సుబ్బు : నెంబర్ ప్లేట్స్ తీసెయ్యాలి, రిపెయింట్ చెయ్యాలి టైర్లు కూడా ఇవి కాదు వేరే ఉన్నాయి.. మనకి పార్ట్స్ సప్లై చేసే విల్సన్ కి ఫోన్ చెయ్యి ఈ సారి ఇల్లీగల్ గా పార్ట్స్ కావాలని చెప్పు అని లోపలి వెళ్ళిపోయాడు.
అరవింద్ సుబ్బు వెనకే వెళ్లి : ఆ శివరాం గాడిని ఎం చేద్దామనుకుంటున్నావ్
సుబ్బు : చూస్తావుగా
అరవింద్ : వద్దురా నా మాట విను వాడి వెనుక చాలా పెద్ద తలలు ఉన్నాయి.
సుబ్బు : హెల్ప్ చేస్తావా నన్నే చూసుకోమంటావా, ఇప్పుడు ఎవ్వరు చెప్పినా వినే మూడ్ లో అస్సలు లేను అని లోపలికి వెళ్ళిపోయాడు.
+++++++++++++++++++++++
++++++++++++++++++++
+++++++++++++++++++++++
రెండు జంటలు వాసు దెగ్గర సెలవు తీసుకుని విక్రమాదిత్య గురించి తెలుసుకోవడానికి తన అమ్మ సంధ్య దెగ్గరికి వెళ్లేముందు కొంచెం రెస్ట్ తీసుకుని వెళదామని ఆగి రెండు రోజులు అక్కడే ఎంజాయి చేసిన తరువాత ప్రయాణానికి సిద్ధమయ్యారు. విక్రమ్ ఆదిత్యలు ఇద్దరు బండి మీద రెడీగా ఉన్నారు, అను కూడా బండి ఎక్కింది..
విక్రమ్ : మానస..
మానస : వస్తున్నా అమ్మ ఫోన్ చేసింది.. ఒక్క నిమిషం.
అను : నేరుగా సంధ్య గారి దెగ్గరికి వెళదాం, అస్సలు ఇప్పుడు తను ఎక్కడ ఉందొ ఎలా ఉందొ ఎలా తెలుసుకోవడం.
విక్రమ్ : ఇంటి అడ్రస్ తెలిసింది వెళ్లి చూస్తే కానీ తెలీదు.
ఇంతలో మానస లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది.
మానస : విక్రమ్… సమస్య
విక్రమ్ : ఏమైంది అనగానే అను బండి దిగింది ఆదిత్య బండి కీస్ తిప్పి ఆపేసాడు.
మానస : ఎవరో మా ఇంటి గోడలు బద్దలు కొట్టి ఇంటి నుంచి ఎలక్షన్ ఫండ్ డబ్బులు మొత్తం ఎత్తుకుపోయారట.. రెండు రోజుల్లో నాన్నని చంపేస్తామని లెటర్ పెట్టి వెళ్ళిపోయాడట
విక్రమ్ : మీ నాన్నకి కావాల్సిందేలే.. అయినా అంతా దొంగ డబ్బేగా.. పోతే పోయింది ఇక మీ నాన్నని కాపాడమని నన్ను అడక్కు నేను చెయ్యలేను నా వల్ల కాదు.
మానస : అది కాదు, ఇంటిని బద్దలు కొట్టుకుని వచ్చింది ఒక కారుతో
ఆదిత్య : అయితే
మానస : నాకెందుకో అది సుబ్బు అని అనుమానంగా ఉంది.
ఆదిత్య : వాడికంత సీన్ లేదు
ఇంతలో విక్రమ్ ఫోన్ లో న్యూస్ టైపు చెయ్యగానే ఫుటేజ్ లింక్ చూసి ఓపెన్ చేసాడు ఆదిత్యతో పాటు అందరూ విక్రమ్ పక్కన చేరి ఫోన్ చూసారు. ఇరవై సెకండ్స్ లో కార్ దూసుకుంటూ గేట్ బద్దలు కొట్టుకుని వెళ్లి బైటికి అదే స్పీడ్ లో రెవెర్స్ గేర్లో వచ్చేసింది..
మానస : అది సుబ్బు గాడి పనే
విక్రమ్ : అంత కచ్చితంగా ఎలా చెపుతున్నావ్
