Location : లోకల్ పార్టీ ఆఫీస్.. పార్టీ పేరు.. కెరటం.. పార్టీ గుర్తు పుస్తకం.
కారు ఆగగానే దిగి నేరుగా లోపలికి వెళ్ళింది శరణ్య.
యూనిఫామ్ లో ఉన్న శరణ్యని చూసి కొంత మంది బెదిరితే ఇంకొంత మంది ఎందుకోచ్చిన గొడవలే అనుకుని బైటికి వెళ్లిపోయారు. శరణ్యని చూసి కూర్చోమని సైగ చేసాడు శివరాం (మానస నాన్న)
శివరాం : సిటీకి కొత్తగా వచ్చారని విన్నాను, పరిచయం చేసుకుందామని పిలిపించాను.. ఎప్పటికైనా మా అవసరం మీకు మీ అవసరం మాకు ఉంటుంది. ముందే పరిచయాలు అయిపోతే ముందు ముందు ఎ మనస్పర్థలు రాకుండా ఉంటాయాని నా ఆలోచన.
శరణ్య : వచ్చిన ఈ నెలలో మీ గురించి వింటూనే ఉన్నాను. మీ ఫైల్ తోడితే చాలా విషయాలు తెలిసాయి.
శివరాం : సరే పాయింట్ కి వచ్చేస్తాను, ఎలాగో మీకు అన్ని తెలుసు కాబట్టి మీకెంత కావాలో అడగండి.
శరణ్య : నేనొక ips ని
శివరాం : అందుకే మిమ్మల్నే అడగమంటున్నాను.
శరణ్య : నాతో ఏమేమి చేయించబోతున్నారో చెపితే, దాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేద్దాం.
శివరాం : మా ట్రక్కులని చెకపోస్ట్ నుంచి దాటించడం, గొడవలు అల్లర్లు జరిగితే చూసి చూడనట్టుగా వెళ్లిపోవడం ఇక అస్సలుది ఈ కలెక్టర్ ఉందే.. రేయి దాని పేరేంటి?
“శృతి అన్నా”
శివరాం : ఆ.. శృతి అది ఎప్పుడెప్పుడు మమ్మల్ని లోపలేయించుదామా అని గుంట నక్కలా ఎదురు చూస్తుంది దాని సంగతి నువ్వే చూసుకోవాలి.
శరణ్య : నేను తన కిందే పని చేస్తున్నాను, నీ ఫైల్ నాకు పంపించిందే ias శృతి.
శివరాం : అందుకే డైరెక్ట్ గా నిన్నే పిలిచాను.
శరణ్య : మీరెంతకి ఫిక్స్ అయ్యారో చెప్పండి.
శివరాం : నెలకి నలభై ఇస్తాను.. ఇంతక ముందు వాడికి ఇచ్చింది ముప్పై ఐదే..
శరణ్య : కానీ అప్పుడు మీ వెనకాల శృతి లేదనుకుంటా
శివరాం : అవును, అయితే మీరే చెప్పండి ఎంతకీ తెగ్గొడదాం?
శరణ్య : డెబ్భై చెయ్యండి.
శివరాం : నువ్వు జాయిన్ అయ్యింది మొన్నే, అప్పుడే అంత అత్యాశ పనికి రాదు.
