లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 7 88

కొన్ని నిమిషాల తరువాత:

సూపర్ మార్కెట్ లో ……

“సంజు….. ఎం తీసుకోవాలి ??”

“ముందుగా ఒక మిల్క్ ప్యాకెట్……..ఎగ్స్….. ”

తను “ఓకే…… ఎన్ని ఎగ్స్ కావలి ??”

నేను “ఇంట్లో ఎగ్స్ ఉన్నాయా ??”

“రెండో మూడో ఉన్నాయి…..అనుకుంట…. ”

నేను “సరే ఒక ప్యాక్ తీసుకుందాం……” అన్నాను.

కావాల్సిన ఒక్కొక ఐటెం తీసుకుంటూ ట్రాలీని ముందుకు తోస్తు వెళ్తున్నాం.

“సంజు……. ఎం సినిమా చూద్దాం సాయంత్రం ??”

“ఏమో నీ ఇష్టం…….”

“హారర్ సినిమా చూద్దాం….. ఏదైనా….. ” అంటూ నా వైపు మోహంలో సిగ్గు దాచుకుంటూ క్యూట్ గా అంది. ఇద్దరి కళ్ళు ఒకరి చూపులో ఒకరివి లాక్ అయ్యాయి.

నేను కూడా మోహంలో నవ్వు దాచుకుంటూ “సరే…… ” అన్నాను.

ఇద్దరం కొంచెం ముందుకు సాగాము ట్రాలీ ముందుకి అంటూ.

ఈ లోగ నేను పిల్లల డైపర్లు వైపు చూపిస్తూ “స్వీటీ….. అవి ఒక ప్యాకెట్ తీసుకో…..” అన్నాను.

“అవా ??” అంటూ ఆశ్చర్యంగా అడిగింది.

నేను “అవును…… నీకు భయం కదా ….. నీ కోసమే ……” అన్నాను.

చిరు కోపంతో చూస్తూ నా చేయి పై కొట్టింది.

నేను “అబ్బా….. ఏంటే అంత గట్టిగ కొడుతున్నావ్…… ??” అన్నాను.

నా వైపు అలాగే చిరుకోపంతో చూస్తుంది.

నేను కొంచెం సీరియస్ గా “ఏంటి ఫీల్ అయ్యావా ??” అన్నాను.

తను “అవును…..” అంది.

“హే ….. ఐ అం వెరీ సారీ…… ” అని సీరియస్ గా అంటూ “ఫీల్ అవ్వకు…. వెళ్తూ వెళ్తూ….. నాలుగు లాలిపాపులు కొనిస్తాను లే ” అని కొంచెం నవ్వుతు అన్నాను.

అలాగే సీరియస్ గా చూస్తు నా టోన్ మారేసరికి తను కూడా నవ్వు దాచుకోలేక నవ్వేసి మళ్ళి నా చేయి పై కొట్టింది.

ఇద్దరం మూసి మూసి నవ్వులు నవ్వుకొని కౌంటర్ లో బిల్ వేయించుకొని బైక్ ఎక్కాము.

ఇంటికి వెళ్లే రూట్ కాకుండా నేను వేరే వైపు బైక్ తిప్పాను.

స్వీటీ “సంజు….. ఇటు కదా ఇల్లు……” అంది.

నేను “ఒక చిన్న పనుంది……” అన్నాను.

“ఓకే” అంది.

నేను కొరియర్ షాప్ దగ్గర బైక్ ఆపి “పద ……” అన్నాను.

ఇద్దరం లోపలి వెళ్ళాము.

నేను కొరియర్ నెంబర్ అక్కడ డెస్క్ లో ఇచ్చి “3 డేస్ బ్యాక్ వచ్చిందన్నారు……అది కాలేచ్ట్ చేసుకోవటానికి వచ్చాను” అని అడిగాను.

నా ID కార్డు అడిగారు. అది చూపించగానే నాకు ఒక ప్యాకెట్ ఇచ్చారు.

ఇద్దరం బయటకు వచ్చాము.

స్వీటీ “సంజు….. ఏంటది ??” అన్ని అడిగింది.

“గిఫ్ట్……” అన్నాను.

నా వైపు అలాగే చూసింది.

నేను “నిజంగా…..గిఫ్ట్….. ” అన్నాను.

“….. ఎం గిఫ్ట్ ??” అని అడిగింది.

నేను “ఇంటికెళ్ళాక చెబుతాను…..” అన్నాను.

“సరే”

“దారిలో….. ఇంకోటి కూడా తీసుకోవాలి ……” అన్నాను.

“ఇంకో పార్సెల్ ఆ ??”

“అవును…… ” అని కొంచెం నవ్వుతు అన్నాను.

స్వీటీ “ఎం పార్సెల్ అది ??”

నేను “shhhhh….. ” అన్నాను.

“shhhhh …… కాదు….. ” అంది.

“ఇంట్లో చూపిస్తా……”