోపలికి వెళ్ళాము…. అందరు ఆడిటోరియం కి వెళ్తుండడం గమనించి మేము కూడా లోపలికి వెళ్లి కుర్చీలలో కూర్చున్నాం….
అందరూ వచ్చాక కాలేజీ డీన్ వచ్చి స్పీచ్ ఇచ్చి ఫ్రెషర్స్ కి స్వాగతం చెప్పి, ఇంకో వారం రోజుల్లో ఫ్రెషర్స్ పార్టీ ఉంటుంది అని అనౌన్స్ చేసాడు అందరం సంతోషించాం.
ఆ తరువాత డీన్ గారు….. “మన ఊరి mla అయిన శివరాం గారూ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తన కూతురిని మన కాలేజీ లో జాయిన్ చెయ్యడం మనకు గర్వ కారణం…. ప్లీజ్ జాయిన్ యువర్ హాండ్స్ అండ్ వెల్కమ్ మిస్ మానస”…. అన్నాడు.
తల ఎత్తి చూసాను… డయస్ మీదకి వెళ్ళింది అందరు చెప్పట్లు కొట్టారు , తన నడకలో కొవ్వు , వొళ్ళంతా పొగరే తన మొహం చూసాను అందం తో వచ్చిన టెక్కు అది….దానితో పాటు ఫిగర్ కస్సక్ లాగ ఉంది, ఇంకెందుకు ఆగుతుంది….
తన పేరు గుర్తుపెట్టుకున్నాను “మానస”…
రోజు కాలేజీ కి వెళ్లడం అందరితో కలిసి ఇంటికి రావడం నెలకి ఒకసారి అందరు రాకపోయినా మా పదముడు మంది కత్చితంగా కలిసి భోజనాలకి పొలం వైపు వెళ్లే వాళ్ళం.
ఈ వారం రోజుల్లోనే మా పదముడు మందిమి ఏడుగురిగా మారిపోయాం, మూడు జంటలు ఉన్నాయి అని చెప్పా కదా, కాలేజీకి వచ్చాక వాళ్ళకి ఫ్రీడమ్ బాగా దొరికింది ఇక మాకు దూరం అయిపోయారు ఇంటికి కూడా కలిసి రావట్లేదు కానీ అవసరం ఉంటే మాత్రం అందరం ఒకటై పోతాం.
