ప్రేమికుడు – Part 3 167

ఆదిత్య : నేనూ వస్తాను, పదండి.

సుబ్బుని హాస్పిటల్లో జాయిన్ చేసి లోపలికి తీసుకెళ్లగానే ఆదిత్య అరవింద్ తో మాట్లాడి వెళ్ళిపోయాడు.. సుమారు పది గంటలు అరవింద్ ప్రసాద్ తోపాటు హాస్పిటల్లోనే ఉన్నాడు.. స్పృహ రాగానే వెంటనే సుబ్బు వాళ్ల మావయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పి లోపలికి వెళ్ళాడు.

అరవింద్ : సుబ్బు ఎలా ఉన్నావ్ రా, ఏంట్రా ఇదంతా నువ్వు గొడవలకి వెళ్లడం ఏంట్రా

సుబ్బు : నీకు వాడు తెలుసా

అరవింద్ : శరణ్య గొడవ అయిపోయాక నువ్వు ఊరు వదిలి వెళ్లిపోయావ్ అప్పుడే మా పెద్దమ్మ నాకోసం ఒక సంబంధం తీసుకొచ్చింది అది ఆ శివరాం గాడి కూతురు.

సుబ్బు : మానస అందుకే ఇంట్లో నుంచి వచ్చేసింది.

అరవింద్ : నీకు మానస తెలుసా

సుబ్బు : తెలుసు నాకు చాలా కావాల్సిన మనిషి

అరవింద్ : అంటే…

సుబ్బు : అక్క

అరవింద్ : నాకు తెలీకుండా ఇదంతా ఎప్పుడు పరిచయం అయ్యింది.. అస్సలు ఇన్ని రోజులు ఏమై పోయావు.

సుబ్బు : ఈ వారంలోనే చాలా జరిగిపోయాయి.. మానసకి నేనే దెగ్గరుండి తన లవ్ కి హెల్ప్ చేసాను.

అరవింద్ : అలాగా, సరేలే మీ మావయ్య వాళ్ళకి ఫోన్ చేసాను వస్తున్నారు.

సుబ్బు : మానస మీద నువ్వేమైనా….

అరవింద్ : అలాంటిదేమి లేదు అందంగా ఉందని సరే అన్నాను, చుసిన అన్ని సంబంధాలు సెట్ అవ్వవు కదా.. మళ్ళీ నీకు కావాల్సిన వాళ్లంటే నాకూ కావాల్సిన వాళ్ళే కదా…

ఇంతలో ప్రసాద్ లోపలికి వచ్చాడు, సర్ సుబ్బు గారి మావయ్య వాళ్ళు వచ్చారు.

అరవింద్ : వస్తున్నాను.. నేను బైట ఉంటాను

సుబ్బు : వెళ్ళిపోకు నేను నీతో మాట్లాడాలి

అరవింద్ : అలాగే అని బైటికి వెళ్ళగానే సుబ్బు మావయ్య వాళ్ళు లోపలికి వచ్చారు.

జగన్ : రేయి సుబ్బు ఏంటిరా ఇదంతా, ఇంత గొడవ జరిగింది అన్నప్పుడు నువ్వు శరణ్యకి ఫోన్ చెయ్యలేదా

సుబ్బు : శరణ్య ఎక్కడుందో ఏంటో.. వద్దులే మావయ్య

జగన్ : ఉండు నేను ఫోన్ చేస్తాను అని బైటికి వెళ్ళొపోయాడు.. హలో శరణ్య ఎక్కడున్నావ్

అరవింద్ : అంకుల్ ఫోన్ పెట్టేయ్యండి..

జగన్ : ఏమైంది బాబు

అరవింద్ : ముందు ఫోన్ పెట్టేయండి.. అనగానే జగన్ ఫోన్ కట్టేసి అరవింద్ వైపు చూసాడు.. ఇదంతా చేసింది మీ అమ్మాయే..

జగన్ : శరణ్య..

అరవింద్ : తనే దెగ్గరుండి సుబ్బుని అరెస్ట్ చేపించి మరీ వాడికి అప్పగించింది.

జగన్ : నమ్మబుద్ధి కావట్లేదు.

అరవింద్ : మీ అమ్మాయి జాబ్ లో జాయిన్ అయ్యి నెల కూడా అవ్వలేదు ఇంకా నెల జీతమే పడదు అలాంటిది.. మీ ఆడోళ్ళ మెడలో బంగారం.. హారిక పేరు మీద ల్యాండ్ ఇవన్నీ మీరు గమనించలేదా లేదా తెలీనట్టు నటిస్తున్నారా.