అలా నేను, రమ్య, పూజ, సలీమా, సంధ్య, భరత్ , చందు మాత్రమే మిగిలాం ఇంకో వారానికి భరత్ సంధ్య కూడా లవ్ బర్డ్స్ అయిపోయి మా గ్రూప్ నుంచి ఎస్కేప్ అయ్యారు, ఏంటి లవ్ చేసుకుంటే మాతో కలిసి ఉండకూడదా అనుకున్నాం మేము.
ఇక నేను, సలీమా, చందు, రమ్య, పూజ మాత్రమే మిగిలింది, మేము ఐదుగురం మాత్రం ఏం జరిగినా విడిపోకూడదనుకున్నాం.. అయినా అది కుదరదు ఫస్ట్ నుంచి మా ఐదుగురికి బాండింగ్ ఎక్కువ.. ఒక్క భరత్ గాడు లేడు అంతే.
కాలేజీకి వెళ్లి ప్లేసులు మార్చేసాం లాస్ట్ రెండు బెంచీలు చూసుకున్నాం నేను, చందు గాడు వెనక కూర్చుంటే పూజ రమ్య సలీమా ముందు కూర్చునే వాళ్ళు.
పూజ : సలీమా నువ్వు మధ్యలో కూర్చో రోజా ఉండి ఉండి రోజు రోజు కి నీరసంగా అయిపోతున్నావ్ అవసరమా ఇన్ని కష్టాలు..
చందు : అవును పూజ ఉమ్ము కూడా మింగకూడదట పొద్దున్న ఎప్పుడో నాలుగింటికి తింటే మళ్ళీ సాయంత్రం ఆరింటి వరకు ఏం తినరట.
పూజ : ఇవన్నీ నీకెలా తెలుసు?
చందు : మనూళ్ళో కట్ట మీద రజాక్ గాడు చెప్పాడు లే.
రమ్య : ఎందుకే సలీమా అన్ని కష్టాలు మాములుగా నమాజ్ చేసుకోవచ్చు కదా..
సలీమా : అలా కాదే చిన్నప్పటి నుంచి నాన్న లేకపోయినా అమ్మీ ఒక్కటే టైలరింగ్ చేస్తూ ఇల్లు నెట్టుకొస్తుంది కానీ ఈ మధ్య తనకీ ఆరోగ్యం బాగోటంలేదు, నాకోసం డబ్బులు దాచి పెట్టాలని తను హాస్పిటల్ లో కూడా చూపించుకోవట్లేదు ఆఖరికి విక్రమ్ కూడా చెప్పి చూసాడు కానీ తను ఎవ్వరి మాట వినట్లేదు, అందుకే తన కోసం ఇలా…
ఇక ఎవ్వరు మాట్లాడలేదు..
పూజ : అయినా ఈ సారి నీ బర్తడే రంజాన్ తరువాతే లే ఈ సారి భోజనాలు మనమే ఒండుకుందామా లేక బైట రెస్టారెంట్ కి వెళదామా
సలీమా : నేను ఏ పోసిషన్ లో ఉన్నాను నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావే?
పూజ : సారీ సారీ…
ఈలోగా క్లాస్సేస్ స్టార్ట్ అయ్యాయి… అందరం శ్రద్ధాగా వింటున్నాం నాకు అమ్మ నుంచి ఫోన్ వచ్చింది అందుకే అందరికీ చెప్పి ఇంటికి వచ్చేసా.
రమ్య : ఈ విక్రమ్ కావ్యమ్మ పిలిచిందని వెళ్ళిపోయాడు మనం కూడా వెళ్తే అయిపోయేది కదా వాడు లేకపోయేసరికి బోర్ కొడుతుంది.
పూజ : పదండి అలా కాంటీన్ కి వెళ్లొద్దాం.
రమ్య : వద్దు ఓ పక్క సలీమా ఒక్క పొద్దులు ఉంటుంటే నువ్వు కాంటీన్ అని దాన్ని ఊరిస్తావ్.
సలీమా : మీరు వెళ్లి రండి నేను కొంచెం సేపు పడుకుంటా.
చందు : పదండి ఏమైనా తిని వచ్చి మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం.
అందరూ కాంటీన్ కి వెళ్లారు సలీమా బెంచ్ మీద పడుకుని ఉంది అప్పుడే మానస తన ఇద్దరి ఫ్రెండ్స్ తొ లోపలికి వచ్చి సలీమా ఒక్కటే ఉండటం చూసి తన ఫ్రెండ్స్ మానస కి సైగ చేసారు.
ముగ్గురు వెళ్లి పెన్ లో రిఫీల్ తీసి సలీమా వేసుకున్న ఎల్లో చుడిధార్ వీపు మీద కొట్టారు.. ఏదో చల్లగా తగిలిన సలీమాకి వెనక్కి తిరిగేసరికి మానస ఇంక్ చల్లడం చూసింది.
