“అనుకున్న దానికన్నా ఒకరోజు ముందే నీ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసావ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్” అన్నాడు మేనేజర్.
“థాంక్యూ సార్” అన్నాడు సంతోష్.
“త్వరలోనే కలిసి పనిచేద్దాం” అన్నాడు మేనేజర్ నవ్వుతూ.
“”ష్యుర్ సార్” అన్నాడు సంతోష్ కూడా నవ్వుతూ.
మెల్లగా తన ఐటమ్స్ అన్నీ బ్యాగ్ లో సర్దుకుని ఆఫీస్ నుండి బయటకు వచ్చాడు. ఎదురుగా వస్తున్న ఆటో ఆపి తన అడ్రెస్స్ చెప్పి లోపల ఎక్కి కూర్చున్నాడు. ఇంటర్న్షిప్ అయిన ఆనందంలో తన ఫోన్ తీసుకొని పూర్ణకి కాల్ చేసాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.
“ఈమె ఎప్పుడు ఇంతే ఛార్జింగ్ సరిగ్గా చూసుకో అంటే మాట వినదు” అనుకున్నాడు మనసులో.
టైం చూస్తే 5:30 అవుతూ ఉంది. తన అకౌంట్ లో ఇంటర్న్షిప్ స్టయిఫండ్ డబ్బులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంటికి వెళ్లి మళ్ళీ అమ్మతో ఏం వంట చేయిస్తాం లే అని.
“అన్న దగ్గరలో బిర్యానీ పాయింట్ ఉంటుంది ఆపు” అన్నాడు సంతోష్, ఆటో డ్రైవర్ తో.
ఆటో డ్రైవర్ సరే అంటూ బిర్యానీ పాయింట్ దగ్గర ఆపాడు.
“రెండు నిముషాలు అన్న వచ్చేస్తాను” అన్నాడు సంతోష్
వెంటనే ఆటో దిగి బిర్యానీ పాయింట్ లోకి వెళ్లి రెండు మటన్ బిర్యానీ తీసుకొని వచ్చి ఆటో ఎక్కాడు.
మరో పది నిముషాల తర్వాత ఆటో సంతోష్ వాళ్ళ ఇంటి ముందు ఆగింది. సంతోష్ ఆటో అతనికి డబ్బులు ఇచ్చి పంపించేసాడు. మెల్లగా నడుచుకుంటూ గేట్ ఓపెన్ చేసాడు. మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి చూస్తే డోర్ లాక్ చేసి ఉంది.
అదేంటి ఇప్పుడు ఎక్కడికి వెల్లింది. అయినా అమ్మ ఆఫీస్ కూడా రేపటి నుండి కదా అనుకుంటూ కాసేపు అలానే ఎదురు చూసాడు. మరోసారి ఫోన్ తీసి కాల్ చేసాడు కానీ మళ్ళీ స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. అటు ఇటు తిరుగుతూ మధ్య మధ్యలో బయటకు వచ్చి చూస్తూ ఉన్నాడు కానీ ఎక్కడా పూర్ణ జాడ కనపడలేదు. అక్కడ నుండి ఫోన్ చూసుకుంటూ పక్కనే ఉన్న సందులో నుండి మెల్లగా పెరట్లోకి వచ్చాడు. ఇంతలో ఎవరో మూలుగుతున్న సౌండ్ వచ్చింది. చుట్టూ చూసాడు కానీ అక్కడ ఎవరు లేరు. ఇంతలో మరోసారి అదే మూలుగు చిన్నగా వినపడింది. దానికితోడు ఏవో గుసగుసలు వినపడ్డాయి. ఎవరై ఉంటారు అనుకుంటూ తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి మెల్లగా ముందుకు కదిలాడు.
దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరు లేరు కానీ చిన్నగా మాటలు వినపడుతూ ఉన్నాయి, అదే టైం లో మూలుగులు కూడా వినపడుతున్నాయి. పరీక్షగా చుట్టూ చూసాడు.
అతని చూపులు మెల్లగా పైకి జరిగాయి. ఎదురుగా ఉన్న బాత్ రూమ్ వెంటిలెటర్ లో నుండి ఆ సౌండ్స్ వినపడుతున్నాయి కానీ అవేంటో సరిగ్గా అర్ధం కావట్లేదు. అయినా ఇంట్లో అమ్మ లేదు కదా ఈ సౌండ్స్ ఎందుకు వస్తున్నాయి అన్న అనుమానం మొదలైంది. అదికాక బాత్ రూమ్ లో లైట్ కూడా వెలుగుతూ ఉంది దాంతో తన అనుమానం ఇంకా ఎక్కువ అయింది. ఇంట్లో ఎవరైనా చొరబడ్డారా అనుకుని మళ్ళీ చుట్టూ పరికించి చూసాడు. పక్కనే నిచ్చెన కనపడింది. దానిని తీసుకొని గోడకి ఆణించి చూసాడు. సరిగ్గా వెంటిలేటర్ దగ్గరికి సరిగ్గా సరిపోయింది. మెల్లగా ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కాడు. పైకి ఎక్కుతున్న కొద్ది మూలుగులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాసేపటికి వెంటిలేషన్ కిటికీ దగ్గరికి చేరుకున్నాడు. మొహం కొంచెం లోపలికి పెట్టి తొంగి చూసాడు. అంతే అతని గుండె ఆగిపోయినంత పనైంది.
