“ఎప్పుడు …… ”
“ఎలా చెప్తా ?? అది కూడా సీక్రెట్ ……. ”
నా వైపు సిల్లి గా చూసింది.
“పద వెళ్ళి కేక్ చేద్దాం ……. ”
“టాపిక్ డైవర్ట్ చేయకు …… ”
“సరే నీ ఇష్టం ……… ” అన్నాను.
నన్ను అలాగే చిరు కోపంతో చూసింది.
“నువ్వు కావాలనే చేస్తున్నావ్ ……… ”
“ఏంటి ??”
“మరి గిఫ్ట్ సీక్రెట్ అయితే నన్ను ఎందుకు బైక్ లో తీసుకొని వెళ్ళావ్ ?? నువ్వే వెళ్లి సీక్రెట్ గా గిఫ్ట్ తెచ్చి ఇంట్లో పెట్టొచ్చు గా ……. ”
నేను నవ్వాను.
“ఆ నవ్వు చూడు ……. ” అంది.
ఇంకా నవ్వాను.
“ఛి …… నీ మీద నాకు కోపం కూడా రావట్లేదు …… ”
నేను నవ్వి “సరే ……. ఇచ్చేస్తానులే గిఫ్ట్ ………. ఇంక నిన్ను నెక్స్ట్ టైం నుంచి టీస్ చేయనులే …… ” అన్నాను.
“వొద్దు …….. ”
“వొద్దా ??”
స్వీటీ దగ్గరగా జెరిగి “సారీ ……. సంజు ….. ఇందాక ఏదో అలా అనేశాను …… ” అంది.
“హే ఇట్స్ ఒకే ……. ఇప్పుడేం అయిందని ??”
“అలా ఎప్పుడు నాకు ……. నన్ను బాగా టీస్ చేయి ……. ”
“హే …… నేను ఊరికినే అన్నాను …… నిన్ను టీస్ చేయకుండా ఎలా ఉంటాను ??” అన్నాను.
స్వీటీ నవ్వింది. నేను కూడా నవ్వాను. ఇద్దరం కౌగిలించున్నాం.
నేను స్వీటీ జుట్టు నిమురుతూ “ఐ లవ్ యు స్వీటీ …… ”
“ఐ లవ్ యు టూ సంజు …… ” అంది.
అలాగే కొంచెం సేపు ఇద్దరం ఉండిపోయాము.
కౌగిలయ్యాక “పద వెళ్లి కేక్ చేద్దాం ……. ”
నేను వెబ్సైటు ఓపెన్ చేసి instructions తీసాను.
ముందుగా పిండి తాయారు చేయటానికి వాటర్ తీసుకొని పిండిని ఎలా కలపాలి స్వీటీకి ఫోన్ లో చూపించాను.
నేను అక్కడే కిచెన్ గట్టు మీద కూర్చొని స్వీటీకి instructions ఇస్తున్నాను.
“ఓయ్ ….. సంజు ….. ఏంటి ?? నువ్వేం చేయవా ??”
“లేదు….. “
