“ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ ఆహ్వానాన్ని అంగీకరించను,” అని నేను గాయత్రితో అన్నాను. “అదంతా పనికిమాలిన వాగుడు, బోరింగ్ ప్రసంగాలు, విసుగు తప్ప ఇంకేమీ ఉండదు. వాళ్ళకోదండం, నేను రావడంలేదని వాళ్లకి చెప్పు.”
“కానీ ఇది నిజంగా పెద్ద గౌరవం, శ్రీకర్ గారూ,” నా అందమైన అసిస్టెంట్ అభ్యంతర పెట్టింది. “పార్లమెంట్ కమిటీతో మీ అభిప్రాయాలని పంచుకోమని అడగడం, ఆపై PM ఇంటిలో భోజనం చేయడం ! మీరు దాన్ని కాదనుకోవడం కరెక్ట్ అనుకుంటున్నారా ?”
“నాకు అస్సలు వెళ్లే ఉద్దేశం లేదు,” నేను అన్నాను. “వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తారు. పన్నెండు మంది వరకు వ్యాపార నిపుణుల్ని ఆహ్వానిస్తారు, అందరూ ఏమీ చెప్పకుండా చాలా మాట్లాడుతారు, వాళ్ళు ఆకట్టుకునే ప్రెస్ రిలీజ్ ఇస్తారు, ఆపై అందరూ యథావిధిగా వాళ్ళ పనుల్లో బిజీ అయిపోతారు. వద్దు, నా సమయాన్ని నేను వేరే మెరుగైన పనులకి ఉపయోగిచుకుంటాను.”
గాయత్రి నా వైపు చూసింది. నాకు తెలిసిన వాళ్లలో అందరికన్నా తన సమాధానాన్ని మౌనంతోనే నాకు చెబుతుంది.
నా టేబుల్ మీదున్న ఆహ్వాన పత్రాన్ని నేను చూశాను. “ఈ MP ఓ పెద్ద మోసగాడు,” అని నేను అన్నాను. అది నిజమైన సంతకమా లేక ఫోటోకాపీ చేసిందా అని చూడటానికి నేను సంతకాన్ని మరింత దగ్గరగా చూశాను. “నేను మాత్రం—”
“నేను ఆగిపోయాను, ఎందుకంటే అక్కడ ఒకటి నా దృష్టిని ఆకర్షించింది. సంతకం కింద, ఎడమవైపు మార్జిన్లో, చక్కగా టైప్ చేయబడి, MP పేరులోని మొదటి అక్షరాలు పెద్ద అక్షరాలతో, ఆ తర్వాత ఒక స్లాష్తో, చిన్న అక్షరాలతో “uy” అని ఉన్నాయి.
“హుమ్,” నేను అన్నాను. “ఆ… గాయత్రి గారు. ఉత్తర ప్రత్యుత్తర సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. నేను అనుకుంటున్నది కరెక్టో కాదో మీరు చెప్పగలరా ?”
నేను పెన్సిల్తో ఆ గుర్తుని రౌండుగా చుట్టి, ఆమెకి ఉత్తరం అందించాను. ఆమె ముందుకు వచ్చి దానిని తీసుకుంది, నేను చుట్టిన చోటుని ఆమె చూసినప్పుడు ఒక కనుబొమ్మ కొద్దిగా పైకి లేచింది.
“మీరు ఊహించినట్లే శ్రీకర్ గారు, ఈ మొదటి అక్షరాలు ఈ ప్రత్యేక ఉత్తరానికి ఎవరు బాధ్యత వహిస్తారో వాళ్ళ పేరుని తెలియజేస్తాయి. పెద్ద అక్షరాలు ఉత్తరం dictate చేసిన లేదా మొదలుపెట్టిన వ్యక్తి మొదటి అక్షరాలు – ఈ సందర్భంలో అది క్లియర్ గా ఎంపీ గారివి – అయితే చిన్న అక్షరాలు టైప్ చేసిన వ్యక్తివి.”
“మీకు తెలుసు కదా గాయత్రి గారు, మనం వేసుకున్న పందెం గెలవడానికి నేను ఒక్కో మెట్టు దాటుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నేను ‘U’ అక్షరం వరకు చేరుకున్నాను. U అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు దొరకడం చాలా కష్టం. నిజం చెప్పాలంటే U అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు ఎవరూ నాకు పరిచయం లేరు. ఇప్పుడు ఈ లెటర్ ని చూసినప్పుడు మన MP దగ్గర U అక్షరం పేరుతో మొదలయ్యే అమ్మాయి ఉన్నట్లు తెలుస్తుంది. నేను పార్లమెంటరీ కమిటీ సమావేశానికి వెళితే, ఆ అమ్మాయి గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. నాకు వచ్చిన ఈ అవకాశం బహుశా విలువైనదే కావొచ్చు” అన్నాను.
గాయత్రి తన డెస్క్కి తిరిగి వెళ్ళింది. “శ్రీకర్ గారు, నేను మీకు చెప్పాల్సిన పని లేదు, ఆమె నిజంగా అమ్మాయి అవునో కాదో మీకు తెలియదు. లేదా ఉత్తరం టైప్ చేసిన మనిషి అసలు అమ్మాయి అబ్బాయో కూడా తెలియదు. ఆమె వయసు ఎంతో కూడా తెలియదు. ఈ మనిషి గురించి మీకు తెలియని అనేక విషయాలు ఉన్నాయన్నది సుస్పష్టం” ఆమె పొడిగా చెప్పింది.
“అది కూడా కరెక్టే గాయత్రి గారు, కాబట్టి, అక్కడికి వెళ్లి ఒక రోజంతా బోర్ కొట్టించుకుంటూ గడపడానికి బదులు ఆ విషయం గురించి ఇప్పుడే తెలుసుకోవడం మంచిది కదా ? ఒక పని చెయ్యండి, మీరు MP గారి ఆఫీస్ కి నా కోసం ఫోన్ చేసి, ఈ U.Y.తో మాట్లాడటానికి ప్రయత్నిస్తారా ?” నేను అడిగాను.
గాయత్రి నావైపు ఒక చూపు విసిరింది, అది ఎలా వుందో నేను మీకు చెప్పలేను. ఆమె అందమైన, ప్రశాంతమైన ముఖ కవళికలు అస్సలు మారలేదు, అయినా ఆ రోజు MP ఆఫీస్ కి నేను ఫోన్ చేయాలని అనుకుంటే, నేనే స్వయంగా చేసుకోవాలని నాకు నిస్సందేహంగా తెలిసింది.
గాయత్రి భోజనానికి వెళ్ళిన వెంటనే నేను అదే పని చేశాను.
ఫోన్ తీసిన వ్యక్తి ఒక మగాడు, అతను U.Y. అయి ఉండకూడదని నేను కోరుకున్నాను. అయితే, ఒక MP కి చాలా మంది ఆఫీస్ సిబ్బంది ఉంటారని అప్పుడు నాకు అర్థమైంది. నేను వాళ్లలో ప్రతి ఒక్కరితో మాట్లాడి తెలుసుకోవాల్సిందే, నేను ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే, చివరికి ఎవరో, “ఓహ్, మీరు ఉదయశ్రీ తో మాట్లాడాలని అనుకుంటున్నారేమో. దయచేసి లైన్ లో వుండండి,” అని అన్నారు.
ఉదయశ్రీ ! “అవును,” నేను అన్నాను. “నాకు కావాల్సింది ఆమే” అయితే అతను అప్పటికే నాకు లైన్ కలిపాడు, ఆ తర్వాత నేను విన్న స్వరం, “హలో ? నేను మిస్ యాదవ్. నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను ?”
నేను అనుకున్నదాని ప్రకారం ఆమె యవ్వనంలో ఉంది. కనీసం ఆమెకి పెద్ద వయసు ఉన్నట్లు అనిపించలేదు. “ఆహ్,” నేను అన్నాను. “మిస్ యాదవ్. ఐ మీన్ మిస్ ఉదయశ్రీ యాదవ్, నేను సరిగ్గానే చెప్పానా ?”
“అవును,” ఆమె చెప్పింది. “మీరు ఎవరు ?”
“నేను శ్రీకర్ ని మాట్లాడుతున్నాను మిస్ ఉదయశ్రీ.” ఈ మాటలు ఆమెలో ఎలాంటి ఆసక్తిని కలిగించకపోవడంతో, నేను కొనసాగించాను. “మీరు—అంటే, MP—నన్ను బిజినెస్ కాన్ఫరెన్స్కు ఆహ్వానిస్తూ ఒక లేఖ రాశారు, ఇంకా—”
“ఓహ్, అవును,” ఆమె అంది. “అవును, మిస్టర్ శ్రీకర్, నాకు గుర్తుంది. మీరు రావాలనుకుని ఫోన్ చేస్తుంటే, మీ అధికారిక…”
“ఆహ్, లేదు,” నేను అన్నాను. ఆమె వాయిస్ నాకు నచ్చింది, అయితే నాకు తెలిసినంత వరకు ఆమె చాలా లావుగా ఉండొచ్చు, లేదా వికృతంగా కనిపించవచ్చు, లేదా పూర్తిగా లెస్బియన్ కూడా అయి ఉండవచ్చు. కానీ నేను రిస్క్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. “అంటే, నేను హాజరు కావాలని అనుకుంటున్నాను, కానీ కొన్ని విషయాలని ముందుగా స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఉదాహరణకి, ఆహ్వానంలో సదస్సులో పాల్గొనేవారు PM ఇంటిలో భోజనం చేస్తారని ఉంది.”
“అవునండి.”
“ఇక్కడ ఇంకేదో ఉంది, నన్ను చూడనివ్వండి… హా. ‘జీవిత భాగస్వాములకి స్వాగతం’ అని ఉంది.”
“అవును,” ఆమె చెప్పింది, ఆపై కొద్దిగా ఆశ్చర్యంతో కూడిన స్వరం తో, “ఇదివరకు ‘భార్యలకి స్వాగతం’ అని ఉండేది, కానీ సదస్సులో పాల్గొనే వాళ్ళందరూ మగాళ్లే అని ఊహించుకోవడం లింగ వివక్ష అవుతుందని భావించారు, దాంతో—”
“తప్పకుండా అనిపిస్తుంది, మనం రాజకీయంగా తప్పుగా ఉండకూడదు కదా ? అయితే మిస్ ఉదయశ్రీ, నాకు జీవిత భాగస్వామి లేరు, కనీసం భార్య కూడా లేదు. కాబట్టి మీరు నాతో ఆ భోజనానికి తోడుగా వచ్చి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను” నేను అన్నాను.
చాలాసేపు నిశ్శబ్దం.
“క్షమించండి, మిస్టర్ శ్రీకర్ ?” అని ఆమె చివరకు అంది.
“OK, అక్కడ ఒక్కడినే డేట్ లేకుండా గడపాలంటే నాకు చిరాకు,” నేను అన్నాను.
“కానీ—మిస్టర్ శ్రీకర్—మనకి ఒకరి గురించి ఒకరికి తెలియదు. మనం ఎప్పుడూ కలుసుకోలేదు.”
“అయితే అది బ్లైండ్ డేట్ అవుతుంది,” నేను అన్నాను. “నేను అంత అందవిహీనంగా లేను, మిస్ ఉదయశ్రీ—మీరు ఖచ్చితంగా—”
“మీరు ఎలా ఉంటారో నాకు తెలుసు, మిస్టర్ శ్రీకర్. మా ఫైల్స్లో మీ ఫోటో ఉంది.”
“ఓహ్, అర్థమైంది.” ఆ విషయం నాకు కొద్దిగా అసౌకర్యాన్ని కలిగించింది. “సరే, మీరు ఏమనుకుంటున్నారు ?”
“మిస్టర్ శ్రీకర్, నేను—నాకు అర్థం కావడం లేదు. మీరు అపరిచితురాలిని అలాంటిదానికి… అలాంటి దానికి నన్ను ఎందుకు పిలుస్తున్నారు ? నాకు అర్ధం…”
నేను ఆమెకి నిజం చెప్పాలని అనుకున్నాను, కానీ నా పందెం గెలిచే సాహసాల క్రమంలో నేను నేర్చుకున్నదేమిటంటే, నిజం, సూత్రప్రాయంగా ప్రశంసనీయమైన మంచి గుణం, ఆచరణలో నమ్మదగనిది, తరచుగా ప్రతిదీ నాశనం చేస్తుంది. దాంతో నేను కొద్దిగా అబద్ధం చెప్పాను. “నేను నా కారణాన్ని చెప్పలేను,” నేను అన్నాను, “మీరు చాలా అందమైన, స్నేహశీలి అమ్మాయి అని నాకు తెలిసింది. మీరు నాకు ఈ విషయంలో సహాయం చేస్తే నేను కృతజ్ఞుడనై ఉంటాను. మిస్ ఉదయశ్రీ, మీరు ఏమంటారు ?”
మరో విరామం. “నేను—ఏమి చెప్పాలో నాకు తెలియడం లేదు,” ఉదయశ్రీ చివరికి చెప్పింది. “ఇది నిజంగా చాలా అసాధారణం. MP గారు ఏమనుకుంటారో నాకు తెలియదు—”
“MP గారి గురించి ఆలోచించకండి,” నేను అన్నాను. “ఈ ఆహ్వానం చెబుతున్నట్లు, మిస్ యాదవ్—ఉదయశ్రీ—నేను చాలా పలుకుబడి కలిగిన వ్యాపారవేత్తని, ఒక పెద్ద సంపన్న ఆర్థిక సంస్థకి అధిపతిని. నా ప్రతి కోరికని తీర్చడం కంటే మా MP గారికి అంతకంటే ఎక్కువ ఆనందం కలిగించేది ఏదీ ఉండదని నేను గట్టిగా నమ్ముతున్నాను – బహుశా మీరు అతని కోసం అది చేస్తున్నారని తెలుసుకోవడం తప్ప.”
ఆమె నవ్వుని అణచివేసినట్లు నాకు అనిపించింది, అయితే నేను ఖచ్చితంగా చెప్పలేను. అయినా, నేను దానిని ప్రోత్సాహకరమైన సూచనగా తీసుకున్నాను.
“మీరు ఎప్పుడైనా PM ఇంటికి వెళ్లారా, ఉదయశ్రీ ?” నేను అడిగాను.
“వెళ్లాను—కేవలం టూర్ కి వెళ్ళినప్పుడు మాత్రమే,” ఉదయశ్రీ చెప్పింది. “కానీ—అతిథిగా ఎప్పుడూ వెళ్ళలేదు. అతిథి డేట్గా కూడా వెళ్ళలేదు.”
ఆమె ఇప్పుడు నా చేతిలో ఉందని నాకు తెలిసింది. కనీసం డేట్ కోసం. అయితే నేను కేవలం డేట్ కన్నా ఎక్కువ కోరుకుంటున్నాను, కాబట్టి నేను నా అదృష్టాన్ని కొద్దిగా పరీక్షించుకోవాలని అనుకున్నాను. “అయితే మీరు ఇంకా సరిగ్గా జీవించడం లేదంటాను,” నేను తేలికగా అన్నాను. “అలాంటి ఇల్లు ఇంకొకటి ఉండదని చెబుతారు. పెద్ద డైనింగ్ రూమ్లో తినడం, PM ఆఫీస్ ని చూడటం, విశాలమైన బెడ్రూమ్లో ప్రేమించుకోవడం…”
మళ్ళీ నిశ్శబ్దం, ఆమె ఫోన్ పెట్టేస్తుందని నేను అనుకున్నాను. కానీ ఆమె కేవలం, “సరే… మిస్టర్ శ్రీకర్, మనం అంత దూరం వెళ్లాలని అనుకోవడం లేదు,” అంది.
“నన్ను శ్రీకర్ అని పిలవండి,” నేను అన్నాను.
***
సదస్సు నేను ఊహించినంత నిస్తేజంగానే ఉంది. MP లు పనికిరాని విషయాలు మాట్లాడారు, అలాగే వ్యాపారవేత్తలు—ఆఖరికి నేను కూడా—వాళ్ళు పాత చింతకాయ పచ్చడి, పడికట్టు పదాలు అవే మాట్లాడారు. అందరూ కెమెరాల ముందు నవ్వారు, వాళ్ళు చెప్పిన వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆ సాగిన ఉదయం అంతా ఉదయశ్రీ తో గడపడానికి పునాది అవుతుందని నేను కోరుకుంటూనే ఉన్నాను.
OK, ఆమె విలువైనదే.
ఆమె అంత గొప్ప అందగత్తె ఏమీ కాదు. నేను అందాన్ని ఆస్వాదించేవాడిని కాబట్టి, ఆమె రూపం విషయంలో మామూలుగానే రేట్ చేసేవాడిని. కాకపోతే, ఆమె నవ్వినప్పుడు ముఖమంతా వెలిగిపోయే అద్భుతమైన చిరునవ్వు ఆమెకి ఉంది. ఆమె శరీరాకృతి బాగుంది అయితే మరీ అద్భుతమైనది కాదు. ఆమె పొడవాటి, లేత గోధుమ రంగు జుట్టు చక్కగా వెనక్కి కట్టబడి ఉంది. నాకు తెలిసినంత వరకు ఆమె మేకప్ వేసుకోలేదు, అయినా ఆమె ప్రకాశవంతమైన, తాజాగా ఉండే ముఖానికి దాని అవసరం లేదనిపించింది.
మీటింగ్ తర్వాత మేం అనుకున్నట్లుగానే ఆమె నన్ను కలిసింది, తర్వాత మధ్యాహ్న భోజనానికి వెళ్లే బృందంలో చేరాం. మొదట్లో కొద్దిగా బిడియపడినా, తర్వాత ఆమె మామూలైపోయింది. అధికారిక లిమోసిన్ మమ్మల్ని PM ఇంటి వైపు వైపు తీసుకెళుతున్నప్పుడు మేం హాయిగా మాట్లాడుకున్నాం. ఆమె నిష్కపటమైన పద్ధతి, వెంటనే నవ్వే తీరు నాకు నచ్చింది. అయితే, ఈ అమ్మాయి ఎవరికీ లొంగేది కాదని, నాకూ లొంగదేమోనని ఒక అనుమానం వచ్చింది.
