సంపద

వైశాలి : ఎక్కడే బాబూ,నిన్ననగా వచ్చాడు.మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో మామయ్య కి..కనీసం పలకరించనేలేదే బాబూ.

సుకన్య : హ హ్హా తెలిసిందే గా వైషూ,మామయ్య ఎప్పుడూ ఆడాళ్ళకి దూరంగా ఉంటాడని,నువ్వే మాట్లాడకపోయావా??

వైశాలి : హా అదీ చేద్దామనుకుంటే మా నాన్న ఒకడు,అప్పుడే బయటికి తీసుకెళ్లాడు..

సుకన్య : నవ్వుతూ నేనైతే మాట్లాడానే వైషూ,ఇంకో పది రోజులు ఇంటి దగ్గరే అంట చెప్పాడు.

వైశాలి : ఒసేయ్ దొంగదానా,మామయ్య ని వలలో వేసుకుంటున్నావా??చంపేస్తా వెధవ వేషాలు వేశావంటే..

సుకన్య : అబ్బో చూడవే ఐశ్వర్యా, నేను నీ కన్నా ముందు పుట్టానే వైషూ,ఏ వలలో వేసుకుంటే తప్పేంటో??నువ్వూ చేస్తున్నావ్ గా ప్రయత్నం, నన్ను అంటావ్ దేనికీ??

నేను : హబ్బా ఆపవే సుకన్యా,దాని గురించి తెలిసిందే గా..అయినా మీలో మీరు ఇలా అనుకోవడమే తప్ప ఎప్పుడైనా నాని అన్నయ్య తో సరదాగా గడిపారా??అయినా అన్నయ్య కి టౌన్ లో ఎవరో ఒకరు ఉండివుంటారు అనవసరంగా మీరు ఆశలు పెట్టుకోవడం మంచిది కాదు.

సుకన్య, వైశాలి ఇద్దరూ ఒసేయ్ ఇంకోసారి అలా అన్నావంటే చంపేస్తాం అని అనేసరికి అమ్మో వద్దులే మీ ప్రయత్నాలేవో మీరు చేసుకోండి అని నవ్వేసాను..

సుకన్య మాట్లాడుతూ ఒసేయ్ వైషూ మనిద్దరిలో ఎవరో ఒకరం నాని మామయ్య ని పెళ్లి చేసుకోవాలే, మన ఇంట్లో కూడా అదే విషయం ఎప్పటినుండో అనుకుంటున్నారు గా..కానీ పెళ్ళైనా మన ఒప్పందం మాత్రం మరిచిపోకూడదు సరేనా ?

అలాగేలే సుక్కూ,మామయ్య మనిద్దరి సొంతమే అది మరువకూడదు..
వీళ్ళిద్దరూ అంతలా మాట్లాడుకుంటున్న “నాని ” ఎవరో కాదు,మా బంధువే..మా దాయాదుల అబ్బాయి..వయసు ప్రకారం అన్నయ్యా అని పిలిచినా నిజానికి నాకు బాబాయ్ అవుతాడు.వయసు 23 ఏళ్ళు.. 6 అడుగులు కి పైబడే ఉంటూ వ్యవసాయం చేయడం వల్ల వంట్లో నిండా కండలతో రాకుమారుడులా ఉంటాడు..

నాని ముద్దు పేరు మాత్రమే,అసలు పేరు “సత్య”..మంచితనం అంటే సత్యా అన్నయ్యని చూస్తే తెలుస్తుంది.. మనసు వెన్న,మాట మృదువు..ఊర్లో అందరికీ తలలో నాలుకలా ఉంటాడు..చదువులో ఎప్పుడూ ముందే..వ్యవసాయ పాలిటెక్నిక్ తర్వాత అగ్రికల్చర్ Bsc చేసి ఉద్యోగం సాధించాడు తొలి ప్రయత్నం లోనే..నేలని నమ్ముకుని వ్యవసాయం చేస్తూ వ్యవసాయం చేసే వాళ్ళకి ఆధునిక పద్ధతుల గురించి అవగాహన ఇస్తూ అందరికీ సహాయపడే “నాని” అన్నయ్య అంటే ప్రాణం ఊర్లో..అన్నయ్య కుటుంబం కూడా చాలా ధనిక కుటుంబం.. ఇద్దరు సంతానం వాళ్ళ తల్లిదండ్రులు కి,అన్నయ్య హరి గ్రూప్1 సాధించి చిత్తూరు లో స్థిరపడ్డారు పెళ్లి చేసుకొని..

నాని అన్నయ్య కీ నాకూ చనువెక్కువ,చదువులో నేను ముందుండటం చూసి నన్ను ఎప్పుడూ ప్రోత్సహించడం చేసేవాడు..నిజానికి నేను చదువులో ముందున్నాను అనడానికి నిస్సందేహంగా అన్నయ్యే కారణం..నేనెప్పుడూ ఆయన్ని అన్నయ్య అనుకునేవాడిని కాదు,ఎందుకంటే నాతో అంత క్లోజ్ గా ఉండటం మూలాన ఎన్నడూ ఆయన నాకు ఒక బంధువుగా కాకుండా ఒక ఆత్మీయుడిలా అనిపించేవాడు..

సుకన్య, వైశాలి లకి మామయ్య వరస అవడం వల్ల వీళ్ళిద్దరూ నాని అన్నయ్య పైన ఎప్పుడూ ఇష్టం చూపేవారు,పైగా బంధుత్వం కూడా బలంగా ఉండటం వల్ల వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని నాని అన్నయ్యకి ఇచ్చి చేయాలని ఇంట్లో మాట్లాడుకునేవాళ్ళు..ఇక ఆ మాట తెలిసినప్పటి నుండీ వీళ్లిద్దరి ఊహలైతే మరీ ఘోరంగా ఉండేవి,ఏవేవో చేయాలని,ఎన్నెన్నో అనుభవించాలని తెగ కలలు కనేవాళ్ళు.. కుదిరినప్పుడల్లా నాని అన్నయ్య తో తెగ క్లోజ్ గా మూవ్ అవుతూ దగ్గరవ్వడానికి తెగ ప్రయత్నించేవాళ్ళు..కానీ నాని అన్నయ్య మాత్రం ఎందుకో ఆడవాళ్ళకి ఎప్పుడూ దూరంగా ఉండేవాడు,ఊర్లో ఎవరైనా నాని అన్నయ్యని ఉదాహరణగా చూపించేవాళ్ళు ఆడవాళ్ళతో ఎలా ఉండాలో అని…

నిజమే నాని అన్నయ్య ఆడవాళ్ళకి అంత గౌరవం ఇస్తాడు,ఏ అరమరికలూ లేకుండా మనసులో ఏ దురుద్ధేశాలు పెట్టుకోకుండా మాట్లాడే నాని అన్నయ్య అంటే ఊర్లో ఆడవాళ్ళకి గౌరవంతో పాటూ అదో రకమైన భావం ఉండేది.నిజం చెప్పాలంటే అతడు అడిగితే ఎలాంటి ఆడదైనా లొంగిపోయే అందం,మంచితనం ఆయన సొంతం..అన్నయ్య ని ఎప్పుడూ ఊర్లో చాలా మంది ఆటపట్టించేవాళ్ళు పెళ్లెప్పుడూ అని,దానికి ఆయన సమాధానం ఎప్పుడూ ఒకటే:నాకు పెళ్ళైతే మా అమ్మానాన్నలని చూసుకోవడం కష్టం, ఇంకా ఆగుతాను అని..

మేము కూడా వయసులోకి రావడం వల్ల ఊర్లో మగాళ్లు,రంకు జంటల గురించి తరచుగా మాట్లాడుకునేవాళ్ళం..ఊర్లో అమ్మలక్కల కబుర్లు తెగ ఆసక్తి గా వినేవాళ్ళం,ఆ అమ్మలక్కల కబుర్లలో ఫలానా ఆవిడ ఫలానా వాడితో ఉందనీ, ఫలానా పెళ్లైంది నాని అన్నయ్య ని కోరుకుంటోంది అని ఇంకా చాలా వినిపించేవి నాకు..అలా ఎక్కడ చూసినా నాని అన్నయ్య పేరు మాత్రం తెగ మారుమ్రోగిపోయేది ఆడవాళ్ళ సంభాషణల్లో..అలా నాకు ఊర్లో తెలిసిన మొట్టమొదటి మగాడి పేరు “నాని ” అన్నయ్య ది..

సుకన్య,వైశాలి లతో మాట్లాడుతున్నా ఎప్పుడూ నాని అన్నయ్య ప్రస్తావనే ఎక్కువ..వాళ్ళైతే తెగ కలవరించి సిగ్గు విడిచి మాట్లాడేవాళ్ళు అబ్బా మామయ్య ని కొరికేయాలే ఎంత ముద్దుగా ఉన్నాడో అని..ఆ మాటలు,అమ్మలక్కల మాటలు వల్ల నాని అన్నయ్య నాకు ఎప్పుడూ ఒక అన్నయ్య గా అనిపించలేదు, నన్ను ఎంత వారించుకున్నా ఒక “మగాడు” లాగే అనిపించేవాడు నా మనసుకి..

సుకన్య,వైశాలి లతో మాట్లాడుతున్నా ఎప్పుడూ నాని అన్నయ్య ప్రస్తావనే ఎక్కువ..వాళ్ళైతే తెగ కలవరించి సిగ్గు విడిచి మాట్లాడేవాళ్ళు అబ్బా మామయ్య ని కొరికేయాలే ఎంత ముద్దుగా ఉన్నాడో అని..ఆ మాటలు,అమ్మలక్కల మాటలు వల్ల నాని అన్నయ్య నాకు ఎప్పుడూ ఒక అన్నయ్య గా అనిపించలేదు, నన్ను ఎంత వారించుకున్నా ఒక “మగాడు” లాగే అనిపించేవాడు నా మనసుకి..

ఒసేయ్ ఐశ్వర్యా అన్న పిలుపుతో ఏంటే సుక్కూ అన్నాను..

ఏమీలేదే ఐశ్వర్యా నువ్వో సహాయం చేయాలే.

ఏంటే చెప్పు??నాకు చేతనైతే చేస్తాను..

ఏమీలేదే ఐశ్వర్యా, నీకు ఎలాగూ నానీ మామయ్య బాగా క్లోజ్ కాబట్టి మా ఇద్దరి విషయం మావయ్య చెవిలో వెయ్యవే బాబూ,ఏదో ఒక విషయం తెలుస్తుందిగా ..