అడుగు కానీ మన బ్రేకప్ నా లవర్ గురించి అయితే చెప్పనక్కర్లేదు అంది. ఆ రెండు టాపిక్స్ కాదు లే అన్నాను. అయితే నువ్వు ఏదైనా అడగచ్చు అంది. నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నాను. ఏమి లేవే అలా ఎందుకు అడుగుతున్నావు అంది. నాకు ఎందుకో నీ ఫేస్ లో గ్లో అనేది కనిపించడం లేదు చాలా రోజుల నుంచి, ఎప్పుడు చూసినా డల్ గా ఏదో పోయిన దానిలా ఉంటున్నావు అన్నాను. అదేమీ లేదు వర్క్ ప్రెషర్ అంది. అంత వర్క్ టెన్షన్ ఉంటే నాకు చెప్పు ఏదైనా సహాయం చేయగలను ఏమో అన్నాను. నువ్వే ఫుల్ బిజీగా ఉన్నావు, నీ చుట్టూ అంతా ఫేక్ పీపుల్, నిన్ను ఎప్పుడు డౌన్ చేయాలి అని చుసే వాళ్ళే, నీకు అది సెట్ చేసుకోడానికి టైమ్ లేదు మళ్ళీ నా టెన్షన్ చూస్తావా అంది. ఏంటి అంత మాట అనేసావు అన్నాను. ఏమి లేదు లే అని తను లేచి కిచెన్ లోకి వెళ్ళింది. నాది కూడా తినడం అయిపోవడం తో వెళ్ళాను. తను ఇక వెళ్తాను అంది. నేను హేయ్ వర్ష ఒక నిముషం అన్నాను. ఏంటి అంది. ఏమి లేదు, నువ్వు ఒక్కసారి కూడా నన్ను miss కాలేదా అన్నాను. లేదు అంది. నిజం చెప్పు అన్నాను. తను చెప్పబోతుంటే డోర్ బెల్ మోగింది. ఈ టైమ్ లో ఎవరూ అని చూస్తుంటే సెక్యూరిటీ అధికారి వాళ్ళు వచ్చారు.

Bagaa rastunnaru bro oka vidham ga chppali ante e story kosam roju wait chestunna eppudu istaaraa ani
Bro story continue cheyi bro where is the next aprt
Bro next part pettu bro