గవర్నమెంట్ హాస్పిటల్, గద్వాల్.
ఒక అంబులెన్సు కేక పెడ్తూ వచ్చి ఎమర్జెన్సీ ఎంట్రన్స్ ముందు ఆగింది.
ఎమర్జెన్సీ అని గట్టిగ అరుస్తున్నాడు బండి నుండి దిగుతూనే కంపౌండర్. స్ట్రెచర్ మీదకు ఒక అమ్మాయి శరీరాన్నీ చేర్చారు. ఆమె చేతి మణికట్టు, కట్టయ్యి రక్తం స్రవిస్తోంది. దారిపొడుగునా అది చుక్కలు చుక్కలుగా కారుతుంది. వెంటనే ఒక నర్స్ దూదిని తీసి ఆ గాయం మీద గట్టిగా వత్తి పట్టుకుంది.
రెండు నిముషాల్లో డాక్టర్ వచ్చి, ఎమర్జెన్సీ ఓటీరూంలోకి తీసుకెళ్లమని ఆదేశించాడు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందనడానికి ప్రతీకగా ఎర్రబల్బ్ వెలుగుతోంది.
ఈ లోపే పత్రికల వాళ్ళు, టీవీ వాళ్ళు న్యూస్ కోసం ఎగబడ్డారు.
ప్రేమ విఫలమై ప్రాణాలు తీసుకున్న యువతీ, ప్రేమోన్మాది చేతిలో మరో ప్రాణం బలి ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టి, జరిగిందేమిటో కూడా తెలియకుండా ఇష్టానుసారం జనాల బుర్రలోకి విషాన్ని నింపడం స్టార్ట్ చేసారు.
రెండు గంటలు గడిచాక, డాక్టర్స్ బృందం బయటకి వచ్చింది. ఆ వచ్చిన వాళ్ళు ఏం చెప్తారోనని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి కొన్ని కెమెరా కళ్ళు. ఆపరేషన్ చేసిన ఒక డాక్టర్ మైకులకు దగ్గరగా వచ్చి నిలబడి ఆ అమ్మాయి ఎవరో, ఏమిటో వివరాలేమీ ప్రస్తుతానికి తెలియలేదు. ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కుంటున్నారు సెక్యూరిటీ ఆఫీసర్లు. ఇక ఆమె హెల్త్ విషయానికి వస్తే, తన పరిస్థితి విషమంగానే ఉంది. శరీరంపై ఉన్న గాయాలనుబట్టి ఎవరో కావాలనే ఆమెను కొట్టారు, సెక్సువల్ అస్సాల్ట్ కి సంబందించిన గాయాలేమి లేవు, కానీ ఆమె ఔటర్ బాడీపై మాత్రం గోళ్ళతో రక్కిన గాయాలు, పళ్లతో కొరికిన గాయాలు మాత్రం ఉన్నాయ్. పైగా ఆమెకు న్యూరోకానైన్, ఇంకా ఆండ్రీలిన్ అనే రెండు రకాల డ్రగ్స్ పొడి ఎక్కువ మోతాదులో ఇవ్వడం జరిగింది. సర్ ఒక సందేహం.
ఎవరో ఆమెకు ఇచ్చారని ఎలా చెప్తున్నారు?? ఆమె తీసుకుని ఉండొచ్చు కదా??? అని అన్నాడు ఒక విలేకరి నోఖచ్చితంగా ఆమెకు ఎవరో ఇచ్చారు, కారణం ఆమె స్పృహ తప్పాక కూడా, ఆమె ముక్కులో, గొంతులో ఈ పొడిని గుప్పించారు. అంతే కాదు ఈ డ్రగ్స్ ఇంజెక్ట్, డైరెక్టుగా చెయ్యకూడదు. కానీ ఆమె చేతిమీద ఉన్న సన్నటి రంద్రాలు ఇంజెక్షన్స్ కి సంబంధించినవే. అవి ఆమె లంగ్సుని, ఇంకా మెదడు వ్యవస్థని పూర్తిగా ఆక్రమించింది. దీని పర్యవసానం ఏమవుతుండొచ్చు డాక్టర్ అని మరో విలేకరి ప్రశ్నించాడు ఏదైనా జరగొచ్చు, ఆ డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా కొన్ని టెస్టులు చేసి తేలుస్తాం. కానీ ఆమె పరిస్థితి మాత్రం అంచనా వెయ్యలేకపోతున్నాం. ఇప్పుడే ప్రాణాలు వదిలేయొచ్చు లేదా ఒక నెల బతకొచ్చు. కోమాలోకి వెళ్లిపోవచ్చు, లేదా బయటకి రావొచ్చు. కానీ ఏదైనా సరే ఆమె బ్రతకడం కష్టం అని అన్నాడు చెమటలు తుడుచుకుంటూ. ఇది జరుగుతుండగానే, ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఆమె శరీరం, ఎగిరెగిరి పడుతోంది, బీపీ, పల్స్ పూర్తిగా తగ్గి, తిరిగి అమాంతం పెరిగిపోతున్నాయనడానికి సూచికగా ఆ మెషినులు వింత శబ్దం చేస్తున్నాయి. ఆమె ఒంట్లో ఎదో ఒక రసాయన ప్రక్రియ జరుగుతోంది. తెగిపోయేలా ఆమె నరాలలో రక్తం విపరీతమైన వేగంతో ప్రవహిస్తూ ఆమె గుండె వేగాన్ని అమాంతం 250 బీపీఎంకు పెంచేస్తోంది. ఇది చిరుత పులి వేటాడే సమయంలో పెరిగేంత గుండె వేగం. ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. చుట్టూ చూసింది. కానీ ఆమె కళ్ళలో భయం కానీ బాధ కానీ లేవు. చాలా తీక్షణంగా దేనికోసమో వెతుకుతోంది. ఆమె మెదడు ఒక కంప్యూటరుల పనిచేస్తోంది. ఆమెకు కావాల్సిన మందులు టాబ్లెట్స్, కత్తులు, కత్తెరలు ఇంజెక్షన్స్ తీసుకుంది. వాటిని ఒక పేపరులో చుట్టుకుని, పక్కరూంలో ఉన్న నర్స్ డ్రెస్ వేసుకుని చక్క నడిచి బయటకి వెళ్ళిపోయింది. పేషెంట్కి కాపలాగా ఉన్న నర్స్ వచ్చేసరికి ఆమె లేకపోవడంతో పరుగుపరుగున వెళ్లి డాక్టర్స్ కి విషయం చెప్పింది.
ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తరవాత:
అది ఒక నిర్మానుష్యమైన ప్రదేశం, అక్కడ ఒక్క పదంతస్థుల బిల్డింగ్ సగం కట్టి ఆపేసారు. ఎనిమిదో అంతస్థులో ఉన్న చిన్న పోర్టాబుల్ టీవిలో సిటీలో నలభై ఐదు మంది కొన్ని నిముషాల వ్యవధిలోనే కనిపించకుండా పోయారు. కనిపించకుండపోయిన వాళ్ళందరి ఇళ్లలో ఒక లెటర్ మాత్రం దొరికింది, అందులో ఆకాశంలో సగం – రుద్రా అని రాసి ఉంది. వీళ్లంతా ఎవరు?? ఒకరితో ఒక్కరికి సంబంధం ఏమిటి??? అనే కోణాల్లో సెక్యూరిటీ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో విశేషమిటంటే అందరు మగవారే అయుండడం, అది కూడా అందరు చిన్నచితక సెలబ్రిటీస్ నుండి పెద్ద, పెద్ద బిగ్ షాట్స్ పిల్లలు, వాళ్ళ బంధువులు అయుండడం. వయస్సుతో నిమిత్తం లేకుండా 17 ఏళ్ళ బాలుడి నుండి 75 ఏళ్ళ ముసలివాళ్ళు కూడా ఉండడం మరో విశేషం అని అదేదో పెళ్లి వార్తల పళ్ళికిలిస్తూ చదువుతున్నాడు న్యూస్ రీడరు. ఆ న్యూస్ చూస్తూ, వేడి వేడి టీని సిప్ చేస్తోంది ఆ అమ్మాయి. ఎదో గుర్తొచ్చినదానిలా లేచి లాప్టాప్ లో ఎదో సమాచారం కోసం వెతికింది. అది దొరకగానే, ఆమె మోహంలో చిన్న సంతృప్తి కనపడింది. వెంటనే లేచి జుట్టుని గట్టిగ పైకి ముడి వేసింది. చున్నీని తలపాగాల చుట్టి దాన్నే మాస్క్ లాగా మొహానికి కట్టింది. మాములుగా అప్పటిదాకా కట్టుక్కున నల్ల చీరను పైకి మడిచి దోతిల వెనక్కి దోపింది. కొంగుని గట్టిగ నడుము చుట్టూచుట్టి ముడివేసింది. ఆమెకు కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకుని మరో వస్త్రంలో మూటకట్టి భుజానికి వేసుకుంది. చూస్తుండగానే ఆమె గోడలను పట్టుకుని పదంతస్తుకు చేరుకుంది. అక్కడ నలభై ఐదు మంది తప్పిపోయినవారు తాళ్లతో బంధించి ఉన్నారు. ఎవ్వరు కూడా స్పృహలో లేరు. ఒక్కొక్కరిగా వారిని చూస్తున్న ఆమె కళ్ళలో అసహ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అక్కడే ఉన్న మోటార్ ఆన్ చేసి పైపుతో నీళ్లను వాళ్ళ మొహాలకేసి కొట్టింది. ఒక్కొక్కరిగా అందరు స్పృహలోకి వచ్చారు. వారి కళ్ళలో భయం, ప్రాణాలపై తీపి, ఊపిరి పోతుందేమోనన్న ఆందోళన కనిపిస్తోంది. రుద్రకి నవ్వొచ్చింది. అందులో ఒకడు ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు మమ్మల్ని ఇలా బంధించావు?? అని అడిగాడు భయంగా. ఇంకోకడు ఎవడ్రా నువ్వు, ఇడిసెయ్యి లేదా సంపూత నిన్ను ఈడే అని బెదిరించాడు. ఆ అమ్మాయి అక్కడ ఉన్న ప్లాస్టిక్ కుర్చీని లాక్కుని కూర్చుంటూ ఇంకా అని అంది . అందరి మొఖాల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆ పైనే హేళన భావం కనిపించింది. ఏయ్ ఒక ఆడదానివైయుండి, ఇంత మంది మగాళ్లని కిడ్నప్ చెయ్యడానికి ఎంత ధైర్యమే అని అడిగాడు ఓకడు రుద్రా……..
Super super super super super super 👏👏👏👏👏👏👏👏
Super super supersuper super super 👏👏👏👏👏👏👏👏
Ikkada Andharu Expect Chesedhi Veru Meeru Raasindhi Veru…. Vaatini Post Cheyyadaaniki verey sites unnayi , do prefer that , you may not get readers bcz of this fucking Generation, even I am one of them .but anywasy Your Writing Skill Is Very Good .we hope You Will Become a Good writer
Nice