మానస, అను పగలబడి నవ్వుతుంటే విక్రమ్ ఆదిత్య ముసి ముసిగా నవ్వారు..
అరవింద్ : ఓరి నీ యబ్బ.. ఇంతలోనే ఎంత మందిని స్కాన్ చేసావురా నిన్ను మళ్ళీ ఆ శివరాం గాడి దెగ్గరే వదిలి పెడితే సరిపోద్ది..
అందరూ మానస వైపు చూసారు.. మానస కూడా చిన్నగా నవ్వుతుంది.
నాలుగు రోజులకి సుబ్బు తేరుకున్నాడు, రాత్రికి లేచి అటు ఇటు నడిచి సెట్ అయ్యి కూర్చుని ఆలోచిస్తూ కూర్చున్నాడు. తెల్లారి అరవింద్ వచ్చి సుబ్బుని చూసి ఆనందించి పని వాళ్ళతో కావాల్సిన ఫ్రూట్స్ నట్స్ అన్ని తెప్పించాడు.
సుబ్బు : దేనికిరా ఇదంతా
అరవింద్ : నీకే నీ టైం బాగుంది అనుభవించు, వారానికి సరిపడా ఉన్నాయి ఇంకేమైనా కావాలంటే ఫోన్ చెయ్యి నేను అలా ఆఫీస్ దాకా వెళ్ళొస్తా అని వెళ్ళిపోయాడు.
అరవింద్ సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి సుబ్బు గాడి రూంలో సుబ్బు లేడు పొద్దున తెప్పించిన ఫ్రూట్స్ లేవు.
అరవింద్ : మల్లయ్య.. మల్లయ్యా
మల్లయ్య : బాబుగారు
అరవింద్ : వీడేడి
మల్లయ్య : చిన్న బాబుగారు వద్దన్నా కూడా పళ్ళు మొత్తం తినేసారు అన్నం బదులు జూస్ చేపించుకుని తాగేసారయ్యా జిమ్ రూంలో ఉన్నారు.. పిలవమంటారా
అరవింద్ : లేదు నేనే వెళతాను, మీరు వెళ్ళండి.. అని చెప్పేసి జిమ్ రూంకి వెళ్ళాడు.. అక్కడ సుబ్బు ట్రెడ్ మిల్ మీద చిన్నగా నడుస్తున్నాడు.
సుబ్బు : హాయి రా
అరవింద్ : అస్సలు ఎం జరుగుతుంది ఇక్కడా
సుబ్బు : ఏమైంది రా
అరవింద్ : నువ్వే చెప్పాలి, పంది తిన్నట్టు వారానికి సరిపడే ఫుడ్డు మొత్తం ఒక్క రోజులోనే తినేశావంట..
సుబ్బు : అదా..ఈ నాలుగు రోజులు అస్సలు ఎం తినలేదు కదరా అందుకే బాలన్స్ చేసాను.. మళ్ళి తెప్పించు.. ఇక దొబ్బేయి.
అరవింద్ : అలాగే (అని వీడు నాకు అర్ధం కాడు అనుకుంటూ వెనక్కి తిరిగాడు)
సుబ్బు : ఇంకోటి.. కొంచెం జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది, డోలో – 650 ఒక రెండు తెప్పించు.
అరవింద్ : సరిగ్గా రెండే ఎందుకో..
సుబ్బు : అదా 650 + 650 రెండు కలిపితే 1350 బాగా పవర్ ఎక్కువ ఉంటుంది లే. ఒక టాబ్లెట్ జ్వరం రాకుండా ఆపుతుంది. మొదటి టాబ్లెట్ ఆపలేకపోతే రెండో టాబ్లెట్ ఆపుతుంది.
అరవింద్ : సుబ్బు… ఆ శివరాం గాడేమైనా తల మీద కొట్టాడా
సుబ్బు : జోకులు ఆపి చెప్పింది చెయ్యి అని మళ్ళి ట్రెడ్ మిల్ స్పీడ్ పెంచి నడవడం మొదలు పెట్టాడు.
అరవింద్ మాత్రం సుబ్బు గాడి తిక్క పనులకి అస్సలు ఐదు రోజులు ఇంటికి రావడమే మానేశాడు వచ్చినా సుబ్బు గాడిని తప్పించుకుని తిరిగేవాడు.. ఇక సుబ్బు అస్సలు ఇంట్లో నుంచి బైటికి కదలలేదు తినడం ఎక్సర్సైజులు చెయ్యడం మళ్ళి బాడీని ఇంతకు ముందు ఎలా ఉండేదో అదే షేప్ కి తీసుకొచ్చేసాడు. ఆరో రోజు పొద్దున్నే లేచి అరవింద్ ముందుకి వెళ్ళాడు.
అరవింద్ : ఏంట్రా
సుబ్బు : నాకు నీ ఫోర్డ్ మాస్టాంగ్ కావాలి
అరవింద్ : తీసుకెళ్ళు మళ్ళి అడగడం దేనికి
సుబ్బు : మళ్ళి తిరిగిరాదు అందుకని, వర్క్ షాప్ ఓపెన్ చేపించు పని ఉంది.
అరవింద్ : (సుబ్బు ఎప్పుడు ఇంత సూటిగా మాట్లాడలేదు అలాంటిది కళ్ళలోకి చూసి మాట్లాడడంతో లేచి నిలబడ్డాడు అనుమానంగా) కార్ బానే ఉందిగా
