రొమాంటిక్ చర్చ్నింగ్ 32 61

నాతో మంజులా అంది అత్తా నువ్వు అస్సలు ప్రసాద్ మామ భార్యవే కాదు అని,ఇంకా ప్రసాద్ మామే మీ ఇద్దరూ భార్యాభర్తల లాగా ఎందుకు నటించాల్సి వచ్చిందో తర్వాత చెప్తాను అన్నాడు.దాన్ని బట్టి నువ్వు ఆయన భార్యవి కానట్లేగా??

ఆహా మరి “స్వరూపరాణి” గురించి ఏమీ చెప్పలేదా మీ మామ??

అత్త మాటకి ఆశ్చర్యం వేసినా,హా చెప్పాడు అత్తా..తను త్వరలోనే మా కళ్ళ ముందరికి వస్తుంది, అప్పుడే ప్రవీణకి శాపవిముక్తి అవుతుంది అని చెప్పాడు..

బాగానే చెప్పాడు నీకు,ఇంతకీ స్వరూపరాణి వస్తాదంటావా??

నాకెలా తెలుస్తుంది అత్తా??అన్నాను ఆశ్చర్యం గా.

హ్మ్మ్మ్ ఆ మంజులని, ప్రవీణ ని కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు కాస్తా పని ఉంది అంది సడెన్ గా టాపిక్ మారుస్తూ..

ఏమోలే అని ఇద్దరికీ కాల్ చేసి రమ్మని చెప్పాను,ఒక ఐదు నిమిషాల తర్వాత ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు నవ్వుతూ..

పంకజం గారూ ఎలా ఉన్నారు అంటూ మంజూ ప్రేమగా ఆలింగనం చేసుకోగా,ప్రవీణ మాత్రం కళ్ళ నిండా నీళ్లతో స్తానువులా నిలబడిపోయింది…

ప్రవీణ వాలకం నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది ,ఎందుకు తన కళ్ళ వెంబడి నీళ్లు వస్తున్నాయి ??అంతలోపే మంజుల ని వదిలిన పంకజం తానూ కళ్లనీళ్లతో ఏమ్మా ప్రవీణ ఎలా ఉన్నావ్ అంటూ ప్రేమగా తల నిమిరింది ప్రవీణకి..

“అమ్మా” బాగున్నానే,నువ్వెలా ఉన్నావ్ అంటూ ఆనంద భాష్ఫాలతో హత్తుకుపోయింది పంకజం ని,నేను ఆ దెబ్బకి మళ్లీ షాక్ లో కూరుకుపోయాను..

నా పరిస్థితి అర్థం చేసుకున్న మంజుల, నా ప్రక్కన కూర్చొని నా భుజం పైన చేయి వేసి ఒరేయ్ అంతా ఇప్పుడే తెలిసింది,ప్రసాద్ గారు చెప్పిన స్వరూప రాణి ఎవరో కాదు మీ పంకజం అత్తే అంటూ మెల్లగా బాంబ్ పేల్చింది…

మంజులా,ఏంటే నువ్వంటోంది??ఏమి జరిగింది అస్సలు అన్నాను…

ప్రసాద్ గారు రాత్రే వచ్చి జరిగింది అంతా చెప్పి వెళ్లారు రా మరో పది రోజుల్లో తిరిగొస్తా అని..

అసలు పంకజం అత్త తన భార్యనే కాదు అన్నాడు కదే,ఇప్పుడేంటి ఇలా???

నిజమే రా,స్వరూప రాణి ఈ పంకజం లా ఎందుకు ఉండాల్సి వచ్చిందో వివరంగా చెప్పాడు అంది..

వెంటనే పంకజం అత్త అలియాస్ స్వరూప రాణి మంజులా ని వారిస్తూ,మంజూ ఇప్పుడు అవన్నీ వాడికి చెప్పకు అంది గంభీరంగా…

అలాగే అండీ అంటూ నా వైపు నిరాశగా చూపు పెట్టింది సారీ రా అన్నట్లు..

అదేంటి అత్తా??నాకు ఏ విషయమూ చెప్పకుండా టెన్షన్ కి గురి చేస్తూ మీరేమో హ్యాపీగా ఉన్నారు అన్నాను విసుగ్గా..

మేము ఆనందంగా ఉంటే ఇక్కడేంటి రా మాకు పని??ఎంచక్కా పైన స్వర్గంలో సకల భోగాలు అనుభవిస్తూ ఉండకుండా అంది కాస్తంత కోపంగానే..

ఆ మాయావుల మాయలు మళ్లీ మొదలయ్యాయి అనే గా మీరు వచ్చింది అన్నాను.

అలా మాత్రం కాదు,మేము వచ్చింది నీ కోసం అన్న విషయం ఒక్కటి గుర్తుపెట్టుకో, సమయం వచ్చినప్పుడు మాత్రం అన్నీ తెలుస్తాయి అంది గంభీరంగా.

నాకోసమా??నాకోసం ఎందుకు వచ్చారు అన్నాను ఆశ్చర్యం తో…

ఈ విశ్వం అంతం అయినా ఇబ్బంది లేదు,ఒక్క నువ్వు మాత్రం నాశనం అవ్వకూడదు అనే మేము అందరమూ తిరిగొచ్చాము అంది ప్రశాంతంగా.

నేను అంతం అవ్వడం ఏంటి అత్తా ఆశ్చర్యం గా ??

నిజమే రా సంజూ, ఈ విశ్వం వాళ్ళిద్దరి వశమవ్వాలంటే అడ్డు నువ్వొక్కడివే.. వాళ్ళ దృష్టంతా నీ పైనే ఉంది,నీకు ఏమీ కాకూడదు అనే ఈ పని చేసాము అంది..

సరేలే,ఎప్పుడూ నాకు అండదండగా ఉన్నారు నువ్వూ,అర్చనా వదిన.. మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను అన్నాను బుద్దిగా.

మంజులా కూడా నీకు మా కన్నా తక్కువేమీ కాదు లే,దాన్ని కూడా గుర్తుపెట్టుకో అంది..

అయ్యో అలా ఏమీలేదుకే స్వరూప గారు,వీడి ప్రేమ ఏ మాత్రం తగ్గనిది,అందరికీ సంతోషాన్ని పంచుతాడు..ఏమంటే మీరూ,అర్చనా ల పైన కొంచెం ఎక్కువ ఆప్యాయత వీడికి అంది మంజూ నిజాయితీగా..