సంపద

అయినా నాకు పెళ్ళైతే ఏంటి అన్నయ్యా,నేను ఎప్పుడూ నిన్ను వదిలి వెళ్లను అన్నాను మొండిగా.

పిచ్చి ఐషూ,ఇవన్నీ కొన్నిరోజులే రా..మగాడికి జీవితం పైన పరిమితులు ఉండవు గానీ ఆడదానికి మాత్రం చాలా పరిమితులు ఉంటాయి..ఆ పరిస్థితులు వల్ల నువ్వనుకున్నవి కొన్ని మాత్రమే జరిగి కొన్ని అలాగే మిగిలిపోతాయి..

నువ్వేమైనా చెప్పు అన్నయ్యా నేను మాత్రం నిన్ను వదిలి వెళ్లను నిజం చెప్పాలంటే మా వాళ్ళ తర్వాత నాకు ఇష్టం ఉన్న మనిషి వి నువ్వే అన్నాను అభిమానంగా..

చాలా సంతోషంగా ఉందిరా ఐషూ నీ మాటలకి,నిన్ను చిన్నప్పటి నుండి చూసిన నాకు ఆ మాత్రం తెలుసులే అంటూ ప్రేమగా నా నుదుటన ముద్దు పెట్టాడు.. ఆ ముద్దులో ప్రేమ స్పష్టంగా తెలిసింది నాకు,మామూలుగా అయితే నాని స్పర్శ తగిలిన వెంటనే నా శరీరం అదో రకమైన హాయికి గురయ్యేది కానీ ముద్దు పెట్టుకున్నా కూడా నాలో ఏ భావనా కలగకపోగా తనపైన మరింత ఇష్టాన్ని పెంచింది..

నాకూ అన్నయ్యని ముద్దు పెట్టుకోవాలి అన్న కోరిక బలీయంగా అనిపించినా ఆపుకొని థాంక్స్ అన్నయ్యా అన్నాను..

అలాగే రా,ఎప్పుడూ మనం ఇలాగే ఉండాలి సరేనా అని నవ్వగా అలాగే అన్నయ్యా అన్నాను కాసింత బాధతోనే..ఎందుకంటే ఎప్పుడూ ఇలాగే ఉంటే నా మనసులోని భావనల్ని చెప్పే అవకాశం రాదు అని..