నా కథ 2 361

నెలరోజులుగా నేను అనుభవించిన నరకానికి కారణమయిన వాడితోనే నేను నా మిగతా జీవితం అంతా గడపాలనే ఆలోచన మనసులో వేల సునామీలని సృష్టిస్తోంది…
నా కళ్ళు చూస్తున్నాయి… కానీ నాకేమీ కనబడడం లేదు.. అంతా తెల్లగా ఉంది…
చెవులకి మంత్రాలు వినబడుతున్నాయి.. ఏదేదో చెయ్యమంటున్నట్టు వినబడుతోంది.. నేనూ వణుకుతున్న చేతుల్తో చేస్తున్నాను.. కానీ ఏం చేస్తున్నదీ నాకు తెలియట్లేదు…
కళ్ళు తిరుగుతున్నట్టనిపించింది…
కాసేపటికి గట్టిమేళం అన్న మాట వినబడింది…
దాని అర్థం తెలిసి వచ్చేప్పటికి రవి నా మెళ్ళో మూడుముళ్లు వేస్తున్నాడు… అతను తిరిగి సరిగా కూర్చున్నాడో లేదో.. నాకు మరింతగా కళ్ళు తిరిగినట్టయి అతని వళ్ళోనే పడిపోయాను…

నేను మళ్లీ కళ్ళు తెరిచి చూసే సరికి బెడ్ మీద ఉన్నాను.. రవి వాళ్ళ అమ్మ నా పక్కన కూర్చుంది… నేను కళ్ళు తెరవడం చూసి ఎలా ఉందమ్మా అంటూ అడిగింది…
నాకు ముందు ఏమీ అర్థం కాలేదు…
ఎవరో డాక్టర్ నన్ను టెస్ట్ చేస్తుంది..
చుట్టూ చూసాను.. అమ్మా, అక్కా, నాన్నా, బావా, అందరూ నిలబడి నన్నే చూస్తున్నారు…
బావ పక్కనే రాజు, అతని పక్కన రవి ఉన్నాడు..
రవిని చూసాక గానీ నాకు జరిగింది గుర్తుకు రాలేదు…
అనుకోకుండా నా చెయ్యి గుండెల మీదకి పోయింది…
చేతికి తగిలిన మంగళసూత్రం జరిగిన దాన్ని కన్ఫర్మ్ చేసింది…
నేను వెంటనే లేవబోతుంటే రవి వాళ్ళ అమ్మ వద్దమ్మా కాసేపు అలాగే పడుకో అంటూ ఆపింది…
నేను లేచే ప్రయత్నం మానేసి తిరిగి వెనక్కి పడుకున్నాను…
అమ్మాయికి గాలి తగిలేలా అందరూ బయటకి వెళ్తే మంచిది అంది డాక్టర్…
ఒక్కొక్కరుగా అందరూ బయటకు వెళ్లారు..
అమ్మ, రవి వాళ్ళ అమ్మ, రవి ముగ్గురు మాత్రమే మిగిలారు…
నేను రవి వైపు చూసాను…
అప్పటివరకు నా వైపే చూస్తున్నవాడల్లా.. నేను చూడగానే తల కిందికి దించుకున్నాడు..
” అమ్మాయి బాగా నీరసంగా ఉంది…అందువల్ల కళ్ళు తిరిగినట్టున్నాయి… కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది…
ఇకనుంచి కాస్త బలమైన ఆహారం ఇవ్వండి…” అని ఒక ఇంజక్షన్ చేసి బయటకు వెళ్తూ రవిని బయటకి రమ్మంది …
ఆమె వెంటనే రవి వెళ్ళాడు..
డాక్టర్ ఇంకా ఏవో instructions ఇస్తున్నట్టు చిన్నగా మాటలు వినిపించాయి కానీ అర్థం కాలేదు… మధ్య మధ్యలో రవి అలాగే మేడం అనే మాటలు మాత్రం గట్టిగా వినబడ్డాయి…
నేను కళ్ళు మూసుకుని పడుకున్నాను..
ఇంజక్షన్ ప్రభావమో ఏమో వెంటనే నిద్ర పట్టేసింది…
ఎంత సేపు పడుకున్నానో తెలియదు…
“అక్షరా.. అక్షరా.. ” అనే పిలుపు వినబడి కళ్ళు తెరిచాను….
పక్కన అక్క ఉంది నన్ను తట్టి లేపుతూ…

“ఎంతసేపు పడుకుంటావే ఇంకా” అంది…

“టైమెంతయింది” అన్నాను …

“ఎనిమిదవుతుంది తెలుసా… ఎంత నీరసం అయితే మాత్రం ఇలా పెళ్లి రోజునే ఇంత సేపు పడుకుంటే ఎలాగే… అందరూ ఏమనుకుంటారు” అంది మంచం మీద కూర్చుంటూ…

నేనేమీ మాట్లాడలేదు…
“అయినా నీ ధోరణి మాకేం అర్థం కావట్లేదే…
సడన్ గా ఏమైందే నీకు… లొడలొడా మాట్లాడేదానివి… ఇప్పుడు ఒక్క మాటయినా మాట్లాడుతున్నవా… సరిగా తిండి తినట్లేవు… నిద్రయినా పోతున్నావో లేదో ఆ దేవుడికే తెలియాలి… ఈ మధ్య ఒక్కసారైనా అద్దంలో నిన్ను నువ్వు చూసుకున్నావా… ఎలా ఉండే దానివి ఎలా అయిపోయావు…
ఏమైందే అంటే చెప్పవు…
మనకు తెలివి వచ్చినప్పటి నుండి నీకు నాకు మధ్య సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా… నాకు పెళ్లవగానే నేను పరాయిదాన్ని అయిపోయాను కదూ… ..” అంది..

“అలా ఏమీ లేదక్కా ” అన్నాను వెంటనే పైకి లేస్తూ..

“లేకపోతే చెప్పేదానివి కదే…
ప్లీస్ అక్షరా..ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే చెప్పవే.. ఇద్దరం కలిసి సొల్యూషన్ వెతుకుదాం.. నీలో నువ్వే దాచుకుంటే మాకెట్లా తెలుస్తుంది చెప్పు… నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా.. అయినా పెళ్ళికొడుకు నచ్చాడన్నావ్ కదా….. పెళ్లిచూపులు వద్దన్నావ్… దానికీ అందరూ ఓకే చెప్పారు.. తర్వాతయినా పెళ్లిమీద కొంచెం అన్నా ఇంట్రెస్ట్ చూపించావా నువ్వు…
అన్నిటినీ సర్దుకొన్నాం కదే…
మేమంటే సరే… రవి వాళ్లేమనుకుంటారు…
అదైనా ఆలోచించవా నువ్వు…”