రుద్రా

నా మాట విను, కచ్చితంగా ఆ క్రిమినల్స్ అందరికి శిక్ష పడేలా నేను చూస్తాను అని అంటున్న మందిర మాటను పూర్తికాకుండానే రుద్రా శిక్ష….. శిక్ష?? ఒక అమ్మాయిని సాక్షాత్తు రాజధానిలో నగరమంతా తిప్పుతూ అత్యాచారం చెయ్యడమే కాకా ఆమె ప్రాణాలుపోడానికి కారణమైన వాడిని, వయస్సు తక్కువని 3 సంవత్సరాల జైలు శిక్ష వేసి, బయటకి పంపడమా మీరు వేసే శిక్ష. 17 సంవత్సరాల అడ్డగాడిద అత్యాచారం చేస్తే, వాడు బాలుడా?? ఇదేనా మీరు చెయ్యబోయే న్యాయం. ప్రేమించలేదని అమ్మాయి మొహం మీద ఆసిడ్ పోస్తే, ఈవ్ టీసింగ్ కేసు కింద FIR రాసి, వాడిని మూడు నేల్లకే వదిలేయడమా, మీరు చేసే చట్టం?? మీరు చెప్పిన అదే సమాజంలో తప్పుచేసిన వాడు తలెగరేసి తిరుగుతుంటే, ఆ తప్పుకు బలైపోయిన ఆ అమ్మాయి మాత్రం, మొహానికి ముసుగేసుకుని, అవమానాలను భరిస్తూ, ఆ మచ్చను జీవితాంతం మొయ్యాలి. అలంటి అమ్మాయిలకు జరిగిందా మీరు చెప్పిన న్యాయం?? సగటున ప్రతి పదిమంది అమ్మాయిల్లో, ఇద్దరమ్మాయిలు ఇలాంటి అకృత్యాలకు, అఘాయిత్యాలకు బలవుతున్నారంటే మీరు పుట్టించాల్సింది ‘చట్టాలు’ కాదు, తప్పు చెయ్యాలనే ఆలోచన వచ్చిన ప్రతి మగవాడి ఒంట్లో ‘భయాన్ని’, చంపాల్సింది ఈ ‘మృగాల’నే కాదు, ఆడపిల్లలకు న్యాయం జరగదనే ‘అభిప్రాయా’న్ని అని అంటున్న రుద్రా మాటల్లో నిజాన్ని గ్రహించింది హోమ్ మినిస్టర్ మందిర సరే నువ్వు అంటోంది నిజం కానీ నువ్వు అడుగుతోంది మా చేతుల్లో లేనిది?? ఎన్కౌంటర్ 450 మందిని ఒకేసారి చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో నీకు తెలియంది కాదు. హ్యూమన్ రైట్స్ అని, కోర్ట్స్ అని మా నెత్తి మీద ఉన్నాయి కదా అని అడిగింది మందిర. మీరేం భయపడకండి. దీనికి కూడా నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. నేను చెప్పినట్టు చేస్తానంటే వాళ్ళందరిది నాచురల్ డెత్ లాగా క్రియేట్ చేయొచ్చు అని అన్నది రుద్రాచెవిలో ఉన్న బ్లూ టూత్ ని సరిచేసుకుంటూ ఎలా? అని అడుగుతున్న మందిర వైపు చూస్తూ సైగ చేసాడు సూర్య. నో మేడం ఇది చెయ్యడానికి మీరు ఒప్పుకుంటున్నారా ?? అని అడిగాడు విందాం ఎం చెప్తుందో అన్నట్టుగా సైగ చేసింది మందిర పక్కనే ఉన్న గ్లాస్ లోని నీళ్లు రెండు గుటకలు వేసి రుద్రా సింపుల్ మేడం వాళ్ళను షూట్ చెయ్యడమో లేక కత్తితో చంపడమొ కాకుండా నేను చెప్పే ఒక డ్రగ్ కంపొజిషన్ మెడ వెనక భాగంలో ఇంజెక్ట్ చెయ్యండి అంతే హార్ట్ ఎటాకనో, లేక కార్డియాక్ అరెస్టనో అంటారు. పోస్ట్ మార్టంలో కూడా కనిపెట్టలేరు అని అన్నది చైర్లో వెనక్కి వాలి కూర్చుంటూ బ్రిలియెంట్, నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకుని చెప్తాను. ఒక అరగంట తరువాత ఫోన్ చెయ్యి అని మందిర పెట్టేసింది మేడం ఏంటిది ?? ఆమె చెప్తోంది మనం చెయ్యలేం. అది మీకు కూడా తెలుసు అని అన్నాడు సూర్య ఐనో ఎవరిథింగ్ సూర్య. నేను వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ చెక్ చేయించాను. ప్రతి వాడు క్రిమినలే. అలంటి వాళ్ళు చచ్చిన దేశానికి వచ్చిన నష్టంమేమి లేదు. పైగా అలంటి వాళ్ళని చంపితే అలంటి మృగాళ్లకు కూడా బుద్దొస్తుంది, ఆలోచించండి. మనకు ఆమె చెప్పినట్టు, చెయ్యడం తప్ప మరొ మార్గం లేదు. అవసరమైతే నేను సీఎంతో మాట్లాడతాను మీరు ఆ పనిలో ఉండండి. అని అంటూ అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి, ఫైల్ నా టేబుల్ మీదకి పంపించామని ఆదేశాలు జారీ చేసి వెళ్ళిపోయింది. సూర్య మెల్లిగా లేచి నిలబడ్డాడు. చెప్పండి టీం, ఏంచేద్దాం. మీ అభిప్రాయాలూ చెప్పండి అని అడిగాడు. సర్, రాజకీయ వత్తిళ్లకు లొంగి, పై అధికారుల మాటలకూ దడిచి మా డ్యూటీ మేము చెయ్యలేదు. కానీ ఇప్పుడు మనల్ని ఆపె వాళ్లే లేరు. అని అన్నది ఒక లేడీ SI లేదు సర్ దీనివల్ల మనం చాలా సమస్యలు ఎదురుకోవాలి. ఈ నిజం బయటకి వస్తే మన తప్పు లేకున్నా ట్రాన్స్ఫర్లు చేస్తారు, సస్పెండ్ చేస్తారు ఒక్కోసారి ఉద్యోగమే పోవచ్చు. అప్పుడు మనం మన ఫామిలీస్ తో రోడ్డుపైకి వస్తాం అని అన్నాడు మరో SI అమ్మాయిల పై అఘాయిత్యాలకు పాల్పడే వారిని మనం ఎం చేయగలిగాము సర్? నాకు 13 ఏళ్ల అమ్మాయి ఉంది. అది రోజు స్కూల్కి సిటీ బస్సులో వెళ్లివస్తోంది. ఒకడు ఆమె చెప్పుకోలేని చోట గోర్లు దిగేలా గాయం చేస్తే, వచ్చి చెప్పుకుని ఏడ్చింది. కానిస్టేబుల్ ఐన నేనే కేసు పెడితే, వాడు ఒక ‘రౌడి’. కేసు వాపసు తీసుకోకపొతే మా ఇంట్లో ఆడవాళ్ళని బజారులో చూసుకుంటానని బెదిరించాడు. ఏమి చెయ్యలేని నిస్సహాయత కేసు వాపసు తీసుకున్నాను. సెక్యూరిటీ ఆఫీసర్ కూతురుకే న్యాయం జరగకపోతే ఇక సామాన్య జనానికి ఎలా జరుగుతుంది ?? అప్పుడు నా బిడ్డ పడ్డ కష్టం చిన్నదయుండొచ్చు కానీ ఆమె మనసుకు తాకిన గాయం ఎప్పటికి మానదు. ఇప్పుడు అలాంటి కుక్కలని వీధిలో నిలబెట్టి కాల్చే అవకాశం వచ్చింది అన్నాడు ఆవేశంగా ఏడుస్తూ. అక్కడ అందరి కళ్ళు చెమ్మర్చాయి. ఈ ఆపరేషనులో ఎంతమంది నాతో ఎస్ అంటున్నారు అని అడిగాడు సూర్య అందరు చేతులు లేపారు. టీంని అలెర్ట్ చెయ్యండి, అందరిని మనం చంపేస్తున్నాం. అండర్గ్రౌండ్ కాప్స్ కూడా ఇవాళ ఆన్ డ్యూటీలో ఉండమనండి. గంటకు 30 మంది చొప్పున 15 గంటల్లో పని పూర్తవ్వాలి. అప్పటిదాకా నో రిలాక్సేషన్ అని చప్పట్లు చరుస్తూ పని పురమాయించాడు సూర్య. 15 గంటలు గడిచేసరికి మొత్తం 450 మంది వివిధ ప్రాంతాలలో ఒకే విధంగా చచ్చారు. ఈ విషయం ఎక్కడ మీడియాలో రాలేదు. కారణం లేకపోలేదు. ఒక్క చిన్న క్లూ కూడా వాళ్లకు దొరకలేదు, దొరికిన చెప్పే ధైర్యం చెయ్యలేదు.

4 Comments

  1. Super super super super super super 👏👏👏👏👏👏👏👏

  2. Super super supersuper super super 👏👏👏👏👏👏👏👏

  3. Ikkada Andharu Expect Chesedhi Veru Meeru Raasindhi Veru…. Vaatini Post Cheyyadaaniki verey sites unnayi , do prefer that , you may not get readers bcz of this fucking Generation, even I am one of them .but anywasy Your Writing Skill Is Very Good .we hope You Will Become a Good writer

Comments are closed.