లవ్ పార్ట్ 1

వాళ్లంతా గట్టిగా నవ్వేసరికి అవమానం తట్టుకోలేక చున్నీ మొత్తం కప్పుకుని ఏడుస్తూ కూర్చుంది, సలీమా ఏడ్చేసరికి ముగ్గురు హై ఫై కొట్టుకుంటూ నవ్వుతున్నారు.

ఈ లోగా రమ్య వాళ్ళు లోపలికి వచ్చి సలీమా ఏడుస్తుండడం చూసి వెంటనే వెళ్లి జరిగింది తెలుసుకున్నారు.

చందు కోపం గా చూస్తుంటే పూజ ఏదో అనబోయింది వెంటనే రమ్య పూజ చెయ్యి పట్టుకుని ఆపుతూ..

రమ్య : మానస గారు మీరు చాలా పెద్ద వారు మీతో పోల్చుకుంటే మేము మీకు ఎందులోనూ సరిపోము మాతో మీకు అవసరమా, మీ అంత పెద్ద వాళ్ళతో పెట్టుకోలేక భయపడి మేము చిన్న వాళ్ళం ఏమి చెయ్యలేం అని మమ్మల్ని ఏడిపిస్తున్నారా?

సలీమాని మీరు ఏడిపించడం ఇది రెండో సారి ఇక్కడ విక్రమ్ లేడు కాబట్టి సరిపోయింది లేకపోయ్యుంటే ఎంత పెద్ద గొడవ అయ్యుండేదో తెలుసా?

మానస : ఏంటి అంత పోటుగాడా మీ విక్రమ్.

పూజ : అవును పోటుగాడే, సలీమా తొ కనీసం మాట్లాడలేదు జస్ట్ ఫాలో అయ్యారని తెలిసి ఇష్ట మొచ్చినట్టు కొట్టాడు, దాని వల్ల మూడు రోజులు జైల్లో కూడా ఉన్నాడు, ఇది జరిగింది రెండేళ్ల క్రితం ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ వాడికి అస్సలు భయం లేదు, ఈ విషయం కనుక వాడికి తెలిసిందనుకో….

మానస : ఆ ఏం చేస్తాడు చెప్పు.. చెప్పు..

రమ్య : ఏయ్ పూజ గమ్మునుండు… మానసగారు ప్లీజ్ మీరు వెళ్లిపోండి..

మానస వాళ్ళు అక్కడనుంచి వెళ్ళిపోయాక రమ్య తన చున్నీ కూడా తీసి సలీమా చుట్టు కప్పి.

రమ్య : ఈ విషయం విక్రమ్ గాడికి ఎవ్వరు చెప్పొద్దు అందరూ ఒట్టు వేయండి, అందరూ వేసినా పూజ మాత్రం ఇష్టం లేకుండానే ఒట్టు వేసింది.ఇక అక్కడనుంచి ఇంటికి వచ్చేసారు..

సోనియా : ఏంటే వాళ్ళని అలా వదిలేసావ్?

మానస : లేదే ఈ విక్రమ్ గాడి పేరు ఇంతకముందు కూడా విన్నాను సరిగ్గా వాడి మొహం కూడా ఎప్పుడు చూడలేదు, వీడ్ని వాళ్ళు తెగ మోసేస్తున్నారు వాడినే ఏడిపించాం అనుకో వీళ్ళు ఇక నోరు కూడా ఎత్తరు… ఇక పదండి సినిమాకి టైం అవుతుంది.

నేను తెల్లారి కూడా కాలేజీకి వెళ్ళలేదు ఎందుకంటే అమ్మని హాస్పిటల్ లో చూపించడానికి తీసుకెళ్లాను.

అమ్మ పుట్టుక తోనే మూగది తనకి ఇక మాటలు రావని తెలుసు కానీ నేనే మొండి పట్టు పట్టి ఇలా నెలకి ఒకసారి కొత్త హాస్పిటల్ చుట్టు తిప్పుతుంటాను ఎవరో ఒక డాక్టర్ ఏదో ఒక దారి చూపించకపోతారా అని.

నా మొండి తనం వల్ల నా మీద ప్రేమతొ అమ్మ కూడా బోర్ కొట్టకుండా నాతో తిరుగుతుంటుంది.. నాన్న మా ఇద్దరినీ పిచోళ్ళని చూసినట్టు చూస్తాడు మేము నవ్వుకుంటాం.

హాస్పిటల్ లో డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాక ఇద్దరం సినిమాకి వచ్చాము, అక్కడ మానస వాళ్ళు కనిపించారు నేను తననే చూడటం అమ్మ గమనించింది..

అమ్మ : ఏంటి మేటర్ అన్నట్టు సైగ చేసింది.

తన గురించి చెప్పాను, నేను చెప్పిందంతా విని నా మాటని కొట్టిపారేసింది..

విక్రమ్ : ఏంటి మా?

వెళ్ళతొ సైగ చేస్తూ “నువ్వు చెప్పిందంతా తప్పు ఆ అమ్మాయి చాలా మంచిది” అని

విక్రమ్ : జోక్ చెయ్యకు మా అన్నాను.

లేదు కాదు అని సైగ చేసింది సావాసాల వల్ల అలా ఉంది కానీ ఆ అమ్మాయి మంచిదే అంది.

నేను ఒక కన్ను పెద్దగా చేసి రెండు చేతులు కట్టుకుని చూసాను.. అమ్మ మళ్ళీ సైగ చేస్తుంటే ఆపి “అవునవును ఎందుకంటే నువ్వు గోల్డ్ మేడలిస్ట్ వి నీకు అన్ని తెలుసు హాపీనా?”

అమ్మ నా చెయ్యి మీద కొట్టి ” కావాలంటే ఇప్పుడు చూడు మిగతా ఇద్దరు వాళ్ళ చేతిలో ఉన్న టిన్ క్యాన్స్ ని విసిరేస్తారు కానీ ఆ అమ్మాయి డస్ట్ బిన్ దెగ్గరికి వెళ్లి వేస్తుంది చూడు” అని సైగ చేసింది.

ఇద్దరం తననే చూస్తున్నాం ఎవ్వరు గెలుస్తారు నేనా అమ్మ అని, అమ్మ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

కొంచెం సేపటికి అమ్మ చెప్పినట్టే వాళ్ళు ఇద్దరు డస్ట్ బిన్ లోకి విసిరేస్తే అవి కూడా అందులో పడలేదు లెండి కానీ మానస మాత్రం వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ డస్ట్ బిన్ లో వేసి సినిమా హాల్ లోపలికి వెళ్ళిపోయింది..