జగన్ : నీ కోపం అర్ధమవుతుంది బాబు.. కానీ వాడు నాకు అల్లుడు.. నాకు ఇవేమి తెలీదు. ఏదో వడ్డీలకి తిప్పుతాను కానీ పాపాత్ములం కాదు, అన్నం పండించుకుని తినేవాళ్ళం.. ఇలాంటివి మాకు రావు.. నాకు ముందే తెలుసుంటే దాన్ని చంపేసేవాడిని.. అని కళ్లెమ్మటి నీళ్లతో సుబ్బుని చూడడానికి వెళ్ళాడు.
సాయంత్రం వరకు అక్కడే ఉండి మాట్లాడాక అరవింద్ అందరినీ పంపించేసి వెళ్లి సుబ్బు పక్కన కూర్చున్నాడు.
అరవింద్ : ఇంటికి వెళదామా ఇక్కడే ఉంటావా
సుబ్బు : నువ్వు కూడా వెళ్ళిపో.. పనులు అన్ని వదిలేసి ఇక్కడ ఏం చేస్తావ్.
అరవింద్ : అక్కడ ఏసీ లో కూర్చున్నాం ఇక్కడ మాములు అంతే.. వెళ్దాం అంటే ఇంటికి షిఫ్ట్ చేపిస్తా
సుబ్బు : ఎందుకురా నేనంటే అంత ప్రేమ
అరవింద్ : అంత లేదు మొన్న కారు, డబ్బులు తీసుకున్నావ్ నువ్విలా కూర్చుంటే ఆ డబ్బులు ఎవడు కడతాడు.. ఇక పదా ఇంటికి పోదాం.
ఇంతలో ప్రసాద్ లోపలికి వచ్చి సర్ మీకోసం ఎవరో వచ్చారు పొద్దున వచ్చిన అతను అతనితో పాటు శివరాం కూతురు కూడా వచ్చింది.
అరవింద్ : రానివ్వు.
అను విక్రమ్ మానస అందరూ లోపలికి వచ్చారు.
సుబ్బు : హాయి, పెళ్లి అయిపోయిందా హ్యాపీ మారీడ్ లైఫ్.
మానస : సారీ రా సుబ్బు.
సుబ్బు : పర్లేదులే.. మీ నాన్నని మాత్రం వదలను.. అందులో నువ్వు నన్ను క్షమించాలి
మానస : ఇప్పుడు కూడా జోకులే.. ఎలా ఉంది నొప్పిగా ఉందా
అను : ఇలా అయితే ఎలా సుబ్బు.. అని స్టేతస్కోప్ తీసుకుని చెక్ చేసింది.. బానే ఉన్నాడు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ కావాలి అంతే.. నేనెళ్ళి డాక్టర్ తో మాట్లాడి వస్తాను అని వెళ్ళింది.
అరవింద్ : నేనూ వస్తాను అని అనురాధ వెనుకే వెళ్ళాడు.
మానస : అరేయి సుబ్బు తనని ఎక్కడో చూసానురా
సుబ్బు : మీ నాన్న చుసిన సంబంధం.. వాడే
మానస : ఆ అవును అవును.. ఇతనేనా నీ బెస్ట్ ఫ్రెండ్
సుబ్బు : అవును.
మానస : ఇప్పుడు ఎక్కడికి వెళతావ్, మీ మావయ్య వాళ్ల ఇంటికా.. లేదా మాతో పాటు వస్తావా
సుబ్బు : లేదు అరవింద్ ఇంటికి వెళతాను. చాలా పనులున్నాయి
మానస : ఏం పనులో…
సుబ్బు : ముందు అర్జెంటుగా మీ నాన్నని లేపేయ్యాలి ఇప్పుడు అదొక్కటే పని
మానస : చాల్లే.. దెబ్బలు సరిపోలేదా
ఇంతలో అను మరియు అరవింద్ వచ్చారు.
అను : సుబ్బు.. డిశ్చార్జ్ కంఫర్మ్.. నర్స్ వస్తుంది వెయిట్ చెయ్యి.
సుబ్బు : ఇంకిక్కడ నా వల్ల కాదు వెళ్ళిపోదాం, రేయి అరవింద్ ఆ నర్స్ ని పిలు
అరవింద్ : ఏ నర్సొ నాకేం తెలుసు.. వస్తుంది ఆగు..
సుబ్బు : మొత్తం పదముడు మంది అందులో ఎనిమిది మందికి పెళ్ళైంది.. మిగతా ఐదుగురిలో ఇద్దరు బాగోరు మిగిలిన ముగ్గురిలో అందరికంటే హైట్ ఉండి తెల్లగా బక్కగా ఒక అమ్మాయి ఉంటుంది పేరు సుకన్య అనుకుంటా ఆ అమ్మాయిని పిలువు.
