సుబ్బు : కానీ కార్ ఓనర్ నాకు తెలుసు, నేను ఫోన్ చేస్తాను అని మానసకి కాల్ చెయ్యగానే ఒకడు ఫోన్ లాక్కుని జేబులో పెట్టుకున్నాడు.
“మూసుకుని జీప్ ఎక్కితే నీకే మంచిది, (అప్పటికే మానస ఫోన్ ఎత్తింది) లేకపోతే రఫ్ గా హ్యాండిల్ చెయ్యాల్సి వస్తుంది.
సుబ్బు : అలాగే.. అని చేతికి బేడీలు తోడిహించుకున్నాడు.
జీప్ ఎక్కించి కూర్చోపెట్టక ఇందాక ఫోన్ తీసుకున్న వాడిని చూసి సైగ చేసాడు వాడు సుబ్బు జేబులో ఉన్న డబ్బు తీసుకుని వాడు తీసుకున్న ఫోన్ సుబ్బు చేతికి ఇచ్చాడు.. మానస ఇంకా కాల్లో నే ఉండటం చూసి జేబులో పెట్టుకున్నాడు.
ఇక్కడ మానసకి డౌట్ కొట్టి వెంటనే విక్రమ్ ని ఆదిత్య ని పిలిచింది.. నలుగురు ఫోన్ లో వినపడుతున్న మాటలు వింటున్నారు.
సుబ్బు : నేను ఏ కారు దొంగలించలేదు, అయినా ఎవరు మీకు కంప్లైంట్ చేసింది?
“నోరు ముయ్యి”
సుబ్బు : నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అదైనా చెప్పండి.
“హైదరాబాద్ స్టేషన్ కి షిఫ్ట్ చేస్తున్నాం.. నువ్వేం మాట్లాడాలనుకున్నా అక్కడ మాట్లాడుకో”
సుబ్బు వెంటనే కాల్ కట్ చేసి ఎవ్వరు చూడకుండా శరణ్యకి ఫోన్ చేసాడు లిఫ్ట్ చెయ్యలేదు.. మళ్ళీ చేసాడు.. వరసపెట్టి ఐదు సార్లు చేసినా లిఫ్ట్ చెయ్యలేదు.. మౌనంగా కూర్చున్నాడు.
±
±
మానస : ఇది మా నాన్న పని, మన వల్ల అనవసరంగా వాడు ఇరుక్కున్నాడు.. నాకు భయంగా ఉంది.. నవ్వించడం తప్ప వాడికేం తెలీదు ఏం చేస్తాడో ఏమో.. అని విక్రమ్ ని చూసింది.
విక్రమ్ : ఏడవకు, నేను వెళుతున్నాను..
ఆదిత్య : లేదు నీ ప్లేస్ లో నేను వెళతాను.
విక్రమ్ : ఏంటి?
ఆదిత్య : రేపే మీ పెళ్లి.. మానస మీ వాళ్లు నీకు ఎవరైనా సపోర్ట్ గా ఉంటే పిలుచుకో.. రేపు మీరు పెళ్లి చేసుకోండి అక్కడ సంగతి నేను చేసుకుంటాను. మానస మీ నాన్న మీద చెయ్యి చేసుకుంటే తప్పుగా అనుకోవుగా?
మానస : కళ్ళు తుడుచుకుని అనుకోను అంది.
అను : వాడు జాగ్రత్త బావా
ఆదిత్య : వాడు వేసిన రెండు జోకులకి ఇంత ఫాలోయింగా.. ఏంటో ఇది.. జాగ్రత్తగా తీసుకొస్తా సరేనా.. నువ్వు జాగ్రత్త.. అవును మరి నీ ఎంగేజ్మెంట్..?
అను : ఇంకెక్కడ ఎంగేజ్మెంట్ నువ్వు నా పక్కన ఉండగా నన్ను టచ్ చేసే దమ్ము ఎవడికుంది మామా
ఆదిత్య : బావనే..
అను : ఆ అదేలే
మానస : సుబ్బు గాడు పూనాడేమో.. అను కూడా వాడిలాగే మాట్లాడుతుంది అని నవ్వింది.
నేను వెళుతున్నా, పెళ్లి టైంకి మీ నాన్నతొ సుబ్బు గాడితో తిరిగిస్తా.. అడ్వాన్స్ హ్యాపీ మారీడ్ లైఫ్.. అని ఆదిత్య బైటికి వెళుతుంటే.. విక్రమ్ పేరెంట్స్, సలీమా అందరూ లోపలికి వచ్చారు.. ఆదిత్య దెగ్గరికి రాబోతుంటే.. విక్రమ్ లోపల ఉన్నాడు వెళ్ళండి. అని చెప్పి ఎయిర్పోర్ట్ కి బైలుదేరాడు. కావ్య అయోమయంగా చూస్తుంటే విక్రమ్ ఎదురు వచ్చేసరికి షాక్ అయిపోయింది.
బెంగుళూరు నుంచి ఎత్తుకెళ్లిన పుల్లయిస్లు సుబ్బుని నేరుగా తీసుకెళ్లి హైదరాబాద్ వాళ్ళకి అప్పగించారు అక్కడ నుంచి వాళ్ళు సుబ్బుని ఒక ఫార్మ్ హౌస్ కి తీసుకెళ్లి మానస నాన్న అయిన శివరాం దెగ్గర విడిచిపెట్టి వెళ్లిపోయారు.