ప్రేమ కథలు – Part 1 185

కార్తీక్ : హలో ఆఫీసర్

రఘు : ఎవరూ

కార్తీక్ : నువ్వు వెతుకుతున్న కిల్లర్ నీ

రఘు : రేయి ఎంత ధైర్యం ఉంటే నాకే ఫోన్ చేస్తావు

కార్తీక్ : నీ సాక్షి నీ షిప్ cargo ఫ్యాక్టరీ లో మేనేజర్ గా పెట్టించావు కదా పాపం పిల్ల ఈ రోజు చస్తుంది

రఘు : దమ్ము ఉంటే ముందుకు వచ్చి మాట్లాడు

కార్తీక్ : నేను నువ్వు ఉన్న కాఫీ షాప్ బయటే ఉన్న

అది వినగానే రఘు ఆవేశం గా బయటకు వచ్చాడు అప్పుడు కార్తీక్ తన గన్ తో కీర్తి వైపు గురి పెట్టి కాల్చాడు కాకపోతే అది కాఫీ షాప్ అద్దం కీ divert అయ్యి కీర్తి భయపడింది, ఆ తర్వాత కార్తీక్ తిరిగి ఫ్లాట్ కీ వెళ్లిపోయాడు.

చికాగో లో వాలెంటినో రఘు టీం లో ఉన్న ఒక 10 మంది నీ వాళ్ల ఫ్యామిలీ తో సహా కిడ్నాప్ చేసి బీచ్ లో పడేసి కొట్టాడు అయినా ఎవరూ నోరు తెరవలేదు దాంతో ఒక ఆఫీసర్ కొడుకు చిన్న పిల్లోడిని తీసుకొని వెళ్లి సముద్రంలో పడేశాడు దాంతో ఆ ఆఫీసర్ భయం లో కీర్తి మేరీ ల్యాండ్ లో ఉంది అని చెప్పేసాడు ఆ తర్వాత అందరి మీద పెట్రోల్ పోసి తన సిగరెట్ వెలిగించి అదే లైటర్ నీ వాళ్ల మీదకు విసిరేసాడు ఆ 10 మంది వాళ్ల ఫ్యామిలీ తో సహా బూడిద అయ్యి సముద్రంలో కలిసి పోయారు.

తన మీద జరిగిన ఎటాక్ కీ భయపడిన కీర్తి ఏడుస్తు ఫ్లాట్ కీ వెళ్లింది ఆ తరువాత తన ఫోన్ కీ వాళ్ల అమ్మ దెగ్గర నుంచి ఫోన్ వచ్చింది గత 12 సంవత్సరాలుగా వాళ్ల అమ్మ తో కీర్తి ఎప్పుడు సరిగా మాట్లాడ లేదు అలాంటిది సింగిల్ రింగ్ కే ఫోన్ ఎత్తింది “అమ్మ నేను వచ్చేస్తా నేను ఇంటికి వచ్చేస్తా సారీ అమ్మ నేను ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టా ఇంక నుంచి నువ్వు ఏమీ చెప్తే అదే చేస్తా” అంటూ ఏడ్వడం మొదలు పెట్టింది, దానికి కీర్తి వాళ్ల అమ్మ “ఒసేయ్ ఎందుకు భయపడుతున్నావు మీ నాన్న చనిపోతే నేను ఒక్కదాని నిన్ను పెంచి పెద్ద చేశా అప్పుడు అంతా ధైర్యంగా నేను ఉండడానికి కారణం నువ్వు నీ తెలివి, నీ మొండితనం తో నువ్వు ఇక్కడి దాకా వచ్చావు అలాంటిది నువ్వే భయపడితే, ఎప్పటికైనా నా కూతురు మొండిదే అదే బలం దాని వదులుకోకుడదు నీ సమస్య నీ దాటే నువ్వు ఇండియా తిరిగి వస్తూన్నావు ” అని చెప్పింది కీర్తి వాళ్ల అమ్మ,, దాంతో కీర్తి లో కొంచెం ఓదార్పు, ధైర్యం మొదలు అయ్యాయి అప్పుడే కార్తీక్ వచ్చాడు వెంటనే కీర్తి అతనితో బీచ్ కీ వెళ్లదామా అని అడిగింది దానికి కార్తీక్ కూడా సరే అని ఇద్దరు బీచ్ కీ వెళ్లారు.

అక్కడ లైట్ హౌస్ చూసిన కీర్తి తో కలిసి లైట్ హౌస్ పై దాకా ఎక్కింది ఆ తర్వాత ఇద్దరు అస్తమిస్తున్న సూర్యుణ్ని చూస్తూ ఉన్నారు అలా ఉన్న టైమ్ లో కీర్తి లో ఏదో తెలియని ఆనందం తన బాధను పంచుకోవడానికి ఒక మనిషి దొరికినట్టు అనిపించింది ఏమో తన గురించి మొత్తం కార్తీక్ కీ చెప్పేసింది, ఆ తర్వాత తన చిన్నతనం లో ప్రతి ఒక్కరూ తన తల్లి ఒంటరితనం నీ ఆసరాగా తీసుకుని తనని ఇబ్బంది పెట్టడం చూసిన కీర్తి మగవాలు అంటే నే చిరాకు పెంచుకుంది కానీ మొదటి సారి ఒక మగ తోడు కావాలి అనుకుంది, తరువాత కార్తీక్ గురించి అడిగింది “నాది ఒక ఒంటరి జీవితం అమ్మ నాన్న కోట్లు సంపాదించి చనిపోయారు, వాళ్ల ఆస్తి కీ వారసుడిని చేశారు కానీ ప్రేమ పంచకుండా చనిపోయారు ఆ తర్వాత తనకు కొంచెం వయసు రాగానే తన అస్తి మొత్తం కొని స్వచ్చంద సమస్తలకు రాసి తను తన కోసం ఒక కొట్టి రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేసి ఉంచాడు దాని నుంచి వచ్చే ఇంటరెస్ట్ తో ఇలా వరల్డ్ టూర్ ప్లాన్ చేస్తున్నా” అని చెప్పాడు అప్పుడు కీర్తి తెలియకుండా నే కార్తీక్ కీ ముద్దు పెట్టింది ఆ తర్వాత ఇద్దరూ కింద ఉన్న మ్యూజియం లోకి వెళ్లారు కార్తీక్ తన పర్స్ పైన మరిచిపోయాడు అని పైకి వెళ్లాడు కీర్తి మ్యూజియం చూస్తూ ఉంటే వెనుక నుంచి “excuse me miss” అని పిలిస్తే వెనకు తిరిగింది తన ఎదురుగా వాలెంటినో ఉన్నాడు.

వాలెంటినో నీ చూడగానే కీర్తి లో ఏదో భయం మళ్లీ మొదలు అయ్యింది, కానీ వాలెంటినో కీ కీర్తి ఎలా ఉంటుందో తెలియదు అందుకే తనకు ఫోన్ ఇచ్చి తనకు మారియా కీ ఫోటో తీయమని చెప్పాడు కాకపోతే కీర్తి తనకు అంతగ ఫోటో తీయడం రాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది వాలెంటినో కీర్తి నీ చూసి కొంచెం డౌట్ పడ్డాడు ఆ తర్వాత కార్తీక్ కూడా కీర్తి తో కలిసి బయలుదేరాడు అప్పుడే రఘు, కీర్తి కీ ఫోన్ చేసాడు వాలెంటినో వచ్చాడు అన్న విషయం చెప్పడానికి దాంతో కీర్తి నీ తొందరగా కలవాలి అని చెప్పడంతో కీర్తి, కార్తీక్ తో కలిసి dock yard కీ వెళ్లింది అక్కడ ఉన్న ఒక బోట్ హోస్ లో రఘు ఉంటున్నాడు, కీర్తి లోపలికి వెళ్లి రఘు తో మాట్లాడుతూ ఉంది

1 Comment

  1. Nice story

Comments are closed.