నా పేరు రుద్రా అని అన్నది ఆ అమ్మాయి ఇది దీని పనయుండదు బ్రో?? ఖచ్చితంగా దీని వెనక ఎదో పెద్ద నెట్వర్క్ ఉంది అని అన్నాడు పక్కన ఉన్నావాడు . ప్లీజ్, అక్క నన్ను వదిలేయ్. నేనేమి చేశాను? నన్నెందుకు తీసుకొచ్చారు? అని సెంటిమెంట్ ప్రయోగించాడు ఒక భయస్తుడు. ఏంట్రా?? మిమ్మల్ని వదిలేయాల?? సరే వదిలేస్తా. ఇక్కడి నుండి కిందకి వదిలేస్త, మీ ప్రాణాలు మీరే పైకి వదిలేస్తారు. అని అంటున్న రుద్రా గొంతులో కఠినత్వం తాండవిస్తోంది. ఏవతివే నువ్వు లం ….. అని అంటున్న ఒకడి మాట బయటకి రాకుండానే రుద్రా ఎగిరి గాలిలోనే పల్టీ కొడ్తూ ఒక్కటి వాడి గొంతు మీద కాలితో తన్నింది. అంతే….. వాడు అలాగే నెలకు ఒరిగి చచ్చిపోయాడు. ఆ ప్రదేశమంతా హాహాకారాలతో హోరెత్తిపోయింది. అప్పటిదాకా ధైర్యంగా జబ్బలు చరిచిన వాళ్లంతా ఒక్కసారిగా భయంతో కంపించిపోయారు. తడిసిన వారి శరీరాల్లో వణుకు ఆమెను మరింత బలవంతురాలిగా మార్చింది. అరుస్తున్న వారి ఆర్తనాదాలు వింటూన్నా ఆమెకు అలౌకిక ఆనందం కలిగింది. అరవండి, అరవండి ఇంకా అరవండి. మీరెంత అరిచినా కాపాడే వారు లేరు, రారు కూడా అని అంటున్న రుద్రా మొహంలో పైశాచిక చిరునవ్వు ఆ ముసుగులో కలిసిపోయింది. అమ్మ, వదిలేయమ్మ నీకు దండం పెడతాను, నీకు తండ్రిలాంటి వాడిని అని అన్నాడు ఒక 50 ఏళ్ళ వాడు. అమ్మ నాకు నీ వయసంత మనవరాలు ఉంది తల్లి నన్ను కూడా వదిలెయ్యమ్మ ప్రాధేయపడ్డాడు ఒక 75 ఏళ్ళ మరో వృద్ధుడు. కానీ రుద్ర ఏమాత్రం కూడా తొణకలేదు. పైగా గట్టిగ నవ్వేస్తూ అయ్యో మీ కోట మీకు ఉండనే ఉంది. వీళ్లందరికన్నా మీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తా, తొందరెందుకు అని అంటున్న రుద్రా కళ్ళు నిప్పు కణికల్లా మారాయి. ఆమె నరాలు పొంగి, గుండె వేగం పెరిగింది. ఆమె కళ్ళు డేగ కళ్ళకన్నా తీక్షణమైన చూపుగా మారింది. వెంటనే ఆమె తిరిగి 8వ అంతస్తులోకి దూకింది. లాప్ టాపులో సెక్యూరిటీ అధికారి హెడ్ క్వార్టర్స్ నెట్వర్క్స్ ని హ్యాక్ చేసి, ఒక కెమెరాను తీసుకుని ఆ 44 మందిని లైవ్లో ప్రసారం చేసింది.
ఇది జరగడానికి కొన్ని గంటల ముందు:
సెక్యూరిటీ అధికారి హెడ్క్వాటర్స్ హైదరాబాద్:
అన్ని ఫోనులు ఒకేసారి మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. నలభై ఐదు మంది ప్రముఖుల పిల్లలు, బంధువులు, స్నేహితులు కిడ్నపుకి గురికావడం అది ఒకేరోజు కొన్ని గంటల వ్యవధిలోనే అవడంతో సెక్యూరిటీ ఆఫీసర్లు తలలు పట్టుకున్నారు. అత్యవసర మీటింగు ఆరెంజ్ చేసారు. IGతో పాటు రాష్ట్ర హోమ్ మినిస్టర్ మందిర నాయుడు కూడా ఆ మీటింగుకి అటెండయ్యింది. కారణాలు వెతికే పనిలో పడ్డారు మిగతా సెక్యూరిటీ ఆఫీసర్లు.ఈ కేసును అసిస్టెంట్ కమీషనర్ సూర్యకి అప్పచెప్పింది హోమ్ మిస్టర్. ఆయన టేకప్ చేసిన ఏ ఒక్క కేసు కూడా సాల్వ్ అవకుండా పెండింగులో లేదనే టాక్ ఉంది. అందుకే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్స్ ని కాదని, ఆయనకు బాధ్యతలు అప్పగించారు. చుడండి సూర్య, మీకు ఎంత బ్యాకప్ కావాలన్నా తీసుకోండి కానీ ఐ వాంట్ దట్ బాస్టర్డ్స్ ఇమ్మీడియేట్ల్య్ అని అన్నది మందిర డెఫినెట్ల్య్ మేడం, 24 అవర్స్ లో వాళ్ళ ఎజెండా ఏమిటో కనుక్కుంటాను అని సెల్యూట్ చేసి బయటకి వస్తుండగా, ఒక కానిస్టేబుల్ కంగారుగా పరిగెడుతూ వచ్చాడు. ఏమిటన్నట్టుగా చూసాడు సూర్య. సర్ మీరొక్కసారి కంట్రోల్ రూముకి వస్తారా ??? అని అడిగాడు. అతని కళ్ళలో భయం అర్థంచేసుకున్న సూర్య కంట్రోల్ రూమ్ వైపు పరిగెత్తాడు. ఆ వెనకే మందిరతో పాటూ అందరు వెళ్లారు. టీవిలో రుద్రా నలభై నాలుగు మందిని బంధించిన వీడియో క్లిప్ చూపిస్తోంది. సెక్యూరిటీ ఆఫీసర్లకు చెమటలు పట్టాయి. నోరెళ్ళ పెట్టి చూస్తున్న అందరిని అలెర్ట్ చేసాడు సూర్య. ఆ కంప్యూటర్ IP అడ్రెస్స్ కనిపెట్టమని పురమాయించాడు. మందిర జాగ్రత్తగా ఆ వీడియో చూస్తోంది. అంతే ఒక్కసారిగా, అన్ని ఫోన్లు రింగ్ అయ్యి , ఒకేసారి కట్ అయ్యాయి. ఆలా మూడు సార్లు చేసింది రుద్రా. నాలుగోసారి ఒక్క ఫోన్ మాత్రమే ఆగకుండా మోగింది. సూర్య ఎత్తగానే, రుద్రా హలో సార్ బాగున్నారా?? అని అడిగింది. అంతే సెక్యూరిటీ ఆఫీసర్లతో పాటు మందిర కూడా ఆశ్చర్యపోయింది. వాళ్ళు వెతుకుతున్న క్రిమినల్ ఒక లేడీ అవడం వాళ్ళకి దిమ్మ తిరిగినట్టయింది. రుద్రా కొనసాగించింది. అనుకున్నాను ఈ కేసు మీ దగ్గరకే వస్తుందని. కానీ మీ ట్రాక్ రికార్డులో సాల్వ్ అవ్వని ఒక కేసుగా మిగిలిపోతుంది. మీ బ్యాడ్ లక్ అని అన్నది రుద్రా చూడు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్, మర్యాదగా అని మాట్లాడుతున్న సూర్యని మధ్యలోనే ఆపింది రుద్రా. సారు….. నేను మాట్లాడడానికి జేసినా. మీరు చెప్తే విననికి కాదు అని అన్నది రుద్రా. సూర్య ఫోన్ ట్యాప్ చెయ్యమని సైగ చేసాడు. ఓకే మీకు కావాల్సింది, ఈ 44 మంది ప్రాణాలతో మీకు అప్పజెప్పడం, అంతేకదా. అయితే మనం ఒక డీల్కి వద్దాం. నేను ఈ 44 మందిని వదిలేస్తాను, కానీ మీరు 450 మందిని చంపాలి. అది కూడా మీరేం కష్టపడక్కర్లేదు. వాళ్ళ ఫోన్ నంబర్లు, లొకేషన్స్ తో సహా మీకు మీ స్టేషనుల పరిధిలోకి వచ్చే కేసుల లిస్ట్ పంపిస్తాను. మీరు చేయవలసిందల్లా వాళ్ళను ఎన్కౌంటర్ చెయ్యడమే అని అన్నది రుద్రా. ఆమె కళ్ళలో ఏ బెరుకు లేదు, గొంతులో గాంబీర్యం ఉట్టి పడింది. వింటున్న అందరికి ముచ్చెమటలు పట్టాయి. వాట్?? ఏమాట్లాడ్తున్నావో నీకైనా అర్ధమవుతుందా??? 45 మంది కోసం 450 మందిని చంపాలా ?? అది సెక్యూరిటీ ఆఫీసర్లే ఎన్కౌంటర్ చెయ్యాలా??? ఇంపాసిబుల్. మేము చెయ్యం అని అన్నాడు సూర్య తల పట్టుకుంటూ. రుద్రా మీ ఇష్టం సార్, మీరు చంపకపోతే నేనే చంపేస్తా, నాకది మ్యాటరే కాదు. ఎందుకైనా మంచిది మీకైతే లిస్ట్ పంపిస్తున్న చుడండి. మనలో మన మాట, ఈ ముచ్చట మీకు నాకు మధ్యనే ఉండనివ్వండి అని చెప్పి కాల్ కట్ చేసి, లిస్టులు పోలిస్ స్టేషన్లకు పంపింది.

Super super super super super super 👏👏👏👏👏👏👏👏
Super super supersuper super super 👏👏👏👏👏👏👏👏
Ikkada Andharu Expect Chesedhi Veru Meeru Raasindhi Veru…. Vaatini Post Cheyyadaaniki verey sites unnayi , do prefer that , you may not get readers bcz of this fucking Generation, even I am one of them .but anywasy Your Writing Skill Is Very Good .we hope You Will Become a Good writer
Nice