నేను అమ్మ వైపు నోరు తెరిచి చూసాను, అమ్మ కాలర్ ఎగరేసినట్టు పైట దెగ్గర చెయ్యి పెట్టి అలా అంది, నేను నా రెండు చేతులతో ఒంగి దణ్ణం పెట్టాను.
అమ్మ : మనం ఎంత మారినా మనిషి నేచర్ అనేది మనలోనే ఉంటుంది అది మారదు అని సైగ చేసింది.
“యూ అర్ గ్రేట్” అన్నట్టు సైగ చేసి చూపించాను అలా నవ్వుకుంటూ వెళ్లి సినిమా చూసి ఇంటికి వచ్చేసాం.
ఆ తరువాత ఒక రెండు రోజులు ఆగితే రంజాన్ యే కదా అని నేను ఇంట్లోనే అమ్మతొ గడిపాను..
రేపు రంజాన్ అనగా అందరూ మా ఇంటికి వచ్చారు..
అమ్మని చూడగానే సలీమా అమ్మని కౌగిలించుకుంది, అమ్మ కూడా బాగా ఉంటుంది సలీమాతొ… అందరూ అమ్మని పలకరించారు.
పూజ : ఏంట్రా అమ్మ కూచి కాలేజీ గురించి మర్చిపోయావా? అస్సలు రావట్లేదు.
విక్రమ్ : రేపు సెలవేగా ఎల్లుండి నుంచి వచ్చేస్తా లే
లేట్ అవుతుందని అక్కడ ఫాతిమా అమ్మ ఇంట్లో ఒక్కటే ఉంటుందని సలీమాని పంపించేసాను, అందరితో సరదాగ గడిపేసి మా ఇంట్లోనే అన్నం తినేసి వెళ్లిపోయారు.
పొద్దున్నే లేచాను ఇవ్వాళ రంజాన్ పొద్దు పొద్దునే సలీమా ఇంటికి వెళ్లడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది.
త్వరగా రెడీ అయ్యి అమ్మకి చెప్పి సలీమా ఇంటికి బైలుదేరాను అప్పటికే తొమ్మిది దాటింది ఇంటి లోపలికి వెళ్లేసరికి ఆల్రెడీ నమాజ్ స్టార్ట్ అయిపోయింది.. నేను వెళ్లి చైర్ లో కూర్చున్నాను.
సలీమా ఫాతిమా అమ్మ ఇద్దరు నమాజ్ చేసుకుని బైటికి వచ్చారు నన్ను చూడగానే ఫాతిమా అమ్మ రంజాన్ విషెస్ చెప్పి మూడు సార్లు అటు ఇటు కౌగిలించుకుంది ఆ తరువాత సలీమా కూడా..
మా ఇద్దరికీ సేమ్యా తెచ్చి ఇచ్చింది నేను లోట్టలేసుకుంటూ తింటున్నా ఫాతిమా అమ్మ నన్నే చూస్తుంది..
విక్రమ్ : ఏంటమ్మా ఏమైంది…
ఫాతిమా : బేటి విక్రమ్ కి ఇంకొంచెం సేమ్యా వేసుకురా..
సలీమా లోపలికి వెళ్ళగానే ఫాతిమా అమ్మ నా చేతులు పట్టుకుని.
ఫాతిమా : విక్రమ్ బేటా నిన్ను ఈ వయసులో అడగలేనిది, నీకు కష్టమైంది ఒక సహాయం అడుగుతాను చేస్తావా?
విక్రమ్ : తన రెండు చేతులు పట్టుకుని చెప్పమ్మా నువ్వు అడిగింది ఏదైనా సరే దాన్ని ప్రయత్నించడం కాదు కచ్చితంగా చేస్తాను.. అది ఎంత కష్టమైనా…
ఫాతిమా : ఇప్పుడు కాదు అడగాల్సిన టైం లో కచ్చితంగా అడుగుతాను..
ఈలోగా సలీమా వచ్చేసరికి మాములుగా కూర్చున్నాం..
మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి సలీమా నేను ఇద్దరం ఫాతిమా అమ్మ చేతుల్తో బిర్యానీ తినిపించుకుని జాగ్రత్త చెప్పి ఇంటికి బైల్దేరాను…
