నా కథ 6 270

నాకెందుకో కొంచెం గిల్టీ గా అనిపించసాగింది… ఒక రకంగా చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నట్టుగా రవి అలా ఉన్నపుడు నాకు ఇలాంటి కల రావడం సరైంది కాదు అనిపించింది… కల రావడం అంటే మనసులోకి ఆలోచన రావడమే అనిపించింది… ఇక ముందు ఇలాంటి పొరపాటు జరగకూడదు అని మనసులో గట్టిగా అనుకున్నాను…

పక్కకు తిరిగి రవిని చూసాను..
ప్రశాంతంగా నిద్రపోతున్నాడు… కానీ నాలో ఇంకో సందేహం మొదలయింది.. కలలో జరిగిన రచ్చ ఇంతా అంత కాదు.. నేను బాగా అరిచినట్టు గుర్తు.. ఒక వేళ అలా అరవడం కల్లో అరిచినట్టుగా బయటకు అరిచి ఉంటానా.. రవి విని ఉంటాడా, నేను కలలో చేసింది ఏదైనా బయటకు చేసానా… రవి నన్ను గమనించి ఉంటాడా అని ఒకటే భయం పట్టుకుంది… నిజంగా నేనేమైనా చేసి, రవి అది చూసి ఉంటే నా పరిస్థితి ఏంటి… రవి నా గురించి ఏమనుకుంటాడు… నాగురించి ఏమనుకున్నా ఓకే కానీ తన అసహాయత గుర్తొచ్చి బాధపడితే ఎలా… ఛీ ఛీ నేనెంత తప్పు చేశాను…

ఇలాంటి ఆలోచనతో నాకు ఇక ఆరాత్రి నిద్రే రాలేదు..
తెల్లవారి లేచాక రవిని గమనించాను.. రవి నాతో మాట్లాడడంలో ఎలాంటి తేడా లేదు… రోజులాగే ఉన్నాడు… రాత్రి నా కల గురించి తనకు ఏమైనా తెలిసినట్టు ఏమీ ప్రవర్తించలేదు…
అమెరికా నుండి వచ్చాక తన లోపం గురించి మర్చిపోయి రోజూ ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు… హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నా నేను… రాత్రి నుండి పడ్డ టెన్షన్ తగ్గింది… ఇక ముందు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం అనుకున్నాను..

****************************************************************************************************

అమెరికా వెళ్లే ముందు రవికి తన విషయం తెలిసి చాలా డిప్రెస్ అయ్యాడు.. అలాగే అమెరికా వెళ్ళాడు… నేను ఫోన్లో నచ్చ జెప్పినందుకో… లేదా నా ఫ్రెండ్ చెప్పిన ధైర్యమో, అది రాసిచ్చిన మందుల మీద నమ్మకమో తెలియదు గానీ అమెరికా నుంచి వచ్చాక రవి సంతోషంగా ఉన్నాడు… వచ్చన కొన్నాళ్ళు నాతో కాస్త ముభావంగా ఉన్నా తర్వాత నాతోను మునుపటి రవిలానే ఉంటున్నాడు… నాక్కూడా చాలా సంతోషంగా ఉంది…. ఒక నెలా రెండు నెలలు ఇలాగే గడిచిపోయింది…రవి బాధ లోంచి బయట పడ్డాడు… హమ్మయ్య గండం గడిచింది అని నేను ఊపిరి తీసుకున్నాను…

కానీ అంతలోనే మళ్లీ రవిలో మార్పు రాసాగింది…
మూడీగా ఉండడం, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండడం చేస్తున్నాడు.. ఈసారి ఏమైయిందో నాకు అర్థం కాలేదు.. ఒకటిటి రెండు సార్లు అడిగి చూసా.. కానీ ఏమీ లేదు అంటూ సమాధానం దాటవేశాడు..

ఒక రోజు ఆదివారం నాడు రవి ఇంట్లోనే ఉన్నాడు..
ఆ రోజు మధ్యాహ్నం నేను పనంతా అయ్యాక బెడ్ రూమ్ కి వెళ్లే సరికి రవి బెడ్ మీద కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు… ముఖంలో ఏదో బాధ కనిపిస్తుంది.. ఏదో విషయంలో తర్జనభర్జన పడుతున్నట్టు ముఖకవళికలు చూస్తే అర్థం అవుతుంది… నేను గదిలోకి వచ్చిన విషయం కూడా రవికి తెలియలేదు…

నేను వెళ్లి పక్కన కూర్చుని తన భుజం మీద చేయి వేసాను…. అప్పుడు గానీ నా వైపు చూడలేదు..

“ఏమైందండీ… ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు…” అని అడిగా…

“ఏం లేదు”

“ఈ మధ్య మీరు రోజు మూడీగా ఉంటున్నారు.. ఎంత సేపూ ఏదో ఆలోచిస్తున్నారు… అడిగితే ఇలాగే ఏమీ లేదు అంటారు.. ఏమీ లేకపోతే ఎందుకలా ఉంటారు… ఎంతసేపూ అలా ఒక్కరే ఆలోచిస్తూ వుంటారు.. మీకు నేను లేనా, రాజు లేడా.. దేని గురించి ఆలోచన.. ఏదైనా సమస్య ఉంటే చెప్తే …చేతనైతే మేము ఏమైనా సహాయం చేస్తాం గా “ అన్నాను..

రవి నా వైపు తిరిగి నా కళ్ళలోకి సూటిగా చూస్తూ… “ నిజంగా చేస్తారా…?” అంటూ అడిగాడు..

“అదేంటండీ అలాగంటారు… మాకు చేతనైతే చెయ్యకుండా ఉంటామా.. చేతకానిదైనా.. కనీసం ప్రయత్నమైనా మీకోసం చేస్తాము కదా…మీరు అలా అడగడం ఏమీ బాలేదండీ.. మీకోసం ప్రాణాలైన ఇచ్చేంత ప్రేమ ఉంది… అలాంటిది… చేస్తారా అంటూ సందేహపడుతారా…”

“ఏమో నిజంగా చేయాల్సి వస్తే చేస్తారో లేదో…”

“అవేం మాటలండీ నా మీద ఒట్టేసి చెబుతున్నా… మీకోసం చావమన్నా చావడానికి నేను సిద్ధం…” అంటూ నేను నా తలపై చేయి పెట్టుకున్నాను….

రవి నవ్వుతూ నా తలపై చేయిని తీసుకుని అలాగే తన తలపై పెట్టుకుని… “ నీ మీద కాదు.. నా మీద ఒట్టేసి చెప్పు .. నేనేం చెప్పినా చేస్తానని..” అన్నాడు…

నాకేం అర్థం కాలేదు… రవి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో … చూస్తే నవ్వుతూనే ఉన్నాడు… ఏదైనా తమాషాకి ఇలా మాట్లాడుతున్నాడా… లేదా నన్ను టెస్ట్ చేస్తున్నాడా… ప్రాణాలైనా ఇస్తా అన్నా కదా.. నిజమేనా కాదా చూద్దాం అనుకుంటున్నాడా… నిజానికి రవి కోసం చావడానికైనా సిద్ధం నేను… ఆ విషయం రవికి కూడా బాగా తెలుసు.. అయినా ఇప్పుడిలా ఎందుకు అడుగుతున్నాడు… అయినా ప్రాణాలకన్నా రవి ఇంకేం ఎక్కువ అడుగుతాడు.. కాబట్టి ఒట్టు వేయడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది.. నేను ఇలా ఆలోచూస్తుంటే..

“ఏంటి భయమేస్తుందా… ఒట్టు వేయడానికి…” అన్నాడు రవి నవ్వుతూనే… ఇంకా నా చెయ్యి తన తల మీద నే ఉంది… నా చేతి పై రవి చెయ్యి కూడా అలాగే ఉంది…
రవి నవ్వు చూశాక నాకు ఏ సందేహము లేకుండా పోయింది… ఏదో నవ్వులాటకే రవి ఇలా చేస్తున్నాడనిపించింది…. అందుకే నేనూ నవ్వుతూ… “మీ మీదోట్టు మీరు ఏది చెప్పినా చేస్తాను… ప్రాణమైనా సంతోషంగా ఇస్తాను సరేనా…” అన్నాను…

“చాలా థాంక్స్ అక్షరా… నిజంగా నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం…” అంటూ నను కౌగిలించుకొని నా నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు…