ప్రేమ కథలు – Part 1 185

తన అన్న వాళ్ల అస్తి మొత్తం దానం చేసి తనని బిచ్చగాడు గా మార్చాడు అని ఫీల్ అయిన కార్తీక్ తమ్ముడు ఆకాశ్ మెల్లగ అమెరికా ఫాస్ట్ కల్చర్ కీ అలవాటు పడ్డాడు డ్రగ్స్ కీ బానిస అయ్యాడు, కార్తీక్ కాఫీ షాప్ నీ ఒక multinational కంపెనీ తో collaboration చేసి తన బిజినెస్ డబల్ చేసుకున్నాడు ఆ కంపెనీ కీ చీఫ్ మేనేజర్ గా పని చేస్తు ఉండేది కీర్తి అలా తనని చూడడానికి రోజు స్టాక్ దింపడానికి వెళ్లి రోజు దూరం నుంచి మౌనం గా ప్రేమించేవాడు, ఇలా సాఫీగా సరిపోతున్న జీవితం లో ఆకాశ్ ఒక రోజు డ్రగ్స్ కోసం కాఫీ షాప్ లో డబ్బులు కొట్టేయడం చూశాడు కార్తీక్ వాడిని కొట్టి rehabilitation సెంటర్ లో చేర్పించాడు అక్కడే ఆకాశ్ కీ వాలెంటినో తమ్ముడు ఏడ్వర్డ్ పరిచయం అయ్యాడు ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు ఏడ్వర్డ్ ఆకాశ్ నీ తమ గ్యాంగ్ లో చేర్పించాడు అలా డ్రగ్స్ కోసం డబ్బు కోసం ఆకాశ్ మర్డర్ చేయడం, దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు.

ఒక రోజు ఒక బ్యాంక్ లో దొంగతనం ప్లాన్ చేసారు అప్పుడే ఆ బ్యాంక్ లో పని ఉండి కీర్తి ఆ బ్యాంక్ కీ వెళ్లింది తనని ఫాలో అవుతు కార్తీక్ కూడా అదే బ్యాంక్ కీ వెళ్లాడు అప్పుడు ఆకాశ్, ఏడ్వర్డ్ తో కలిసి బ్యాంక్ పైన దాడి చేశారు అప్పుడు కీర్తి మీద గన్ పెట్టి అందరిని బెదిరించాడు ఆకాశ్ దాంతో అక్కడ ఉన్నది ఆకాశ్ అని తెలియక కార్తీక్ మొహం కర్చీఫ్ తో కవర్ చేసి వెళ్లి అందరినీ కొట్టాడు అప్పుడు ఆకాశ్ పారిపోతున్న ఆకాశ్ నీ పట్టుకున్నాడు దాంతో ఏడ్వర్డ్ తన గన్ తో ఆకాశ్ నీ కాల్చి అక్కడి నుంచి పారిపోయాడు, ఆ తరువాత తన చేతిలో ఉన్నది చనిపోయినది తన తమ్ముడు అని తెలుసుకున్న కార్తీక్ బాధ పడ్డాడు ఆ తర్వాత assassin గా మారి వాలెంటినో గ్యాంగ్ నీ మిగిలిన గ్యాంగ్ లని చంపుతు వచ్చాడు.

కార్తీక్ తిరిగి కాఫీ షాప్ కీ వెళ్లాక కీర్తి urgent గా బీచ్ కీ వెళ్లాలి అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్లారు అప్పుడు రఘు బీచ్ లో కీర్తి కోసం ఎదురు చూస్తూ కీర్తి రాగానే తన ముందు ఒక కాలి పై కూర్చుని ఒక రింగ్ తీసి చూపిస్తూ “I love you will you marry me” అని అడిగాడు అది విని కీర్తి, కార్తీక్ ఇద్దరు షాక్ అయ్యారు అప్పుడే వచ్చిన సెక్యూరిటీ అధికారి లు కార్తీక్ నీ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లారు.

కార్తీక్ నీ సెక్యూరిటీ అధికారి లు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లుతుంటే కీర్తి ఆపడానికి చూసింది కానీ రఘు కీర్తి నీ తీసుకొని తన ఫ్లాట్ కీ వెళ్లాడు.

వాలెంటినో మీద కంప్లయింట్ ఇచ్చిన రోజు స్టేషన్ లో కీర్తి నీ చూసి అప్పుడే ప్రేమ లో పడ్డాడు రఘు వాళ్ల అమ్మ ఒక ఇండియన్ అమ్మాయి నే పెళ్లి చేసుకోవాలని షరతు పెట్టింది దాంతో ఒక మంచి ఇండియన్ అమ్మాయి కోసం వెతకడం మొదలు పెట్టాడు అప్పుడు దొరికింది కీర్తి రఘు కీ, ఎప్పటి నుంచో రఘు కీ FBI లో చేరాలని ఆశ పడుతున్నాడు ఇప్పుడు వాలెంటినో నీ కనుక కోర్టు లో శిక్ష పడేలా చేస్తే తనకు రూట్ క్లియర్ అవుతుంది అందుకు ముందు కీర్తి నీ జాగ్రత్తగా ఉంచాలి అప్పుడే కార్తీక్ నీ చికాగో సెక్యూరిటీ అధికారి వాలెంటినో గ్యాంగ్ తో కీర్తి నీ చంపే కాంట్రాక్ట్ తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు అప్పుడే రఘు కీ ఒక ఆలోచన వచ్చింది వాలెంటినో తో పోరాడాలి అంటే కార్తీక్ లాంటి వాడి అవసరం ఉంది అని అందుకే వాలెంటినో కన్న ఎక్కువ డబ్బు ఇస్తా అని చెప్పాడు.

కీర్తి నీ కాపాడటం తో పాటు కీర్తి ప్రేమ గెల్చుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు కానీ కీర్తి కార్తీక్ నీ ఇష్ట పడుతుంది అని తెలుసుకొని కార్తీక్ తో సెటిల్మెంట్ కోసం చూశాడు అప్పుడే కార్తీక్ ఒక ఐడియా ఇచ్చాడు కీర్తి కీ తన ప్రేమ గురించి చెప్పి అదే టైమ్ లో నేను పెద్ద క్రిమినల్ అని చెప్పి అరెస్ట్ చెయ్యి దెబ్బ కీ పాప నీకు పడిపోతుంది అని చెప్పాడు అలా ఏడ్వర్డ్ నీ చంపిన రోజు సాయంత్రం బీచ్ కీ పిలిచి కీర్తి కీ తన ప్రేమ గురించి చెప్పి కార్తీక్ నీ అరెస్ట్ చేయడం మొత్తం కార్తీక్ ప్లాన్ దాంతో కార్తీక్ డబల్ పేమెంట్ అడిగాడు దానికి ఒప్పుకున్నాడు రఘు అలా కీర్తి కీ తన ప్రేమ గురించి చెప్పి తనని తీసుకొని రేపు ఉదయం చికాగో కీ వెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నాడు రఘు, తన తమ్ముడిని చంపితే ఆవేశములో తప్పు చేస్తాడు తేలికగా పెట్టుకోవచ్చు అని అనుకున్నాడు రఘు.

జైలులో ఉన్న కార్తీక్ అక్కడ ఒక సెక్యూరిటీ అధికారి కీ డబ్బు ఇచ్చి ఒక ఫోన్ ఇప్పించుకున్నాడు దాంతో వాలెంటినో కార్తీక్ కోసం వెతుకుతుంటే కీర్తి రేపు ఉదయం చికాగో వెళ్లిపోతుంది అన్న విషయం చెప్పాడు దాంతో వాలెంటినో రఘు, కీర్తి కీ స్కెచ్ వేశాడు ఆ తర్వాత ఉదయం రఘు, కీర్తి ఎయిర్ పోర్ట్ కీ వెళ్లుతుంటే వాలెంటినో వాళ్ల పైన ఎటాక్ చేశాడు దాని తర్వాత వాళ్ళని ఒక బీచ్ హౌస్ కీ తీసుకొని వెళ్లాడు ఇద్దరిని డైనింగ్ టేబుల్ కీ రెండు వైపులా కూర్చో బెట్టి ఒక granade పిన్ పీకి దాని టేబుల్ మధ్యలో తిప్పడం మొదలు పెట్టాడు వాలెంటినో.

“ఇది మీకు బంపర్ ఆఫర్ గెలిచిన వాళ్లు నా చేతిలో చస్తారు నా చేతిలో చావు చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి ఆ granade తో చావాలి అని కోరుకొండి దానీ ఎవరూ అయితే 5 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టుకొని dismantle చేస్తారో వాళ్లు గెల్లుస్తారు” అని చెప్పాడు వెంటనే రఘు ఆ granade నీ పట్టుకోవడం కోసం చెయ్యి ముందు పెట్టాడు కీర్తి కూడా అందుకు ఫైట్ చేస్తుంది ఇంతలో ఒక కార్ గోడ బద్దలు కొట్టి లోపలికి వచ్చింది దాంతో ఆ granade కిచెన్ లో నుంచి బయటకు వెళ్లి హాల్ లో పేలింది ఆ కార్ నుంచి కార్తీక్ కిందకు దిగి “may i join the game” అని అడిగాడు.

కార్తీక్ నీ చూడగానే మొత్తం వాలెంటినో మనుషులు గన్ లు బయటికి తీశారు కానీ వాలెంటినో “వాడిని నీ గన్ తో కాదు కత్తి తో గాట్లు పెట్టి మెల్ల మెల్లగా చంపాలి” అని అన్నాడు దాంతో అందరూ కత్తులు తీశారు ఈ గ్యాప్ లో కార్తీక్ కీర్తి తో “కీర్తి నువ్వు అంటే నాకూ చాలా ఇష్టం నేను చికాగో వచ్చిన రోజు నుంచి నిన్ను లవ్ చేస్తున్న కానీ అప్పుడు నా పరిస్థితులు వేరు ఇప్పుడు నా పరిస్థితి వేరు కాబట్టి నువ్వు రఘు నీ పెళ్ళి చేసుకో ” అని చెప్పి ఇద్దరిని వెళ్లిపోమనీ చెప్పి రఘు కీ కార్ తాళం ఇచ్చి పంపి చేసాడు.

1 Comment

  1. Nice story

Comments are closed.