రుద్రా ఫోన్ చేసే సమయానికి పని పూర్తయింది. చాలా థాంక్స్, సూర్యగారు. నాకు తెలుసు మీరు ఈ పని చేస్తారని అని అన్నది. ‘రుద్రా….. ఆ నలభై ఐదు మందిని విడిచి పెట్టి, ఇప్పటికైనా నువ్వు కూడా లొంగిపో అని అన్నాడు సూర్య. సారీ సర్ 44 మందే ఉన్నారు, ఒక్కడిని ఆల్రెడీ చంపేసాను అని అంటు రుద్రా లాప్టాప్ మూసింది ఎక్సపెక్ట్ చేశాను రుద్రా….. అస్సలు నువ్వు ఆ 45 మందిని ఎందుకు కిడ్నప్ చేసావో నాకు తెలుసు అని అన్నాడు సూర్య మీరు ఉహించగలరని, అతడి సమర్థులని కూడా నాకు తెలుసు. వీళ్లంతా నేరాలు చేసినవాళ్ళే కానీ ప్రముఖులు, వారి పిల్లలు, బంధువులు వీళ్ళలో మీ డిపార్టుమెంటుకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళను అడ్డంపెట్టుకుంటే నాకు రెండు పనులు జరుగుతాయి. ఒకటి వీళ్లకోసమైన నేను చెప్పింది మీరు చేస్తారు. రెండోది, నేను ఇచ్చిన లిస్టులో ఇలాంటి బిగ్ షాట్స్ ఉంటె మీరు వాళ్ళకి మినహాయింపు ఇస్తారు. అందుకే అలాంటోళ్ళనే ఏరి కోరి కిడ్నప్ చేశాను అని అంది నవ్వుతు మరి వాళ్ళనేం చెయ్యబోతున్నావ్?? అని అడిగాడు సూర్య రుద్రా ఏమి మాట్లాడకుండా మిన్నకుండిపోయింది. సరే చెప్పొద్దూ….. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు, వీళ్లందరి డేటా నీ దగ్గరకు ఎలా వచ్చింది?? నువ్వు ఎలా సంపాదించావు ?? నీకు ఎవరు సహాయం చేస్తున్నారు ?? ప్లీజ్ చెప్పు ?? అని అడిగాడు సూర్య తప్పు చేసిన వాడు చట్టం నుండి, న్యాయం నుండి తప్పించుకోవచ్చు కానీ వాడి ‘కర్మ’ నుండి తప్పించుకోలేడు. ఆ కర్మ ‘నేనే’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది రుద్రా. ఆలా పెట్టేసిన గంట తర్వాత న్యూస్లో 45 మందిని కిరాతకంగా హత్య చేసారని న్యూస్ వచ్చింది. సూర్య బాధ్యత తీసుకుంటూ ప్రెస్ మీట్ పెట్టి, పదవికి రాజీనామా చేసాడు. ఈ హత్యలు జరగడానికి కారణాలు ఏవైనా, ఈ కేసు సాల్వ్ చేయనందుకు నేనేమి బాధపడట్లేదు, గర్వంగా ఫీల్ అవుతున్నాను అని అన్నాడు సూర్య.
రెండు రోజుల తరువాత
కేరళలో ఆకాశం ప్రకృతి – రుద్రా అన్న లేఖతో పాటు 45 మంది కిడ్నప్ అయ్యారని వార్త చదివిన సూర్య, వెంటనే లేచి ఆకాశంవైపు చూస్తూ సెల్యూట్ చేసాడు. రుద్రా ఒక పాడుబడ్డ బంగ్లా టెర్రస్ పై నిలబడి, రెండు చేతులు నడుము మీద పెట్టుకుని, చీకటిలో వెలిగిపోతున్న నగరాన్నీ చూస్తూ చిరునవ్వు నవ్వింది.
************** సమాప్తం*********

Super super super super super super 👏👏👏👏👏👏👏👏
Super super supersuper super super 👏👏👏👏👏👏👏👏
Ikkada Andharu Expect Chesedhi Veru Meeru Raasindhi Veru…. Vaatini Post Cheyyadaaniki verey sites unnayi , do prefer that , you may not get readers bcz of this fucking Generation, even I am one of them .but anywasy Your Writing Skill Is Very Good .we hope You Will Become a Good writer
Nice