చివరికి నీరసించిపోయిన రజిత కి పడుకోవడం తప్ప వేరే ఏమీ చేయడానికి ఓపిక లేదు. బ్యాట్ ఆమె చేతుల్లోంచి జారిపోయింది, ఆమె కుర్చీలో కుప్పకూలిపోయింది. అరవింద్ కి ఇప్పుడు ఆమె మనసుని తనకి అనుగుణంగా మార్చుకునే అవకాశం వచ్చింది.
“రజిత, నువ్వు నయం అయిపోయావు. ఇన్నాళ్లూ నీలో దాచుకున్న ద్వేషం, బాధ, దుఃఖం అన్నీ వదిలేయొచ్చు.”
“మీ అమ్మ ఆ వెధవని పొరపాటున ఇంటికి తీసుకొచ్చినందుకు సారీ చెబుతోందని ఊహించుకో. ఆమె వల్ల నీకు కలిగిన బాధని నువ్వు క్షమించగలవా?”
“అమ్మా నేను నిన్ను క్షమించాను. ఐ లవ్ యు సో మచ్ అమ్మా”.
రజిత తన మొత్తం శరీరం కదిలిపోయేంతగా ఏడ్చింది.
“ఒకవేళ మీ నాన్నకు ఏదైనా చెప్పాలని అనుకుంటే, అది ఏమిటో చెప్పెయ్యి”.
“నాన్నా, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను! మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారని మిమ్మల్ని నిందించినందుకు నన్ను క్షమించండి. ఆ తాగుబోతు వల్లనే అలా జరిగింది. నాన్నా, ప్లీజ్ నన్ను క్షమించండి, ప్లీజ్! నేను చాలా బాధపడుతున్నాను!”
“రజిత, అతనిని ఊహించుకోగలవా? అతను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడు?”
కళ్ళు మూసుకున్న ఆ అమ్మాయి దీపం వైపు చూస్తూ ఉంది. “అతను నన్ను క్షమించాడని, నన్ను ప్రేమిస్తున్నానని, మమ్మల్ని చాలా మిస్ అవుతున్నానని, కానీ ఒక రోజు మనం మళ్లీ కలిసి ఉంటామని చెబుతున్నాడు.”
“మీ నాన్న నిన్ను సంతోషంగా చూడాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. తన చిన్నారి పాప సంతోషంగా ఉంటే ఆయనకు అంతకన్నా సంతోషం ఉండదు. నువ్వు ఆయన కోసం అలా చేయగలవా? అన్ని చెత్త విషయాలని వదిలేసి సంతోషంగా ఉండటం మొదలు పెట్టగలవా?”
“అవును, నాన్నా. అవును, నేను మీ కోసం సంతోషంగా ఉంటాను. మాటిస్తున్నాను!”
ఆమె వేగంగా ముందుకు దూకి, దీపానికి తనకూ మధ్య ఉన్న శూన్యాన్ని తన చేతులతో చుట్టేసింది.
“మీ ఇద్దరి మధ్య అనుబంధం చాలా బలమైనది, ఎప్పటికీ తెగిపోదు. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, అతను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడని తెలుసు. అతను చనిపోకూడదని నువ్వు అనుకున్నా, అతని మరణం నిన్ను మరింత బలవంతురాలిని చేసింది.”
రజిత కంటి నుండి ఆనందపు జల్లు కురిసింది.
***
