రుద్రా

IP అడ్రెస్స్ ట్రేస్ అవట్లేదు సార్. కారణం ఆమె ఉపయోగిస్తున్న శాటిలైట్ మనది కాదు, ఇజరయిల్ దేశానిది. అది మనం హాక్ చెయ్యలేం. ఇక ఆమె ఫోన్ కూడా ట్యాప్ చెయ్యలేం ప్రతి సెకనుకి లొకేషన్ మారిపోతుంది సర్ అని అన్నాడు కమ్యూనికేషన్స్ ఆఫీసర్. సార్ లిస్టు వచ్చింది. మన పరిధిలోకి 15 మంది పేర్లు, అడ్రెస్సులు ఉన్నాయి అని అంటూ ఒక SI కొన్ని పేపర్లు చూపించాడు. మై గాడ్. ఓకే ఈ పదిహేను మంది ఇన్ఫర్మేషన్ తియ్యండి. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రి డీటెయిల్స్ అబౌట్ థెం అని అన్నాడు సూర్య. వైట్ బోర్డు మీద ఎదో రాసుకుంటూ. కాసేపటికి మరో 12 మంది కిడ్నప్ అన్న వార్త కలకలం రేపింది. మీడియా, పత్రికలూ మండిపడ్డాయి. చేతకాని సెక్యూరిటీ ఆఫీసర్లంటూ దుమ్మెత్తి పోశాయి. ఆ 12 మంది ఆమె ఇచ్చిన లిస్టులో ఉన్నవారే వేరు వేరు స్టేషన్ల పరిధిలోకి వస్తారు. రుద్రా ఫోన్ చేసింది. అప్పటిదాకా సూర్య గొంతులో వినిపించిన కాన్ఫిడేన్స్ తగ్గింది. రుద్రా సార్, నేను చెప్పింది చెయ్యడం తప్ప మరో గత్యంతరం లేదు మీకు అని అన్నది ఎగతాళిగా షట్ అప్….. ధైర్యం ఉంటె నా ముందుకొచ్చి మాట్లాడు, ఇలా దొంగలాగా దాక్కొని కాదు. మీరెంత మంది ఉన్నా, మిమ్మల్ని నేనొక్కడినే పట్టుకుని కటకటాల వెనక్కి నెడతాను. అస్సలు ఇది ఎవరు నిన్ను చెయ్యమన్నారో వాళ్ళకు చెప్పు ?? గంటలో 12మందిని కిడ్నప్ చేశావంటే చాలా నెట్వర్క్ ఉంది నీకు అని అన్నాడు సూర్య అసహనంగా ఆమె నుండి మరింత సమాచారం రాబట్టేందుకు. ఆమె మెదడు పాదరసంలా పనిచేస్తోంది. ఎంతవరకు వాళ్లకు చెప్పాలో, ఏది చెప్పాలో ముందే ఆమె నిశ్చయం చేసుకుంది. హ…. హ …..హహ…… నా వెనక ఎవరో ఉన్నారా ?? ఎందుకు ఆలా అనుకుంటున్నారు ?? ఆడదాన్ని, అశక్తురాలిని, అబలను అనేగా. ఆడదాని శక్తి యుక్తుల ముందు అస్సలు మీరెంత మీ బలగమెంత?? ఒక మగువ తలుచుకుంటే రాజ్యాలేల గలదు. శ్రీకృష్ణుడంతటి వాడికే నరకాసురుని చంపడానికి సత్యభామ అవసరం అయ్యింది. శివుని విల్లుని ఆ సీతమ్మ ఎత్తి, అది ఎత్తగలిగిన రాముడిని పెళ్లాడింది. దేవదేవుళ్లే ఆడదాని ముందు మోకరిల్లారు ఇక మీరెంత?? అయినా నా నెట్వర్క్ పక్కన పెట్టండి. మీ నెట్వర్క్ మీకుంది కదా. అదే దమ్ము మీకు ఉంటె, 24 గంటల్లో నన్ను పట్టుకోండి లేదా ఇంకెప్పుడు నన్ను పెట్టుకోలేరు అని గట్టిగా నవ్వింది రుద్రా నోరుముయ్యి, యు బిచ్, నాటకాలాడుతున్నావా ?? నువ్వు చెప్పిందల్లా చెయ్యడానికి నువ్వేం నా ఉంపుడుగత్తేవ ?? అని ఫైర్ అయ్యాడు సూర్య. రుద్రా కాల్ కట్ చేసింది. ఈ లోపు ఆ 15 మంది ట్రాక్ రికార్డ్స్ చెక్ చేసారు సెక్యూరిటీ ఆఫీసర్లు. అందరి మీద కేసులు ఉన్నాయ్, కానీ అందులో ఉన్న కామన్ పాయింట్ ఆడది. వాళ్లంతా అమ్మాయిలపై అకృత్యాలకు, అఘాయిత్యాలకు పాల్పడ్డ వారే. ప్రేమించలేదని ఆసిడ్ పోసిన వాడి దగ్గర నుండి అమ్మాయిలను విదేశాలకు అమ్మేసే బ్రోకర్లు, రేప్ చేసి చంపేసిన వెదవల దాక ఉన్నారు. ఈ 15 మందే కాదు, ఆమె ఇచ్చిన 450 మందికి ఇలాంటి నేర చరిత్రే ఉంది. కానీ వాళ్లెవరు జైళ్లలో లేరు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు కారణాలు చాలానే ఉన్నాయ్. మన రాజ్యాగంలో ఉన్న లొసుగులు, చట్టాల్లో బొక్కలను ఉపయోగించుకుని బయట తిరుగుతున్నారు. అప్పటికి కానీ అర్ధం కాలేదు సూర్యకి ఆమె అజెండా ఏమిటో. ఇంతలో టీవిలో న్యూస్ కిడ్నపైన పన్నెండు మంది దారుణ హత్యకు గురయ్యారని వారి శరీరాలపై ఆకాశంలో సగం – రుద్రా ఆన్నా లేఖ ఉందన్నా వార్త మళ్ళి రాష్టాలను కుదిపేసింది. స్వయంగా హోమ్ మినిస్టరే రుద్రతో మాట్లాడాలనుకుంది. ఆలా ఒక గంట తరువాత రుద్రా ఫోన్ చేసింది సార్ ఎలా ఉంది నేనిచ్చిన బహుమతి?? అని అడిగింది రుద్రా పైశాచికంగా నవ్వుతు. టెంపర్ లాస్ అయినా సూర్య ఏయ్ నువ్వు అస్సలు ఆడదానివేనా?? మనుషులను పిట్టల్ని చంపినట్టు చంపుతున్నావ్?? నువ్వు నాకు దొరికిన రోజు నిన్ను నీ చావు ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది రాసిపెట్టుకో అని తిడ్తున్న అతని చేతిలోనుండి రిసీవర్ లాక్కుంది మందిర రుద్రా నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్న. మీ అజెండా నాకు అర్థమైంది. ఒక మహిళగా నువ్వు చేస్తోంది సమర్థిస్తాను కానీ ఒక స్టేట్ హోమ్ మినిస్టర్ గా మాత్రం నేను సమర్ధించలేను. నువ్వు చేస్తోంది తప్పు, వాళ్ళని వదిలి లొంగిపో, నేను హామీ ఇస్తున్న నీ ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టనివ్వను అని అన్నది మందిర. నా ప్రాణానికి హామీ మీరే కాదు మేడం, ఆ దేవుడు కూడా హామీ ఇవ్వలేడు?? అయినా సరే, మీరడిగినట్టే చేస్తా కానీ ఇప్పుడు కాదు, నేను చెప్పింది మీరు చేసాక అని అన్నది రుద్రా స్థిరంగా. ఆలా అమాయకులను చంపడం, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం?? అని అడిగింది మందిర తీవ్ర స్వరంతో అమాయకుల? ఎవడు మేడం?? నేను చంపినా 12 మందిలో ఏ ఒక్కడు కూడా మనిషి కాదు, జనారణ్యంలో యథేచ్ఛగా తిరుగుతున్నా మానవమృగలు. అభం, శుభం తెలియని ఆడపిల్లల్ని, మేకపిల్లల్ని అమ్మినట్టుగా అమ్ముతుంటాడు ఒకడు. ఆ ఆడపిల్లలకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చి, 9 ఏళ్ల పిల్లని కూడా పెద్దమనిషిని చేసి, ప్రాస్టిట్యూటుగా మార్చి డబ్బులు దండుకుంటాడు, మరొక్కడు. వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి, వాడు పాడుచేసేదే కాక ఫ్రెండ్లకి ప్రసాదం పంచినట్టు పంచి, అమ్మాయిని 6 నెలలుగా అత్యాచారం చేసేవాడు మరొక్కడు అని అంటున్న రుద్రా గొంతు జీరా పోయింది. తిరిగి ఆమె ఈ12 మందే కాదు 450 మందికి కూడా ఇలాంటి చరిత్రే ఉంది. మీరు వదిలిపెట్టిన, వాళ్ళను నేనొదిలిపెట్టను. ఒక్కొక్కడిని వెతికి, వేటాడి, వేంటాడి చంపుతాను. ఆడదాని ప్రాణంతో, మానంతో ఆటలాడే ప్రతి ఒక్కడిని, వంతుల వారీగా లెక్కలేసి మరి చంపుతాను అని గట్టిగా పళ్ళు కొరుకుతూ చెప్పింది రుద్రా. రుద్రా నేను అర్ధం చేసుకోగలను. కానీ మనం ఒక సమాజంలో బ్రతుకుతున్నాం, కొన్ని చట్టాలు చేసుకున్నాం. వాటిని మనం మన చేతుల్లోకి తీసుకోలేము.

4 Comments

  1. Super super super super super super 👏👏👏👏👏👏👏👏

  2. Super super supersuper super super 👏👏👏👏👏👏👏👏

  3. Ikkada Andharu Expect Chesedhi Veru Meeru Raasindhi Veru…. Vaatini Post Cheyyadaaniki verey sites unnayi , do prefer that , you may not get readers bcz of this fucking Generation, even I am one of them .but anywasy Your Writing Skill Is Very Good .we hope You Will Become a Good writer

Comments are closed.