“ఎందుకు సార్, మమ్మల్ని చూడగానే పక్కకు తప్పుకుంటారని” ఒకసారి అడిగితే “మేము మీ జీవితాలను నాశనం చేశాము కద తల్లీ, అందుకనేనమ్మా మిమ్మల్ని చూసినప్పుడలా సిగ్గుతో పక్కకు తప్పుకుంటాము” అనే వాడాయన.
“మాకిష్టముండే ఈ పనికి ఒప్పుకున్నాం కానీ మీరేమ్ బలవంతం చేయలేదు కదా సార్” అంటే “ఏమో తల్లి మీకిష్టం లేనప్పుడు వెళ్లిపోవచ్చు బలవంత పెట్టే వాళ్లెవ్వరూ వుండరనే” వాడు.
ఆయన బతికుండగా టీనాకి ఆ ప్లేస్ ఒక స్వర్గం లాంటిది దాన్ని వదిలిపోవాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. కానీ ఆయన చనిపోయాక పరిస్తితి మారిపోతొంది. ఆడదాన్ని పశువుల సంతలో వస్తువు మాదిరి అమ్మేస్తున్నారు. ఇంతమంది ఆడవాళ్లు వీరికి ఎక్కడ దొరుకుతున్నారంటే ఆడవారిలోని విచ్చలవిడిదనం పెరిగిపోతొంది. ఆర్థిక స్వాతంత్ర్యం కోసం వీదిలోకొస్తున్న ఆడవారి బలహీనతను వీరు వుపయోగించుకుంటున్నారు. తమతమ తల్లిదండ్రులకు, మొగుళ్లకి, పిల్లలకి తెలీకుండా ఈ కంపెనీలో వ్యభిచరిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. కనిపెట్టే వారెవరు. అందరిలాగా పొద్దున్నే ఆఫీసుకని బయలుదేరుతారు. వారక్కడ చేయాల్సిన పనేమి వుండదు. యం.డీ కి పి.ఎ గానో, రిషప్సనిస్టు గానో వుంటారు. అవసరమైనప్పుడు మీటింగ్ పేరుతో హోటల్
రూములోకి వెళ్లిపోతారు అక్కడే వీరు చేయాల్సిన పని. అదికూడా వారినికి ఒకసారో రెండు సార్లో. ఇది కొత్తగా కంపెనీలో జేరిన వారి వ్యవహారం.
అదే టీనా లాంటి సీనియర్లయితే పరిస్థితి వేరు. వీరికి సొంత కంపెనీలు వుంటాయి. టీనాకి దేశంలోని పెద్ద పెద్ద నగరాలలో బ్యుటీ క్లినిక్కులు, స్పా సెంటర్లు వున్నాయి. వీటి ముసుగులోనే కంపెనీకి కావలసిన ఎస్కార్టులను తయారు చేస్తున్నది. బెంగళూరు ఆమె కంపెనీ హెడ్ క్వార్టర్. ఆ కంపెనీ ఆమెకి కావలసినంత డబ్బు సంపాదించి పెడుతొంది. ఈ కంపెనీ మీద ఆధార పడాల్సిన పనిలేదు. ఇలా ఆడవారిని పశువుల్లా ఆమ్మే పద్దతి ఆమెకు నచ్చలేదు. తానీ కంపెనీలో చేరినప్పటిలా లేదీ కంపెనీ ఇప్పుడు ఏదో వ్యభిచార గృహంలా వుంది. తాను వీళ్లందరి పైన పెద్ద లంజలాగా అనిపిస్తొంది తనకు. ఆ ట్యాగే తనకి నచ్చడం లేదు. మొదట తనలాంటి వారిని తయారు చేయమని చెప్పినప్పుడు కంపెనీ వృద్ధి కోసమని ఒప్పుకుంది.
ఒకప్పుడు ఈ కంపెనీ తన శారీరక కోరికలు తీర్చుకోవడానికి, తన ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకోవడానికి వుపయోగపడింది. అప్పుడు ఈ కంపెనీ నైతిక విలువలు ఆకాశమంత ఎత్తులో వుండి ఎవ్వరిని నొప్పించనంతగా వుండేటివి. ఒక వేళ ఎవరికైనా తెలియని నష్టం కలిగినా వారికి పరోక్షంగా సాయపడేవారు. ఒకప్పుడు ఆ ట్రస్టుకు చేయి అందినంత మంది రైతులకి సాయం చేసి వారి వున్నతికి వుపయోగ పడితే, ఇప్పుడు అదే ట్రస్ట్ తన స్వార్థ వుద్యోగుల బందువులకి సాయం చేస్తూ ట్రస్ట్ ధనాన్ని మరో దారి నుండి బయటకు పంపేస్తొంది. అదే ట్రస్టు అమాయకపు ఆడ పిల్లల మానాల్ని తీస్తుండటమే కాకుండా ప్రాణాలని తీసే పనిలో వుందని, అది ఇప్పటినుండి కాదు సుమారు అయిదేళ్లగా సాగుతుందని తెలిసినప్పటి నుండి ఆమెకు ఆ ట్రస్ట్ సొంత ఇంటిలా కాకుండా వ్యభిచార కొంపలా అనిపిస్తొంది.
అంతే కాకుండా బలివ్వడానికని తెచ్చిన ఇద్దరి పిల్లలని బెంగళూరు నుండి ఇక్కడికి తేవడానికి టీనానే వుపయోగించుకున్నారు. ఆ విషయం సంధ్య చెప్పేటంత వరకు ఆమెకు కూడా తెలీదు. సంధ్య చెప్పినప్పుడు ఆమె నమ్మలేదు. కానీ వారిని మత్తులో ముంచి తన కారులో వేసినప్పుడు అనుమానం వచ్చింది. వారిని ట్రస్ట్ లోని కులతలకు వైద్య సేవలు అందించే డాక్టరుకి అప్పగించినప్పుడు ఆయన అన్న మాటలు ” ప్రకాశ్ వీళ్లని అమావస్య వరకు జాగ్రత్తగా కాపాడాలి”. ఆ మాటలు సంధ్య చెప్పిన అమావస్య నాడు కన్నె పిల్లలని బలిసారనే ” మాటలకి సరిపోయాయి.
ఈ అనుమాలన్నీ కలిసి ఆమెలో ఒక విరక్తిని కలిగించాయి. తను ఈ కంపెనీలో చేరిన మొదట్లో రామలింగా రెడ్డి ఇచ్చిన కాంట్రాక్టు ప్రకారం తనకు ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్లవచ్చనే విషయం గుర్తుకు వచ్చింది. ఇదే తన చివరి పార్టీ అని నిర్ణయించుకుంది.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
అక్కడున్న నాలుగు పార్టీ హాల్లలోని మూడో దానిలోకి ప్రవేశించింది టీనా. నడుము భాగానికి మిల మిలా మెరిసే ఒక చిన్న గుడ్డని కట్టుకుందామె. నడుము మీద ఒక చిన్న సైజు బంగారపు గొలుసు కట్టుకుంది. పచ్చటి రంగు టాప్ దరించి వుంది. అది తన ఎదలను మాత్రమే కప్పి వుంచింది. అమె మగవాడి చేతికి సరిపోయే వక్షాల మద్య లోని లోయని స్పష్టంగా వ్యక్త పరిచేలా వస్త్రాధారణ చేసుకుని వుంది. మగవాడి కళ్లే కామాన్ని పెంపొందింప చేయడానికి దోహదపడే మొట్టమొదటి అవయవం. ఆడదాని శరీరంలో ఆ కళ్లు వెతికే భాగాలు మొదట సల్లు, తరవాత మొఖం.కామం తీవ్ర రూపం దాల్చగానే అవి అప్రయత్నంగా తొడల మద్య భాగానికి చేరుకుంటాయి. ఆభాగం కనపడ లేదంటే తొడలని ఆవేశంగా చూస్తాయి. చేతులు ఆ ఎదలని, తొడలని తాకాలని
ఆత్రపడతాయి.
ఆ మూడో హాల్లో కంపెనీకి చెందిన ముఖ్య ప్రముకులు ఆసీనులై వున్నారు. వున్నత పదవులలో వున్న వుద్యోగులు, ముఖ్యమైన పనులు అంటే బ్రోకర్స్, ప్రభుత్వ సమాచారం అందించే వారు. చట్ట వ్యతిరేక పనులకు వుపయోగపడే ప్రభుత్వ వుద్యోగులు ఇలా చాలా మంది వున్నారు. వారిని సంతృప్తి పరిచే భాద్యతను టీనా పైన వుంచారు.
హాలు మద్యలో ఎత్తైన స్టేజి. దానికి చుట్టూ విశాలమైన హాల్లో 50కి పైగా టేబుల్స్ ఒక పద్దతి ప్రకారం సర్ది వున్నారు. ఒక్కో టేబుల్ కి నలుగురుకి పైగా మంది కూర్చుని వున్నారు. టీనా స్టేజి పైకి వచ్చింది ఆమె వెంట రోజీ,మెరీనాలు కూడా వచ్చారు. అది వృత్తాకారం లోనున్న స్టేజి. దాని పైన మాత్రమే లైట్ బ్రైట్ గా వుంది. మిగిలిన హాలంతా ఎర్ర, పసుపు పచ్చ కలర్లో డిమ్ గా వెలుగుతున్నాయి. ఈ లైటింగ్ ఎఫెక్ట్ లో ఆమె వెలిగిపోతొంది. తేలిక పాటి సంగీతం ఆ హాలులో ప్లే అవ్వసాగింది. ఆ సంగీతానికి తగ్గట్లు ఆమె కదలడం మొదలెట్టింది. అది చిన్నగా సంగీతం హోరెత్తింది. ఆమె బెళ్లీ డాన్స్ స్టార్ట్ చేసింది. ఆమె వయ్యారంగా నడుముని కదుపుతూ నాట్యం చేస్తుంటే ఆ హాల్లోని మగవారి మనస్సులు కూడా అలాగే కదిలాయి. ఆడవారు ఆమె నడుమును
చూసి కుళ్లుకున్నారు. మొన్నీ మధ్యనే ఐటెమ్ గర్ల్ గా మారిన ముమైత్ ఖాన్ కూడా ఆమెలా బెళ్లీ డాన్స్ చేయలేదు(ఈ కథా కాలం 2009)… . . . . . టీనా డాన్స్ లో అంత సెడక్టివిటీ వుంది మరి. దాని నడుము సౌందర్యం ముందు ఇలియానా నడుము ఏపాటి కూడా కాదు.
బెల్లీ డాన్స్ ముగిసింది మరో రకమైన డాన్స్ బీటుకి మారింది. ఆ రోజు అర్ద రాత్రి వరకు టీనా అలా ఎగురుతూనే వారిని సంతోష పెట్టింది. ఎంతగా అలసిపోయినా ఆమె నృత్యం మాత్రం ఆపలేదు. అలాగే ఆమె చూపులు డాక్టర్ మీదనే వున్నాయి.వాడు అర్ద రాత్రి దాటుతుండగా హాలు వదిలి బయటకు పోవడం గమనించింది. ఆమె కూడా డాన్స్ చేయడం ఆపి అతన్ని వెంబడించింది.
ఆ డాన్స్ హాల్స్ అన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో వున్నాయి. దాని పైన మరో రెండు ఫ్లోర్లు కలిగిన పెద్ద భవంతి అది. రాజ సౌధాన్ని మించిన వైభోగం దానిది. మిగిలిన రెండు ఫ్లోర్లలో సుమారు నాలుగు వందల గదులు కలిగిన అధునాతన భవంతి. ఒక్కో గదిలో రెండు బెడ్ రూమ్స్. 1600 వందల మంది ఒకేసారి బస చేయొచ్చు ఆ భవంతిలో. ఇంత గొప్పగా ఆ భవనం కట్టడానికి ముఖ్య కారణం అక్కడ ఎప్పుడూ ఏదో ఒక మీటింగో లేక ఆ ట్రస్ట్ అనుసందాన కంపెనీ ప్రతినిధులతో నిండి వుంటుంది. ఈ భవంతిలోనే వారికి కాంతలతో సుఖమూ ఏర్పాటు చేయడం జరుగుతుంటూ వుంటుంది. ఇక్కడే ట్రెజరీ సహస్ర ఫణి నివాసముంటున్నాడు.
డాక్టర్ సరాసరి ఫణి గదికి వెళ్లాడు. ఆయన నివాశం మూడో ఫ్లోర్లో. ఆ విశాల భవంతికి ఆ ఫ్లోర్ మకుటం లాంటిది. ఆ గోపుర నిర్మాణంలో అత్యాధునిక అలంకరణలతో అత్యంత సోభాయమానంగా వెలిగిపోతూ వుండే ఆ నివాసాన్ని చూసి ఎటువంటి ధనవంతుడైనా కుళ్లు కోవాల్సిందే. కష్టపడి సంపాదించిన వాడు ఇంతలా ఇల్లు కట్టుకోడు. తన అన్న రామరాజు సంపాదిస్తే దాన్ని వీడు ఇలా దోచుకు తింటున్నాడు. ఆ ఇంటి అలంకరణలో ఎక్కువ శాతం జంతువుల శరీరంలో విలువైన భాగాలే కనపడతాయి. పులి చర్మం మరియు వాటి గోళ్లు. జింక చర్మం. దుప్పి కొమ్ములు. ఏనుగు దంతాలు.వాటికి ఆధునిక సొబగులు అద్దినారు. ఉదాహరణకి ఏనుగు దంతానికి డిజైన చేయించడం. నాలుగు పెద్ద పులి చర్మాలని కలిపి ఒక డిజైన్ చేయడం లాంటివి. ఎవరికి అవి నిజమైన జంతువుల అవయవాళ్లా కనిపించవవి. మంచి కళాకారుడు వేసిన ఫ్లోర్ పెయింట్ లాగా, నిష్నాతుడైన నిపుణుడు చేత
తయారు చేయబడిన కృత్రిమ ఏనుగు దంతం లాగా కనిపిస్తాయి.
డాక్టర్ భవనం పై భాగంలో అడుగు పెడుతుంటే టీనా రెండో అంతస్థు దాటి మూడో అంతుస్థులోకి అడుగు పెట్టబోయింది అక్కడున్న ద్వార రక్షకుడు “పరులకు ప్రవేశము లేదు” అని అడ్డం జెప్పినాడు. “డాక్టర్ గారే రమ్మన్నారు. కావాలంటే పిలిచి అడుగు” అని బెదరగొట్టింది. డాక్టరే గనక రమ్మనివుంటే, వారి అతిథులకు అడ్డం జెప్పినాడని తెలిసిన మరుక్షణం అతని వుద్యోగం వూడుతుంది. అందుకునే లోపలికి రావడానికి అనుమతించాడు. ఆమె ఆ ఇనప ద్వారా న్నాధిగమించి మూడో అంతస్థు చేరుకుంది. ఆమె ద్వార ప్రవేశం జరిగిన కొద్ది క్షణాలకు మరొక వ్యక్తి ద్వార ప్రవేశం జరిగింది. అతను కూడా ఆమె వలే ఆ ద్వార రక్షకుడిని బెదిరించే లోపల ప్రవేశించాడు.